భారత్ లో అత్యధికంగా 125సీసీ బైక్‌లు సేలవుతున్నాయి. 125సీసీ సెగ్మెంట్‌లో స్పోర్టీ డిజైన్, మైలేజ్, పెర్ఫార్మెన్స్ కోసం కాంపిటీషన్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుత రోజుల్లో మార్కెట్లో TVS రైడర్, హీరో Xtreme 125R లకు విపరీతమైన క్రేజ్ ఉంది. కుర్రాళ్లు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ కేటగిరీలో ప్రస్తుతం ఎక్కువగా చర్చలో ఉన్న రెండు మోడల్స్ టీవీఎస్ రైడర్ 125, హీరో ఎక్స్‌ట్రీమ్ 125R. ఈ రెండు బైక్‌లు వాటి విభాగంలో అత్యుత్తమ ఫీచర్లు, మైలేజ్ గణాంకాలతో వస్తున్నాయి. మీరు 125cc బైక్‌ను కొనాలని ప్లాన్ చేస్తున్నట్లైతే.. ఈ రెండు బైక్‌ల ఫీచర్లు, పనితీరు, మైలేజ్ మధ్య వ్యత్యాసం వివరాలను పరిశీలిస్తే తద్వారా మీరు మీ కోసం ఉత్తమ బైక్‌ను ఎంచుకోవచ్చు. ఈ రెండు బైకుల్లో ఏది బెస్టో ఇప్పుడు చూద్దాం.
Also Read:Kingdom : కింగ్ డమ్ పై రష్మిక పోస్ట్.. ముద్దుపేరు చెప్పిన విజయ్..
డిజైన్ & లుక్స్
TVS Raider 125: అగ్రెసివ్ LED హెడ్‌ల్యాంప్, స్పోర్టీ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్, డ్యూయల్ టోన్ కలర్స్‌తో యువతను ఆకట్టుకునే లుక్. రైడింగ్ పొజిషన్ కూడా కంఫర్టబుల్.
Hero Xtreme 125R: షార్ప్ ఫ్రంట్ డిజైన్, LED హెడ్‌ల్యాంప్, మస్క్యులర్ ట్యాంక్ ష్రౌడ్స్‌తో స్పోర్టీ ఫీల్ ఇస్తుంది. Xtreme సిరీస్‌కు తగ్గట్టుగా అగ్రెసివ్ స్టైలింగ్.
ఇంజిన్ & పెర్ఫార్మెన్స్
TVS Raider 125: 124.8cc సింగిల్-సిలిండర్ ఇంజిన్, 11.2PS పవర్ @ 7,500rpm, 11.2Nm టార్క్ @ 6,000rpm. 5-స్పీడ్ గేర్‌బాక్స్, స్మూత్ రైడింగ్ కోసం TVS ET-Fi టెక్నాలజీ.
Hero Xtreme 125R: 124.7cc ఎయిర్-కూల్డ్ ఇంజిన్, 11.5PS పవర్ @ 8,250rpm, 10.5Nm టార్క్ @ 6,000rpm. స్పోర్టీ రైడింగ్ ఫీలింగ్ కోసం Hero Xsens టెక్నాలజీ.
Also Read:Vijay Devarakonda : మళ్ళీ అవే కామెంట్లు.. విజయ్ అవసరమా..?
ఫీచర్లు
TVS Raider 125:
ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్, అండర్-సీట్ స్టోరేజ్, USB ఛార్జింగ్ పోర్ట్, ఆప్షనల్ బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది.
Hero Xtreme 125R:
LED లైటింగ్ ప్యాకేజ్, డిజిటల్-అనలాగ్ క్లస్టర్, CBS బ్రేకింగ్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ ఇన్ఫో డిస్ప్లేతో వస్తుంది.
మైలేజ్ & కంఫర్ట్
TVS Raider 125: రియల్-వరల్డ్ మైలేజ్ 55–60 kmpl. సీట్ కంఫర్ట్ బాగుంది, లాంగ్ రైడ్స్‌కు అనుకూలం.
Hero Xtreme 125R: మైలేజ్ సుమారు 50–55 kmpl. రైడింగ్ పొజిషన్ స్పోర్టీగా ఉంటుంది, అర్బన్ యూజ్‌కు సరైనది.
Also Read:Conversion racket: “హిందూ బాలికల”కు వల.. 2050 నాటికి భారత్‌లో ఇస్లాం వ్యాప్తి చేయడమే లక్ష్యం..
ధర (ఎక్స్‌షోరూమ్)
TVS Raider 125: రూ. 97,000 – రూ.1.03 లక్షలు
Hero Xtreme 125R: రూ. 95,000 – రూ. 99,500
ఏది బెస్ట్?
పర్ఫార్మెన్స్ + ఫీచర్లు కోరుకునేవారికి: TVS Raider 125 సరైన ఎంపిక.
స్పోర్టీ డిజైన్ + బ్రాండ్ రీలైబిలిటీ కోరుకునేవారికి: Hero Xtreme 125R మంచి ఆప్షన్.
రెండు బైక్స్ కూడా 125సీసీ సెగ్మెంట్‌లో బలమైన కాంపిటీటర్స్. TVS Raider 125 కంఫర్ట్, ఫీచర్లతో ఆకట్టుకుంటే, Hero Xtreme 125R స్పోర్టీ లుక్, Hero ట్రస్టుతో నిలుస్తోంది.