TSPSC: మరో 13 మంది అభ్యర్థులను డిబార్ చేసిన టీఎస్పీఎస్సీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో.. వారికి శిక్ష పడుతుంది. భవిష్యత్ లో టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షలు రాయకుండా 13 మందిని డిబార్ చేయాలని కమిషన్ నిర్ణయించింది. వేటుకు గురైన అభ్యర్థులు రెండు రోజుల్లో వివరణ ఇవ్వొచ్చని తెలిపింది. లేకపోతే శాశ్వతంగా వారిని డిబార్ చేస్తామని స్పష్టం చేసింది కమిషన్. ఈ మేరకు ఓ ప్రకటనను రిలీజ్ చేసింది. లీకేజీ కేసులో సిట్ ఇప్పటి వరకు అరెస్ట్ చేసిన 37 మందిని మంగళవారం డిబార్ చేసింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం 50 మంది డిబార్ అయ్యారు.
Read Also: Krishna: మచిలీపట్నం ప్రభుత్వా ఆసుపత్రిలో అమానుషం..డబ్బులిస్తేనే పోస్ట్‌మార్టం..
Also Read
TSPSC ప్రశ్నపత్రం లీకేజీ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.. ఈ కేసుకు సంబంధించి తాజాగా మరో నలుగురిని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అరెస్ట్ చేసింది. వరంగల్ విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్(డీఈ) రమేష్ తోపాటు ప్రశాంత్, మహేశ్, నవీన్ అరెస్ట్ అయినవారిలో ఉన్నారు. ఏఈఈ, డీఏవో పరీక్షకు సంబంధించిన 25 ప్రశ్నపత్రాలను డీఈ రమేష్ విక్రయించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఏఈఈ పరీక్షలో ఏడుగురు అభ్యర్థులకు పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్ గ్యాడ్జట్స్ ద్వారా డీఈ రమేష్ సమాధానాలు అందించినట్లు తేలింది.
Read Also: Adipurush: ఆదిపురుష్ నుంచి మరో బిగ్ సర్‌ప్రైజ్..?
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. అక్రమ మార్గంలో పేపర్ సంపాదించిన అభ్యర్థులు.. సమాధానాలు తెలుసుకునేందుకు ఎలక్ట్రానిక్ డివైజ్‌తో పరీక్ష రాసినట్లు సిట్ అధికారులు తేల్చారు. ఏఐ టెక్నాలజీతో ఎగ్జామ్ రాసిన నిందితులు ప్రశాంత్, మహేశ్, నవీన్‌లను అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురు కూడా రమేష్ ద్వారా ఏఈఈ పేపర్ పొందినట్లు తెలిపారు. పరీక్ష హాల్‌లోకి ఎలక్ట్రానిక్ డివైజ్‌లు ఎలా వెళ్లాయనే దానిపై సిట్ అధికారులు సీరియస్గా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, టీఎస్పీఎస్సీలో రమేష్ ఔట్ సోర్సింగ్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేశాడు. టీఎస్పీఎస్సీ కేసులో ఇప్పటికే రమేష్‌ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన ఏఈఈ పేపర్ లీక్‌లో ఇప్పటివరకు 43 మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్‌తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!