Hyderabad: ట్రైజిన్ టెక్నాలజీస్ కంపెనీ హైదరాబాద్‌లో తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ నెలకొల్పనుంది. అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ఆ కంపెనీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే సెంటర్ పై ఈ సందర్భంగా చర్చలు జరిపారు.
Read Also: Prajavani: ప్రజావాణిలో ఇప్పటివరకు 5,23,940 దరఖాస్తులు.. 4,31,348 పరిష్కారం
ఈ కంపెనీ డేటా అనలిటిక్స్, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్‌లకు అవసరమయ్యే ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ అందిస్తుంది. హైదరాబాద్‌లో ట్రైజిన్ కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ అండ్ డెలివరీ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. రాబోయే మూడేండ్లలో 1,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకొని శిక్షణను అందిస్తుంది. ఈ కంపెనీ మొత్తం ఆదాయం 160 మిలియన్ డాలర్లకు పైగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ కంపెనీలో పని చేస్తున్న 2,500 మందిలో వెయ్యి మంది మన దేశంలో ఉండగా, ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు వంద మంది ఉన్నారు. మరో ఆరు నెలల్లోనే తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఈ కంపెనీ ప్రకటించింది.
రెండు దశాబ్దాలకు పైగా ఐక్య రాజ్య సమితితో పాటు అనుబంధ విభాగాలకు ఈ కంపెనీ సాంకేతిక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. గత ఏడాది నుంచి ట్రైజిన్ కంపెనీ తమ సేవలను అందుకుంటున్న సంస్థల్లో అర్టిఫిషియల్ ఇంటెలెజెన్స్ వినియోగంతో పాటు ఫలితాలపై విశ్లేషణలు చేస్తోంది. అన్ని రంగాలలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా ఎంచుకుంది.
After a productive meeting with Chief Minister @revanth_anumula and IT Minister @OffDSB Trigyn Technologies is set to establish an AI innovation and delivery centre in Hyderabad!
The centre aims to hire and train over 1,000 people in the next three years, building on their… pic.twitter.com/ywk1IJynT0
— Telangana CMO (@TelanganaCMO) August 6, 2024