Tragedy : మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం.. బీర్లు అడిగాడని యువకుడిపై దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మద్యం షాప్ లో బీరు అడిగినందుకు ఓ యువకుడిని చావగొట్టారు వైన్స్ షాపు నిర్వాహకులు. ఈ దాడిలోగాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది . అడ్డాకుల మండలం బలీద్‌పల్లి చెందిన శ్రీ కాంత్ (26) గత నెల 26న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం శివారులోని బండమీదిపల్లిలో ఉన్న శ్రీమల్లికార్జున వైన్స్ వద్దకు వెళ్లి బీర్ కావాలని షాప్ నిర్వాహకులను అడిగాడు. అయితే బీర్ల షాటేజ్ కారణంగా ఎక్స్ట్రా రేట్ కు విక్రయిస్తున్న వైన్స్ నిర్వాహకులతో శ్రీకాంత్ కు మాటా మాటా పెరిగింది . రెచ్చిపోయిన వైన్స్ షాప్ నిర్వాహకులు.. మరో పది మందిని తీసుకొచ్చి శ్రీకాంత్‌ను బలవంతంగా షాపులోకి ఈడ్చుకెళ్లారు.
Also Read
ఆ తర్వాత పిడిగుద్దులతో విచక్షణారహితంగా చావగొట్టారు. దీంతో తీవ్రంగా గాయాలపాలైన శ్రీకాంత్‌ను కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. కాలేయం , కిడ్నీ పూర్తిగా దెబ్బతిన్న శ్రీకాంత్ చికిత్స పొందుతూ సోమవారం రోజు మ్రుతి చెందాడు . అయితే గొడవ జరిగిన రోజు పోలీసులకు ఫిర్యాదు చేసిన కంప్లైంట్ తీసుకోలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు . మరో పక్క మద్యం షాప్ నిర్వహాకులకు ఎక్సైజ్ అదికారులతో పాటు , పోలీసులు సహకరిస్తున్నారని , శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో పాటు , ప్రజాసంఘాలు మండి పడుతున్నాయి . భాద్యులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
-
Chairmans Desk : ఏపీ ప్రజల జాతకంలో రాజధాని యోగం లేదా..?
-
Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్‌దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!