KTM Hikes Bike Prices: KTM బైక్ లవర్స్ కు షాక్.. భారీగా బైకుల ధరలను పెంచుతూ నిర్ణయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTM Hikes Bike Prices: భారత బైక్ మార్కెట్లో స్టైల్, పెర్ఫార్మెన్స్ ఇంకా ముఖ్యంగా యూత్ ఫెవరిట్‌గా నిలిచిన బ్రాండ్ కేటిఎమ్ (KTM). భారతదేశంలో ప్రీమియం స్పోర్ట్స్ బైకుల విభాగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆస్ట్రియాకు చెందిన ఈ బ్రాండ్, బజాజ్ ఆటో భాగస్వామ్యంతో దేశీయ మార్కెట్లో పలు మోడళ్లను విక్రయిస్తోంది. ముఖ్యంగా యువతలో KTM బైకుల క్రేజ్ అధికంగా ఉంది. అయితే, తాజాగా కంపెనీ తన బైకుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనితో కొన్ని మోడళ్ల ధరలు రూ. 12,000 వరకు పెరిగాయి. అయితే ఈ పెంపు కేవలం కొన్ని మోడల్ బైకులకే పరిమతమైంది. ఇక తాజా ధరల పెంపు వివరాలు ఇలా ఉన్నాయి..
Read Also: Hari Hara VeeraMallu: పవన్ కళ్యాణ్ ఫాన్స్ రెడీగా ఉండండి.. హరి హర వీరమల్లు రిలీజ్ డేట్ ఫిక్స్.!
Also Read
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
* KTM 390 Duke:
కేటిఎమ్ 390 డ్యూక్ పై రూ. 1,000 ధర పెంచారు. ప్రస్తుతం ఈ బైక్ ధర రూ. 2.96 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. గతంలో ఈ బైక్ ధరను రూ. 18,000 వరకు తగ్గించారు. అప్పట్లో రూ. 3.13 లక్షల ధర నుండి రూ. 2.95 లక్షలకు తగ్గిన ఈ బైక్ మళ్లీ ఇప్పుడు స్వల్పంగా పెరిగింది.
* KTM 250 Duke & RC 390:
కేటిఎమ్ 250 డ్యూక్, ఆర్సీ 390 మోడళ్ల ధరలు ఒక్కోటి రూ. 5,000 వరకు పెరిగాయి. తాజా ధర ప్రకారం 250 డ్యూక్ ధర రూ. 2.30 లక్షలు కాగా, RC 390 ధర రూ. 3.23 లక్షలుగా ఉంది (ఎక్స్-షోరూమ్).
Read Also: Buttermilk: వేసవిలో మజ్జిగ తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?
* KTM RC 200:
కేటిఎమ్ RC 200కు అత్యధికంగా ధర పెంచారు. దీని ధర ఏకంగా రూ. 12,000 పెరిగింది. ప్రస్తుతం ఈ బైక్ ధర రూ. 2.33 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. గతంలో ఇది రూ. 2.21 లక్షలకు లభ్యమవుతోంది. ఈ ధరల పెంపు కారణంగా ఖర్చులు పెరిగినప్పటికీ.. అధునాతన ఫీచర్లు, ప్రీమియం డిజైన్, యూత్‌కు ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ కారణంగా KTM బైకులపై డిమాండ్ మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. ఉత్పత్తి ఖర్చులు, ఇన్‌పుట్ ఖర్చుల పెరుగుదల వల్లే ఈ తాజా ధరల సవరణ చేపట్టినట్లు కంపెనీ తెలిపింది.
తాజావార్తలు
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?