ఈమధ్య ప్రజలు కొందరు చుట్టుపక్కల ఎంతమంది ఉన్నా తనకేం పట్టలేదన్నట్లుగా పబ్లిక్ లో రొమాన్స్ చేయడం పరిపాటుగా మారింది. ముఖ్యంగా యువత రోడ్లపై వెళ్తున్న సమయంలో ఇలాంటి నీచమైన పనులకు పాల్పడుతున్నారు. అంతేకాదు కొంతమంది సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి అదేపనిగా పబ్లిక్ లో చేయరాని పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఇలాంటి దృశ్యాలు సోషల్ మీడియాలో వచ్చినప్పుడల్లా పోలీసులు అలాంటి వారిపై కొరడా జులిపిస్తూనే ఉన్నారు. ఇకపోతే తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
CM Revanth Reddy: వారికి మాత్రమే అవకాశం.. ఉద్యోగుల బదిలీలపై సర్కార్ కండిషన్..
రాత్రి సమయంలో రోడ్డుపై వెళ్తున్న మధ్య వయసులో ఉన్న ఓ జంట కారులో ప్రయాణం చేస్తున్న సమయంలో.. వెనుక భాగంలో ఇద్దరు ముద్దులతో రెచ్చిపోయారు. కారు డ్రైవర్ ముందు డ్రైవింగ్ చేస్తుండగా కారు వెనుక సీటులో ఇద్దరు ముద్దులతో తెగ రెచ్చిపోయారు. అయితే ఈ వీడియోను ఆ కారు వెనుకల మరో వాహనంలో వస్తున్న వ్యక్తి రికార్డ్ చేసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇక అంతే ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. వైరల్ వీడియో పై నెటిజెన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.
కొందరు నెటిజెన్లు ప్రేమకు వయసు అవసరం లేదంటూ కామెంట్ చేస్తుండగా.. మరికొందరు.., కనీసం ముందు డ్రైవర్ ఉన్నాడన్న కామన్ సెన్స్ కూడా లేకుండా.. ఇలా వెనుక భాగంలో రెచ్చిపోవడం ఎంతవరకు సబబు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరైతే.. ఎంత ఆత్రంగా ఉంటే మాత్రం ఇంటికి వెళ్లే వరకైనా ఆగాల్సింది అంటూ రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను మీరు కూడా ఒకసారి వీక్షించండి.