విక్రమ్ తాజా చిత్రం తంగలాన్, పీరియాడికల్ యాక్షన్ నేపథ్యంలో రానుంది ఈ చిత్రం. విక్రమ్ చిత్రాలకు తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. గతంలో వచ్చిన అపరిచితుడు, ఇంకొక్కడు, ఐ తెలుగులో కూడా ఆశించిన కలెక్షన్లు రాబట్టాయి. కాగా తంగలాన్ ఎప్పుడొస్తుందా అని అటు తమిళ్ ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ ప్రేక్షకులు కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో విక్రమ్ లుక్ గత చిత్రాల కంటే భిన్నంగా ఉండడం, పీరియాడికల్ నేపథ్యంలో తెరకెక్కనుండడం విక్రమ్ ఈ సారి హిట్ కొడతాడని అంచనా వేశారు. ఈ చిత్ర టీజర్ వారి అంచనాలను మరింత పెంచేలా చేసింది. టీజర్ లో విక్రమ్ లుక్, చిత్ర నేపథ్యం, విక్రమ్ నటన ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుందనడంలో సందేహం లేదు.
Also Read : Antibiotic: యాంటీ బయోటిక్‌ల వాడకం పెరిగితే ఏమౌతుందో తెలుసా?
కాగా ఈ చిత్ర విడుదల విషయంలో తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నాయి. వాస్తవానికి ఈ చిత్రం రిపబ్లిక్ కానుకగా జనవరి 26న వస్తుందని నిర్మాతలు గతంలో తేలిపారు. అఫీషియల్ గా డేట్ తో పోస్టర్ కూడా విడుదల చేసారు. కానీ ఆ డేట్ కి విడుదల వాయిదా వేశారు. ఇలా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ చివరికి ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. కాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఎప్పుడుస్తోందో అని ఎదురుచూడగా వారి ఎదురుచూపులకు తెరదించుతూ ఈ నెల10న ఈ చిత్ర ట్రైలర్ చేయబోతున్నట్టు అఫీషియల్ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. 2 నిమిషాల 12సెకెన్ల నిడివితో ట్రైలర్ రానుంది.
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది తంగలాన్. గతంలో కబాలి, కాలా, సార్పట్ట చిత్రాలకు దర్శకత్వం వహించిన పా. రంజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. గ్రీన్ స్టూడియోస్ బ్యానర్ లో కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా GV. ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.
Also Read : India-France: చైనాకు చెక్.. భారత్- ఫ్రాన్స్ నుంచి 26 రాఫెల్ సముద్ర యుద్ధ విమానాలు కొనుగోలు..