Iran Isreal War: ఇరాన్ మీద దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి స్పందించాడు. ఇరాన్ అణు ఆయుధాలను మళ్లీ తయారు చేస్తుంది అని ఆరోపించాడు. అమెరికా సైన్యం ఇరాన్ పై దాడులు చేపట్టింది.. అమెరికా ప్రజలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదర్కొనేందుకు ఈ దాడులు చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలకు ముప్పు ఉండటం వల్లే ఈ దాడులు చేస్తున్నట్లు ట్రంప్ వెల్లడించాడు.
Read Also: VFX vs AI: టెక్నాలజీ పెరిగినా తప్పని వివరణలు.. సినిమా మేకర్స్ కి ఏఐ టెన్షన్స్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో తన అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమంపై మరో దఫా చర్చలు జరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ఇరాన్‌తో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను.. కానీ ఇరాన్‌కు అణు ఆయుధాలు ఉండకూడదు అనే విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని పేర్కొన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ఈ వారం మొత్తం చర్చలు కొనసాగుతున్నాయని ట్రంప్ తెలిపారు. తాను ఇరాన్‌పై సైనిక చర్యలకు వెళ్లాలని కోరుకోవడం లేదు.. కానీ కొన్ని సందర్భాల్లో అటువంటి పరిస్థితులు తప్పకపోవచ్చని వ్యాఖ్యానించారు. దీంతో ట్రంప్ కామెంట్స్ చేసిన గంటల వ్యవధిలోనే ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో భారీగా దాడులు జరిగాయి. ఇజ్రాయెల్- యూఎస్ సంయుక్తంగా కలిసి క్షిపణులతో దాడులు చేశాయి.
Read Also: Hari Teja: బన్నీ కోసం..15 రోజులు అన్నం మానేశా..
మరోవైపు, ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా క్షిపణి దాడులు చేసింది. షీల్డ్ ఆఫ్ జూద్ పేరుతో ఆపరేషన్ చేపట్టగా, 30 ప్రాంతాలను టార్గెట్ చేసింది. నార్త్, ఈస్ట్ టెహ్రాన్ పై బాంబుల వర్షం కురిపించింది. ఈ సందర్భంగా ఇరాన్ కూడా ప్రతిదాడులు చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ తమ పౌరులను హెచ్చరించింది. సైరన్ మోగించి ప్రజలను అప్రమత్తం చేసింది. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగానే దాడులు చేసినట్లు ప్రకటించింది. అలాగే, ఇజ్రాయెల్ ఎయిర్ స్పేస్ ని కూడా మూసివేసినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్- అమెరియా జాయింట్ ఆపరేషన్ తో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్లు తెలుస్తుంది.