Trisha : ఆ దర్శకుడు చేసిన ట్వీట్ కు దాదాపు దశాబ్దానికి రిప్లై ఇచ్చిన త్రిష..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
త్రిష ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు లో దాదాపు అందరి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది.టాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మారింది. అలాగే తమిళ్ ఇండస్ట్రీ లో కూడా ఈ భామ స్టార్ హీరోయిన్ గా రానించింది. తాజాగా ఈ భామ పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది.రెండు పార్ట్స్ గా తెరకెక్కిన ఆ సినిమా సూపర్ హిట్ అయింది.త్రిష తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే త్రిష తాజాగా ఓ దర్శకుడి ట్వీట్‌ను రీ ట్వీట్ చేస్తూ రిప్లై ఇచ్చారు.ఇది చూసిన నెటిజన్లంతా కూడా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆయన పెట్టిన 10 ఏళ్లకు త్రిష రిప్లై ఇవ్వడం విశేషం.2007లో తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించిన సినిమా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఈ కుటుంబ కథా చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమాపై 2013 లో సెల్వరాఘవన్ ఓ ట్వీట్ చేశారు. ‘చాలా రోజుల తర్వాత ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే..’ సినిమా చూశాను. వెంకటేష్ , త్రిషలతో కలిసి పనిచేయడం నాకు ఓ గొప్ప అనుభూతినిచ్చింది. దీని సీక్వెల్ తీయడంలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు’ అంటూ వాళ్లిద్దరినీ ట్యాగ్ చేశారు దర్శకుడు సెల్వ రాఘవన్. ఆ ట్వీట్‌కు త్రిష ఇప్పుడు రిప్లై ఇచ్చారు. ‘నేను కూడా సీక్వెల్‌ల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నాను’ అని ఆమె స్పందించారు. దీనిపై నెటిజన్లు కాస్త ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ‘చాలా త్వరగా రిప్లై ఇచ్చారే అని ఒకరు అనగా ‘ఇంత మంచి సినిమా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నాం ‘ అని మరొకరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా దర్శకుడి చేసిన ట్వీట్ కు త్రిష దశాబ్దానికి రిప్లై ఇవ్వడం అందరికి ఆశ్చర్యం కలిగించింది.. అయితే త్రిష త్వరలోనే విజయ్ హీరోగా తెరకెక్కిన ‘లియో’ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది.. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 19న గ్రాండ్ గా విడుదల కానుంది.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..