Sad News : మానవత్వంలేని మనుషులు.. శవం దుర్వాసన వచ్చేదాక సోయిలేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి సమాజంలో కొన్ని సంఘటనలు చూస్తుంటే.. మనుషులు ఇంతగా దిగజారిపోయారా అనిపిస్తుంది. తమ ప్రాణాలకు ఇచ్చే విలువలో పక్కవారి ప్రాణాలపై ఒక శాతం కూడా ఉండదనే దానికి ఈ ఘటనే నిదర్శనం. యాక్సిడెంట్ జరిగి ఆసుపత్రిలో చేరిన వ్యక్తి మరణించి పదిరోజులైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చివరికి మృతదేహాం నుంచి దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హృదయవిదాకర ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పోలీసులు, వైద్యాధికారుల నిర్లక్ష్యంతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో 13 రోజులుగా శవం కుళ్లిపోయింది. గత నెల 18న సుల్తాన్ పూర్ లో రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ (28) అనే యువకుడు గాయపడ్డాడు. అయితే.. ఇది గమనించి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే.. హాస్పిటల్‌కి తరలించి పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు, 108 సిబ్బంది. గత నెల 18 నుంచి 22 వరకు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ఆస్పత్రిలో చికిత్స అందించారు వైద్యులు.. అయితే.. చికిత్స పొందుతూ డిసెంబర్ 23న శ్రీనివాస్ మృతి చెందాడు.
Also Read : Elephant Video Viral : రోడ్డుపై బైక్ పెడతారా బుద్ధిలేదు.. తన్ని అవతలేసిన ఏనుగు
Also Read
శ్రీనివాస్ చనిపోయిన వెంటనే సంగారెడ్డి టౌన్, పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చామంటున్నారు ఆసుపత్రి వైద్యులు. అప్పటి నుంచి ఈ రోజు వరకు మార్చురీలోనే శ్రీనివాస్ డెడ్ బాడీ ఉంది. ప్రతి రోజు సమాచారం ఇచ్చినా పోలీసులు రెస్పాన్డ్ కాలేదని వైద్యులు చెబుతున్నారు. ఈ రోజు డెడ్ బాడీ దుర్వాసన రావడంతో మరోసారి పుల్కల్ పోలీసులకు ఫోన్ చేశారు ఆస్పత్రి సిబ్బంది. అయితే.. దీంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకొని.. శవాన్ని మార్చురీ నుంచి బయటికి తీస్తుండగా శ్రీనివాస్ జేబులో నుంచి ఆధార్ కార్డ్ బయటపడింది. ఆధార్ కార్డ్ ఆధారంగా శ్రీనివాస్ ది ఝారసంఘం మండలం కిష్టపూర్ గ్రామంగా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఆస్పత్రికి హుటాహుటిన వచ్చిన బంధువులు.. పుల్కల్ పోలీసులు తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన చేపట్టారు. డెడ్ బాడీ తీసుకెళ్లడానికి నిరాకరించిన బంధువులు.. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. డెడ్ బాడీ తీసుకెళ్లకుండా ఇంటికి వెళ్లిపోయారు శ్రీనివాస్ బంధువులు. రేపు ఆసుపత్రి ముందు నిరసన తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
-
Smriti Mandhana: మిథాలీ రాజ్‌ను పక్కకు నెట్టిన స్మృతి.. ఆసియా కప్‌లో సరికొత్త చరిత్ర..
-
OTR: రాజగోపాల్ రెడ్డి రాజన్న రాగం ఎందుకు వినిపిస్తున్నారు..?
-
Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!