Lions: సింహాలకు అక్బర్, సీత పేర్లు పెట్టిన అధికారికి ఝలక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రెండు సింహాలకు అక్బర్, సీత (Akbar and Sita) అనే పేర్లు పెట్టడంపై పశ్చిమబెంగాల్‌లో ఎంత దుమారం చెలరేగిందో తెలిసిందే. విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా వ్యతిరేకించింది. అంతేకాకుండా కలకత్తా హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తంచేసింది. తాజాగా ఈ ఘటనలో ఓ ఫారెస్ట్ ఉన్నతాధికారిపై వేటు పడింది.
పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని శిలిగుడి సఫారీ (Bengal Safari) పార్కులో అక్బర్, సీత పేర్లు కలిగిన మగ, ఆడ సింహాలను ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. వాటికి ఆ పేర్లు పెట్టడంపై విశ్వహిందూ పరిషత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. తక్షణమే వాటికి పేర్లు మార్చాలని ఆందోళన చేపట్టింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన కలకత్తా హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కాస్తా దుమారం చేలరేగడంతో త్రిపుర (Tripura) ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఆ రాష్ట్ర అటవీ వ్యవహారాల ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రబిన్ లాల్ అగర్వాల్‌పై (tripura Forest Officer Suspended) సస్పెన్షన్ వేటు వేసింది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
జంతువుల మార్పిడి కార్యక్రమం కింద బెంగాల్ అధికారులు ఫిబ్రవరి 12న త్రిపురలోని సిపాహీజలా జూ పార్క్ నుంచి రెండు సింహాలను శిలిగుడి సఫారీ పార్కుకు తీసుకొచ్చారు. ఆడ, మగ సింహాలైన ఆ రెండు అక్బర్, సీత అనే పేర్లు కలిగి ఉన్నాయి. ఈ రెండింటిని ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. దీనిపై విశ్వహిందూ పరిషత్ (VHP) కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర అటవీశాఖ అధికారులే వాటికి ఆ పేర్లు పెట్టారని.. అవి హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించింది. వెంటనే ఆడ సింహం పేరు మార్చాలని డిమాండ్ చేసింది.
దీనిపై ఇటీవల విచారణ జరిపిన న్యాయస్థానం.. సింహాలకు ఆ పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అనవసర వివాదాలు ఎందుకు సృష్టిస్తారని ప్రశ్నించింది. వెంటనే వాటికి వేరే పేర్లు పెట్టాలని ఆదేశించింది. దీనిపై బెంగాల్ ప్రభుత్వం స్పందిస్తూ.. త్రిపుర నుంచి తీసుకొచ్చేటప్పటికే వాటికి ఆ పేర్లు ఉన్నాయని.. వాటిని మారుస్తామని కోర్టుకు తెలిపింది.
ఈ వ్యవహారం వివాదాస్పదమవడంతో త్రిపుర ప్రభుత్వం తాజాగా చర్యలకు దిగింది. రాష్ట్ర వైల్డ్‌లైఫ్ చీఫ్‌గా ఉన్న అగర్వాల్‌ను వివరణ కోరగా.. తాను ఆ పేర్లు పెట్టలేదని చెప్పారు. అనంతరం దర్యాప్తు చేపట్టగా.. బెంగాల్‌కు అప్పగించే సమయంలో డిస్పాచ్ రిజిస్టర్‌లో ఆయనే ఆ సింహాల పేర్లను అక్బర్, సీతగా నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో అగర్వాల్‌ను విధుల నుంచి సస్పెండ్ చేసింది.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?