NTV Telugu Site icon

TPCC Mahesh Goud : కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదు

Maheshkumar

Maheshkumar

TPCC Mahesh Goud : సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదన్నారు. సీఎం రేవంత్‌ని వ్యతిరేకించిన అది పార్టీ కోసమే కానీ వ్యక్తిగతం కాదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ ఉన్నారు… ఆ విషయం తెలుసు అన్నారు. మీకు ఆ హక్కుంది.. మేము మీకు అండగా ఉంటామని ఆయన వ్యాఖ్యానించారు. మీరు పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పండి.. మేము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తామని హరీష్ రావుకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. మన ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నామని, అవన్నీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు వివరించాలన్నా మహేష్ గౌడ్‌. జనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటాలన్నారు. అధికారంలోకి వచ్చి 11 నెలల్లోనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని, బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మకై కాంగ్రెస్ పార్టీపై కుట్ర పన్నుతున్నాయన్నారు.

Bengaluru: అమెజాన్ హెడ్‌క్వార్టర్స్‌ తరలింపు.. తీవ్ర అసంతృప్తిలో ఉద్యోగులు

కార్యకర్త కూడా సీమని కలిసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని, కార్యకర్తలు నారాజ్ అయితే మేం కుర్చీ దిగాల్సిందేనని ఆయన అన్నారు. మరోసారి మనం అధికారంలోకి రావాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని, కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుందన్నారు. అంతేకాకుండా..బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయ్యిందని ఆయన విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు బారుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు 70 ఏళ్లయిన చెక్కు చెదరలేదని, వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఉండదన్నారు మహేష్‌ గౌడ్‌. హరీష్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నాడని, చివరికి పార్టీలో తండ్రి, కొడుకు, కూతురు తప్ప ఎవరూ మిగలరని ఆయన వ్యాఖ్యానించారు.

Pawan Kalyan: మహారాష్ట్ర ప్రజలకు పవన్ కల్యాణ్ హామీలు.. వీలైనంత త్వరగా అమలు చేస్తాం..