Site icon NTV Telugu

Pakistan: భారత్‌లో ఉంటూ.. ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు.. కట్ చేస్తే..

Up

Up

సోషల్ మీడియాలో దేశ వ్యతిరేక వీడియోలను పోస్ట్ చేసినందుకు ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ ఘటన చోటు చేసుకుంది. అరెస్టు చేసిన యువకులను ఇర్ఫాన్, వాజిద్ షాగా గుర్తించినట్లు చైన్పూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఇన్‌స్పెక్టర్ అభిషేక్ కుమార్ తెలిపారు. ఓ జాతీయ మీడియా సంస్థ నివేదిక ప్రకారం.. వారిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఇది మాత్రమే కాదు.. నాలుకలు కోసేస్తామంటూ బెదిరించారు.

READ MORE: Operation Sindoor: భారత్ దాడిలో పాకిస్తాన్‌కి తీరని నష్టం.. ఏకంగా రూ. 28,000 కోట్లు ఆవిరి..

స్థానిక ఎస్‌హెచ్‌ఓ అభిషేక్ కుమార్ ప్రకారం.. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత.. స్థానిక ప్రజల్లో కోపం చెలరేగింది. పోలీసులకు ఈ వీడియో గురించి సమాచారం అందించారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. ఇర్ఫాన్, వాజిద్ షాలపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్)లోని సెక్షన్ 353 (2), ఐటి చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల మొబైల్ ఫోన్, సోషల్ మీడియా ఖాతాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారు? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.

READ MORE: Siraj : ఏడేళ్లు హైదరాబాద్‌లో సిరాజ్‌ మకాం.. గ్రూప్స్ పరీక్షల శిక్షణ పేరుతో…

కాగా.. ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్‌లో దేశ వ్యతిరేకులు బయటపడుతున్నారు. తాజాగా విడుదలైన వీడియో తీసిన వాళ్లు ఒక్కటే కాదు.. పాకిస్థాన్‌కు సపోర్టు చేసేవాళ్ల బయట చాలా మంది ఉన్నారని సోషల్ మీడియాలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇది దేశ ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా ద్వేషపూరిత, రెచ్చగొట్టే కార్యకలాపాలను ప్రోత్సహించే కుట్ర అని చెబుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు చేస్తున్నారు.

Exit mobile version