Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..
- మిత్ర దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్..
- హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు ముందుకు రండి..
- ఆకాశాన్ని తాకుతున్న నిత్యావసర వస్తువులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో.. సముద్ర మార్గాలను కాపాడేందుకు సైనిక సాయం అందించని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. అమెరికాకు మిత్రులుగా ఉన్న దేశాలను ఆయన ‘పిరికివారు’ అని సంబోధించారు. ‘మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకుంటాం’ అంటూ తన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు.
ట్రంప్ వాదన ఏమిటి..?
Also Read
- PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
- Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
- National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
- Nitin Gadkari: అండర్‌వరల్డ్, రెడ్‌లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
చమురు (ఆయిల్) ధరలు పెరిగిపోతున్నాయని అందరూ ఫిర్యాదు చేస్తున్నారని.. కానీ హర్మూజ్ జలసంధిని తెరిపించడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదని ట్రంప్ విమర్శించారు. అమెరికా గతంలో ఎన్నో దేశాలకు సహాయం చేసిందని, ఇప్పుడు ఆ దేశాలు తమ స్వార్థం కోసమైనా ఇరాన్‌ను అడ్డుకోవడానికి సహకరించాలని ఆయన కోరారు.
యుద్ధం మొదలవ్వకముందు 70 డాలర్లు ఉన్న ఆయిల్ ధర, ఇప్పుడు 108 డాలర్లకు చేరుకుంది. ఇంధన ధరలు పెరగడంతో ఆహార వస్తువులు, నిత్యావసరాల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. హర్మూజ్ మార్గం గుండానే ఎక్కువ చమురు సరఫరా అవుతుంది కాబట్టి.. మనలాంటి ఆసియా దేశాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. కంప్యూటర్ చిప్స్ తయారీకి వాడే హీలియం, ఎరువుల తయారీకి వాడే సల్ఫర్ వంటి వాటికి కూడా కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.
మరోవైపు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. సముద్ర మార్గాల్లో ప్రయాణాలు సురక్షితంగా సాగేందుకు తాము కృషి చేస్తామని చెప్పాయి. ఇరాన్ చేస్తున్న దాడులను, సముద్రంలో మైన్లు వేయడాన్ని ఈ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇరాన్ యుద్ధం మొదలై 21 రోజులు అవుతోంది. ప్రస్తుతం ఆ సముద్ర మార్గం దాదాపు మూతపడింది. ఇప్పటివరకు దాదాపు 23 ఓడలపై దాడులు జరిగినట్లు సమాచారం.
తాజావార్తలు
-
PM Modi: తొలిసారి ‘బుక్‌మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్‌ఫుల్ బోర్డు
-
Sajjala Ramakrishna Reddy: ‘డీఎస్సీలో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి’..
-
National Film Awards: దశాబ్దాల సంప్రదాయానికి స్వస్తి.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదిక మార్పు!
-
Nitin Gadkari: అండర్‌వరల్డ్, రెడ్‌లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
-
CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!