ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లా లోని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో అమానుష ఘటన వెలుగు చూసింది.. లంచం ఇస్తే గానీ వైద్యం అందని పరిస్థితి నెలకొంది.. ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన పేద ప్రజలను డబ్బులు ఇవ్వాలంటూ ఇబ్బందులు పెడుతున్నారని స్థానికులు వాపోతున్నారు.. తాజాగా మరో ఘటన జరిగింది..
మచిలీపట్నానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.. అతను ఎందుకు చనిపోయాడో తెలుసుకోవాలని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.. పోస్ట్మార్టం కోసం డాక్టర్ ను సంప్రదించారు.. అయితే, అతడి మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయాలంటే రూ.10 వేలు లంచం అడిగారు డాక్టర్లు. ఆర్ఎంవో మహేశ్, డాక్టర్ ఆంజనేయులు. డబ్బులిస్తేనే గానీ పోస్ట్‌మార్టం చేసేది లేదని చెప్పడంతో మృతుడి బంధువులు డాక్టర్లు కూడా లేకపోవడంతో పోస్ట్‌మార్టం గది దగ్గరే పడిగాపులు కాస్తున్నారు..
ఈ ఘటన పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.. ఈ ఘటన పై స్థానికులు మండిపడుతున్నారు.. వారిని వెంటనే సస్పెండ్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేస్తున్నారు.. ఏది ఏమైనా ఈ ఘటన గురించి ఆ నోటా ఈ నోటా పాకి అధికారుల వరకు వెళ్లిందని సమాచారం.. అలాంటి డాక్టర్ల పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..