TSRTC: ‘హైదరాబాద్ దర్శన్’ పేరుతో టీఎస్ ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఎన్నో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని చూసేందుకు ఇతర రాష్ట్రాలనుంచే కాకుండా దేశ విదేశాలనుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే నగరానికి కొత్తగా వచ్చిన వారికి ప్రదేశాలను సందర్శించేందుకు ఏ బస్సు ఎక్కాలో .. గమ్య స్థానాన్ని ఎలా చేరుకోవాలో తెలియక తికమక పడుతుంటారు. ఇలాంటి వారి కోసమే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించేలా వీలు కల్పించింది. హైదరాబాద్ దర్శన్ పేరుతో స్పెషల్ ప్యాకేజ్ ను తీసుకొచ్చింది టీఎస్ ఆర్టీసీ. వారాంతాల్లో శని, ఆదివారాల్లో ఈ స్పెషల్ ప్యాకేజీ అందుబాటులో ఉండనుంది.
పాఠశాల యాజమాన్యాలు, కాలేజీ స్టూడెంట్స్, కుటుంబాలకు, ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్యాకేజీలో భాగంగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలనుకునే పెద్దలు రూ. 250, చిన్నారులు రూ. 130 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మెట్రో లగ్జరీ ఏసీ బస్సు అయితే పెద్దలకు రూ. 450, చిన్నారులు రూ. 340 చెల్లించాలి. టికెట్లను ఆర్టీసి అధికారిక వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. అలాగే పూర్తి సమాచారం కోసం 040-23450033 or 040-69440000 నెంబర్లకు సంప్రదించాల్సి ఉంటుంది.
Also Read
- Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
Read Also: Idli ATM: డబ్బులిచ్చే ఏటీఎం ఓకే.. ఇడ్లీ ఇచ్చే ఏటీఎంను చూశారా..
హైదరాబాద్ దర్శన్ ప్యాకేజీలో భాగంగా ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి బస్సు బయలుదేరుతుంది. 9 గంటల నుంచి 10 గంటల వరకు బిర్లామందిర్, తర్వాత 10.30 నుంచి 12.30 వరకు చౌమల్లా ప్యాలెస్, మధ్యాహ్నం 1 గంట నుంచి 1.45 గంటల వరకు తారామతి బరాదరి రిసార్ట్స్, 2 గంటల నుంచి 3.30 గంటల వరకు గోల్కోండ కోట, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు దుర్గం చెరువు, 5.30 గంటల నుంచి 6 గంటల వరకు కేబుల్ బ్రిడ్జ్, 6.30 నుంచి 7.30 గంటల వకు హుస్సేన్ సాగర్, ఎన్‌టీఆర్ పార్క్‌లను సందర్శించవచ్చు. మొత్తం 12 గంటల పాటు జర్నీ సాగుతుంది. తిరిగి రాత్రి 8.30 గంటలకు ఆల్ఫ హోటల్ దగ్గర దించుతారు.
తాజావార్తలు
-
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!