TSRTC Bandh: తెలంగాణలో నిలిచిపోయిన ఆర్టీసీ సర్వీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC Bandh: తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వార్ కొనసాగుతుంది. ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ విలీనం బిల్లుపై కొన్ని వివరణలు కోరారు గవర్నర్ తమిళి సై. 2023 TSRTC బిల్లులోని నిబంధనలను పరిశీలించిన గవర్నర్ తమిళిసై… అస్పష్టతలపై ప్రభుత్వం నిర్ధిష్టమైన వివరణలు ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా స్పష్టత కోసం ప్రభుత్వ వివరణ కోరుతున్నట్టు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. బిల్లుపై నిర్ణయం తీసుకునేందుకు తక్షణ ప్రత్యుత్తరాన్ని గవర్నర్ కోరారని రాజ్‌భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. మరోవైపు గవర్నర్ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. ఉదయం రెండు గంటలపాటు 8 గంటల వరకు బస్సుల నిలిపివేత కొనసాగుతుంది. ఆ తర్వాత రాజ్‌భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉదయం 11గంటలకు పీవీమార్గ్ నుంచి రాజ్‌భవన్ ముట్టడికి ఆర్టీసీ కార్మికులు బయల్దేరతారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తెచ్చిన బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు.
ఇక, ఆర్టీసీ విలీన బిల్లును ఈ వర్షాకాల సమావేశాల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆర్థికపరమైన బిల్లు కావడంతో గవర్నర్‌కు పంపించింది. అయితే గవర్నర్ వివరణ కోరడంతో ఈ బిల్లు.. ఇవాళ అసెంబ్లీ ముందుకు వస్తుందా? లేదా అనే సందిగ్థత నెలకొంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ్టితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో.. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన బిల్లు కోసం సభా సమావేశాల్ని పొడిగిస్తారా? లేదా? అనే సస్పెన్స్ నెలకొంది. మరోవైపు ఇదివరకే సభ ఆమోదం తెలిపిన బిల్లులపై అభ్యంతరాలున్నాయని గవర్నర్ తమిళిసై వెనక్కి పంపడంతో.. ఆ నాలుగు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. రెండో రోజు సమావేశాల్లో పలు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. మున్సిపల్ లో కో-ఆప్షన్ సభ్యుల పెంపుపై కేటీఆర్ ప్రవేశపెట్టిన బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంచుతూ తీసుకొచ్చిన బిల్లును హరీష్ రావు ప్రవేశ పెట్టారు. దీనికి కూడా సభ ఆమోదం తెలిపింది. ప్రైవేట్ యూనివర్శిటీ చట్ట సవరణ బిల్లును సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రవేశ పెట్టారు. ఈ నాలుగు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. వీటిని గవర్నర్ ఆమోదం కోసం ఇవాళ రాజ్‌భవన్‌కు పంపనుంది ప్రభుత్వం.
Also Read
- AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
- Campbell Thomson: "ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో".. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
- Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
రెండోరోజు అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. విద్యుత్ గురించి మాట్లాడేందుకు తాము సిద్దమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అంటే… మూడు గంటలు కరెంటు చాలు అన్న వీడియోను సభ అనుమతిస్తే ప్రదర్శిస్తామని బదులిచ్చారు మంత్రి ప్రశాంత్‌రెడ్డి. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యం ప్రతీ ఆస్పత్రిలోను కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని భట్టి విక్రమార్క ఆరోపిస్తే… ఆదిలాబాద్ జిల్లాలో ఆస్పత్రి మునక పాపం స్థలాన్ని ఎంపిక చేసిన కాంగ్రెస్‌దేనన్నారు మంత్రి హరీశ్‌రావు. వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయని, ఎంతమంది చనిపోయారో కనీసం లెక్కలు కూడా లేవని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. పంట బీమా చేయకపోవడంతో .. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు సభ దృష్టికి తీసుకొచ్చారు. 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, ప్రభుత్వం మాత్రం 5వందల కోట్లు మాత్రమే పరిహారం ఇస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సభలో ప్రస్తావిస్తే.. మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఫీల్డ్‌లోకి వెళ్లి…పంటనష్టాన్ని అంచనా వేశారా అని నిలదీశారు.
తాజావార్తలు
-
Fauji: ‘ఫౌజీ’ కోసం ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులు.. ఆగస్టు 15న స్పెషల్ ట్రీట్ ఇస్తారా ?
-
AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
-
Moto Pad 70: 10,200mAh బ్యాటరీతో మోటో ప్యాడ్ 70 లాంచ్.. 12.1-అంగుళాల 2.5K డిస్ప్లే, 68W ఫాస్ట్ ఛార్జింగ్
-
Campbell Thomson: “ఇంత డేంజర్‌గా ఉన్నావేంటి బ్రో”.. ఒకే మ్యాచ్‌లో 8 వికెట్లు పడగొట్టిన 22 ఏళ్ల యువ సంచలనం
-
Kiren Rijiju-Rahul Gandhi: ‘మీరు ప్రయాగ్‌రాజ్ బదులు రాంచీకి వెళ్లాల్సింది’.. రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!