Site icon NTV Telugu

Triple Murders: హైదరాబాద్‌లో వరుస హత్యలు.. ఈ హత్యల్లో మిస్టరీ ఏంటి..?

Hyderabad

Hyderabad

హైదరాబాద్‌లో వరుస హత్యలు సంచలనం రేపుతున్నాయి.. ఒకే రోజు మూడు హత్యలు వెలుగు చూశాయి. మూడు హత్యలూ అనుమానాస్పదమే !! కూకట్‌పల్లిలో బర్త్‌డే పార్టీకని పిలిచి ఓ యువకుడిని హత్య చేయగా… నాగోల్‌‌లో జూస్‌ సెంటర్‌ నిర్వాహకుడిని దారుణంగా హత్య చేశారు. బహదూర్‌పురలో ఓ యువకుడిని హతమార్చారు గుర్తుతెలియని వ్యక్తులు. వరుస హత్యలకు కారణమేంటి..? మూడు హత్యల్లో దాగున్న మిస్టరీ ఏంటి…? హైదరాబాద్ నగరం సీసీ కెమెరాల నిఘా నీడలో ఉన్నా… నిత్యం గల్లీ గల్లీలో పోలీసుల గస్తీ ఉన్నా.. వరుసగా జరుగుతున్న హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. జంట నగరాల పరిధిలో ఒకే రోజు జరిగిన మూడు హత్యలు కలకలం రేపుతున్నాయి..

READ MORE: Nithin : క్షమించండి.. ఇక నుంచి మంచి సినిమాలు చేస్తా

కూకట్‌పల్లి పరిధిలోని వివేకానందనగర్‌ డివిజన్‌ బాలకృష్ణ నగర్‌ సమీపంలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు దుండగులు. సయ్యద్‌ సాహెబ్‌ అనే యువకుడిని కత్తులతో దాడి చేసి చంపారు. బర్త్‌ డే పార్టీకని పిలిచి సాహెబ్‌ను హత్య చేసినట్లు గుర్తించారు పోలీసులు. స్నేహితుడి బర్త్‌డే సందర్భంగా పార్టీ ఏర్పాటు చేశామని.. బోరబండకు చెందిన సాహెబ్‌ను కూకట్‌పల్లికి పిలిచారు స్నేహితులు. రాత్రి మద్యం తాగిన యువకులు… సాహెబ్‌పై ఒక్కసారిగా కత్తులతో దాడి చేశారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే ముందుగానే కత్తులను తెచ్చుకున్నారు నిందితులు. మద్యం మత్తులో ఉన్న సాహెబ్‌ను కత్తులతో పొడిచి చంపారు. మృతుడు సయ్యద్‌ సాహెబ్‌.. బోరబండకు చెందిన వాహిద్‌ పైల్వాన్‌ కుమారుడిగా గుర్తించారు పోలీసులు. మద్యం తాగుతున్న సమయంలో స్నేహితుల మధ్య గొడవ జరిగిందా..? లేక పాత కక్షలను మనసులో ఉంచుకుని ప్లాన్‌ ప్రకారం హత్య చేశారా? అనేది దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు..

READ MORE: Dil Raju: సినిమా గురించి ఎక్కువ మాట్లాడొద్దని మాట తీసుకున్నాడు!

నాగోల్‌ పరిధిలోని తిమ్మాయిగూడలో మరో హత్య వెలుగులోకి వచ్చింది. కాచిగూడకు చెందిన అశోక్‌ యాదవ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. బండరాయితో తలపై మోది దారుణంగా హతమార్చారు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా… ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడు అశోక్‌ గా గుర్తించారు. అశోక్‌… కాచిగూడలో జ్యూస్ సెంటర్‌ నడుపుతున్నాడు. కాచిగూడకు చెందిన అశోక్‌.. నాగోల్‌‌కి ఎందుకు వచ్చాడు. ఇంత కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్‌… క్లూస్‌ టీమ్‌ ఆధారంగా దుండగుల కోసం గాలిస్తున్నారు పోలీసులు..

READ MORE: Captain Cool: ‘కెప్టెన్ కూల్’ ట్యాగ్‌లైన్‌కు ధోనీ ట్రేడ్‌మార్క్ దరఖాస్తు..!

బహదూర్‌పురలోనూ మరో హత్య జరిగింది. బహదూర్‌పుర ఫ్లైఓవర్‌ కింద ఓ గుర్తు తెలియని యువకుడి మృతదేహాన్ని గుర్తించారు స్థానికులు. హత్యకు గురైన యువకుడు ఎవరు అనేది ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఎక్కడో హత్య చేసి తీసుకొచ్చి ఫ్లై ఒవర్‌ కింద వేశారా..? లేదా అక్కడే హతమార్చారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది..

Exit mobile version