Ravanasura: ధమాకా, వాల్తేరు వీరయ్య హిట్లతో మంచి జోష్ మీద ఉన్నాడు మాస్ మహారాజా రవితేజ. ఇక ఇదే జోష్ తో తన తదుపరి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయిపోయాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం రావణాసుర. ఈ సినిమాలో రవితేజ సరసన అను ఇమ్మానుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ నటిస్తుండగా హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ తో కలిసి రవితేజ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు శివరాత్రి పండగను పురస్కరించుకొని రెండో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్యార్ లోనా పాగల్ నేను అంటూ సాగిన ఈ గీతం ఆద్యంతం ఆకట్టుకొంటుంది. మాస్ మహారాజా స్వయానా ఈ సాంగ్ ను పాడడం విశేషం. పప్రేమించిన అమ్మాయి వేరొకరిని పెళ్లి చేసుకుంటున్న సమయంలో వారి ఫంక్షన్ కు వెళ్లిన హీరో తన ప్రేమకథను చెప్పే సందర్భంలో ఈ సాంగ్ వస్తున్నట్లు తెలుస్తోంది.
Bhola Shankar: ఢమరుకం పట్టుకొని డ్యాన్స్ చేస్తున్న చిరంజీవుడు
ఇక ప్రేమించిన అమ్మాయిగా ఫరియా అబ్దుల్లా కనిపించగా అతనికి కాబోయే భర్తగా శ్రీరామ్ కనిపించాడు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించిన ఈ సాంగ్ కు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించాడు. ప్రేమలో విఫలమైన ఒక యువకుడి బాధను ఎంతో రైమింగ్ పదాలతో రాసి శ్యామ్ మార్కులు కొట్టేయగా మాస్ మహారాజా తన వాయిస్ తో మెస్మరైజ్ చేశాడు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సాంగ్ విన్న రవితేజ అభిమానులు.. మాస్ మహారాజా.. నీ గొంతులో ఏదో తెలియని మ్యాజిక్ ఉందయ్యా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ఈ సినిమా ఏప్రిల్ 7 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో ఈ ఏడాది రవితేజ హ్యాట్రిక్ హిట్ ను అందుకుంటాడేమో చూడాలి.