హైదరాబాద్‌లో వరుస హత్యలు సంచలనం రేపుతున్నాయి.. ఒకే రోజు మూడు హత్యలు వెలుగు చూశాయి. మూడు హత్యలూ అనుమానాస్పదమే !! కూకట్‌పల్లిలో బర్త్‌డే పార్టీకని పిలిచి ఓ యువకుడిని హత్య చేయగా... నాగోల్‌లో జూస్ సెంటర్ నిర్వాహకుడిని దారుణంగా హత్య చేశారు. బహదూర్‌పురలో ఓ యువకుడిని హతమార్చారు గుర్తుతెలియని వ్యక్తులు. వరుస హత్యలకు కారణమేంటి..? మూడు హత్యల్లో దాగున్న మిస్టరీ ఏంటి...?
Shocking Incident : హైదరాబాద్ పాతబస్తీలోని ఐ.ఎస్. సదన్ ప్రాంతంలో గురువారం ఉదయం దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో నుంచి వస్తున్న తీవ్ర దుర్వాసన చూసి స్థానికులు అనుమానం పోలీసులకు సమాచారం అందించారు. మలక్‌పేటలో ఈ సంఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, సంబంధిత ఇంటిని పరిశీలించారు. ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో అధికారులు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. ఈ క్రమంలో ఇంటి అంతా రక్తపుదారలు కనిపించడంతో…