టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ 2022 ఆర్టీసీ రౌండప్ వెల్లడించారు. కార్పొరేషన్ లో 11 రీజియన్‌లలో 99 డిపోలు, 364 ఆర్టీసి బస్ స్టాండ్స్ ఉన్నాయని, రోజు 31 లక్షల 82 వేల కిలోమీటర్ల మేర బస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్నాయన్నారు. 45 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసినీ ఆదరిస్తున్నారని, 44వేల 448 మంది ఉద్యోగులు ఆర్టీసీలో పనిచేస్తున్నారని ఆయన వివరించారు. దాని ద్వారా కొంత నష్టాలు తగ్గుముఖం పట్టాయని, ప్రస్తుతం ఆర్టీసి నష్టం ఈ ఏడాది జనవరి 2022 నుండి డిసెంబర్ 2022 వరకు 650 కోట్లు ఉందని ఆయన వెల్లడించారు. 30 మంది కలిసి ఒక బస్సు బుక్ చేసుకునే సదుపాయం కలిపించామని ఆయన తెలిపారు. 1000 స్పెషల్ తిరుమల దర్శనం ఎంట్రీస్ చేశామని, తిరుమల దర్శనం కోసం డిసెంబర్ వరకు 24,672 టికెట్ల బుకింగ్ చేశారన్నారు. సంక్రాంతి, దసరా ప్రత్యేక బస్సులు ఏర్పాటు తో ప్రయాణికుల పండగ కష్టాలు తప్పాయని, పాత బస్సులు తీసివేసి 760 బస్సులు కొత్తవి ఏర్పాటు చేశామన్నారు. మొన్న 50 బస్సులు ప్రారంభించామని, 3,360 ఎలక్ట్రిక్ బస్సులు కూడా ప్రపోజల్ పెట్టామని ఆయన వివరించారు.
Also Read : Nasal Vaccine: నాసల్ వ్యాక్సిన్ ధర ప్రకటించిన భారత్ బయోటెక్
రాబోయే రోజుల్లో ఇవి అందుబాటులో ఉంటాయని, యూపీఐ, క్యూర్ కోడ్ చెల్లింపులు కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. బస్సుల లోకేషన్ టైమింగ్ కోసం ప్రత్యేక సదుపాయం కూడా తీసుకొచ్చామని, పార్సిల్ ఆర్టీసి కార్గో ద్వారా పంపిస్తే ఒక్కరోజు లోనే కస్టమర్ లకు చేరుతున్నాయన్నారు. ఆర్టీసి బస్ స్టాండ్స్ లో 3 సీటర్స్ చైర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అనంతరం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ.. 2020లో ఆర్టీసి పరిస్థితి దారుణంగా ఉందని, కోవిడ్‌తో పాటు, సమ్మె ప్రభావంతో కొంత ఇబ్బందుల్లోకి ఆర్టీసి వెళ్ళిందన్నారు. ప్రయాణికులు ఎక్కితేనే ఆర్టీసికి ఆదాయమని, కానీ కరోనా తో సుమారు 2000 కోట్ల నష్టం వచ్చిందని ఆయన వెల్లడించారు. గత ఏడాది నుండి ఇప్పటి వరకు 16 శాతం మేర కిలోమీటర్ల బస్సులు తిరిగాయి (గ్రోత్) అన్నారు.