భార్య భర్తలుగా నటిస్తూ కారులో ప్రత్యేకంగా నిర్మించిన అరలలో గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో దుండిగల్ పోలీసులు రాజేంద్రనగర్ sot పోలీసులు సంయుక్తంగా వల పన్ని ముఠా ను అరెస్టు చేసారు.. ఔటర్ రింగ్ రోడ్ మీదుగా గంజాయి తరలిస్తున్న ఈ ముఠా సభ్యులు 5 గురు సభ్యుల ముఠా ఒరిస్సా నుండి హైదారాబాద్ మీదుగా డిల్లీకి హోండా సిటీ కార్ లో తరలిస్తున్నట్లు గా గుర్తించారు.. పోలీసులు ఇద్దరిని అదుపు లో తీసుకొని వారి దగ్గర నుండి 83 కేజీల ఎండు గంజా ని స్వాధీనం చేసుకున్నారు… వారిని విచారించగా నిందితులు ఒరిస్సాకు చెందిన లక్ష్మి(30) సునిందర్(25) భార్యభర్తల ముసుగులో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా , మరో ముగ్గురు అమిత్ అగర్వాల్, రాజు, శివ లు వీరికి సహకరిస్తున్నట్లు గా గుర్తించారు ..పరారీలో ఉన్న ఆ ముగ్గురి ఆచూకికై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.. 83 కేజీల డ్రై గంజాయి, హోండా సిటీ కారు , యాపిల్ పోన్ ను స్వాధీనం చేసుకున్నారు.. వీటి విలువ 32 లక్షల వరకు ఉండవచ్చని అంచనా.. ఇద్దరిని రిమాండుకు తరలిస్తున్నామని మేడ్చల్ డిసిపి కోటి రెడ్డి తెలిపారు..
Telangana Cabinet: హైడ్రాకు విస్తృత అధికారాలు.. కేబినెట్ కీలక నిర్ణయాలివే..