Donald Trump: “మస్క్ ఓ అద్భుతం”.. పదవి నుంచి తప్పుకున్న ఎలాన్ మస్క్‌పై ట్రంప్ ప్రశంసలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ బిలియనీర్, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ పై ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వంలో వ్యర్థ ఖర్చుల నివారణ కోసం ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) చీఫ్ పదవి నుంచి మస్క్ తప్పుకుంటున్న నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. ఇందులో భాగంగా “ఎలాన్ మస్క్ అద్భుతమైన వ్యక్తి. ఇది ఆయన చివరి రోజు అయినా, ఆయన మనతోనే ఉంటారు. ఎల్లప్పుడూ సహాయపడుతూనే ఉంటారు” అని ట్రంప్ అన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఒవల్ ఆఫీసులో ట్రంప్-మస్క్ కలిసి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.
Read Also: India China: పాక్ ప్రయోగించిన PL-15E క్షిపణిని కూల్చేసిన భారత్.. తొలిసారి స్పందించిన చైనా.
Also Read
- WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
- Pensions: పెన్షన్ల నిధులు విడుదల.. అక్టోబర్ 1వ తేదీ ఉదయం నుంచే పంపిణీ షురూ..
- New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
- Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
ఇకపోతే, DOGE చీఫ్‌గా తన పాత్ర ముగిసిన అనంతరం మస్క్ ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా నా కాలపరిమితి ముగియడంతో ట్రంప్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నానని.. ప్రభుత్వ వ్యర్థ ఖర్చులను తగ్గించే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలంటూ అన్నారు. DOGE మిషన్ ఇప్పటి కంటే భవిష్యత్తులో మరింత బలోపేతం అవుతుందని మస్క్ అన్నారు. ఇకపోతే, ఈ వారం ప్రారంభంలో మస్క్ మాట్లాడుతూ.. తాను తిరిగి పూర్తి స్థాయిలో కార్పొరేట్ జీవితంలోకి ప్రవేశించానని, 24/7 పని చేస్తూ కాన్ఫరెన్స్ రూముల్లోనే నిద్రపోతున్నానని పేర్కొన్నారు.
Read Also: Radhika Apte : పూరీ-విజయ్ సేతుపతి మూవీలో రాధికా ఆప్టే.. ఇదిగో క్లారిటీ..
అయితే, మస్క్ తన పదవీ విరమణకు కొద్ది గంటల ముందు ట్రంప్ ప్రవేశపెట్టిన ముఖ్యమైన పన్ను బిల్లును తీవ్రంగా విమర్శించారు. ఒక బిల్లు పెద్దదిగా ఉండవచ్చు, లేదా అందంగా ఉండవచ్చు. కానీ రెండూ ఒకేసారి ఉండడం నాకు తెలీదు అని వ్యాఖ్యానించారు. ఇది DOGE కార్యాలయం లక్ష్యాలను దెబ్బతీయవచ్చని ఆయన అభిప్రాయం. DOGE శాఖ లక్ష్యం ప్రభుత్వాన్ని దృఢంగా, సరళంగా మార్చడం. వ్యర్థ ఖర్చులను తొలగించడం, విభాగాలను మూసివేయడం, పరిపాలనను సులభతరం చేయడం వంటి కీలక నిర్ణయాల్లో మస్క్ ముందుండి నడిపించారు. అయితే, ఏప్రిల్ చివరి నుంచి మస్క్ దశల వారీగా తన పాత్ర నుంచి పక్కకు వెళ్లడం మొదలుపెట్టారు. ఈ పరిణామాలతో మస్క్ అమెరికన్ పాలనలోని అతిథి పాత్ర ముగిసినా.. ఆయన ప్రభావం మాత్రం కొనసాగనుంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!