ఏపీ లిక్కర్ స్కామ్ కేసు సంచలనంగా మారింది.. ఈ కేసులో A6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేశారు.. లిక్కర్ స్కాం లో ఏ6గా ఉన్న సజ్జల శ్రీధర్ రెడ్డికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. నిన్న సాయంత్రం శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చి అధికారులు విచారించారు. మద్యం అమ్మకాలు, లావా దేవీలలో శ్రీధర్ రెడ్డి పాత్ర పై అధికారులు విచారణ జరిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపి కోర్టులో హాజరు పరచగా కోర్టు వచ్చే నెల 6 వరకు రిమాండ్ విధించింది. శ్రీధర్ రెడ్డిని పోలీసులు విజయవాడ సబ్ జైలుకి తరలించారు.. అయితే, సజ్జల శ్రీధర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి..
Read Also: Ram : రామ్ కోసం రంగంలోకి క్రేజీ హీరో..?
ఏపీ లిక్కర్ కేసులో ఏ1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి శ్రీధర్ రెడ్డి సన్నిహితుడుగా ఉన్నారు.. లిక్కర్ స్కాంలో ముడుపులు సిండికేట్ కు అందిచడంలో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది సిట్.. ప్రముఖ మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో అనిచివేయటంలో కీలక పాత్ర పోషించడంతో పాటు.. చట్ట విరుద్ధంగా లిక్కర్ ఆర్థర్ ఫర్ సప్లై (OFS) జారీ చేశారట.. మద్యం తయారీ, హోల్ సేల్, రిటైల్ ను ముడుపులు తీసుకొని నియంత్రించటం.. డిస్టలరీస్ ను సమన్వయం చేసి సకాలంలో సిండికేట్ సభ్యులకు ముడుపులు అందేలా చర్యలు తీసుకున్నారని శ్రీధర్‌రెడ్డిపై అభియోగాలు మోపారు.. కేసులో ఇతర నిందితులు వాసుదేవ రెడ్డి, సత్య ప్రసాద్ లకు నచ్చిన కంపెనీలకు ఆర్థర్ ఫర్ సప్లై జారీ చేశారని సిట్ పేర్కొంది.. ముడుపులు, కమిషన్ ద్వారా డబ్బు ఎలా సేకరించారు, ఏ కంపెనీలకు మళ్లించారు, ఆ డబ్బు ఎలా వినియోగించారు అనే వివరాలు శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్నాయని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొంది సిట్..