IPL History: ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌట్ స్టార్లు ఎవరో తెలుసా?
- మార్చి 22 నుండి ఐపీఎల్ 2025 సీజన్ మొదలు
- ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌటైన లిస్ట్ లో టీమిండియా సభ్యులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL History: మార్చి 22 నుండి ఐపీఎల్ 2025 సీజన్ మొదలు కానున్న విషయం తెలిసిందే. తాజాగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భారత్ విజయ కేతనం ఎగురవేయగా.. ఆ తరవాత టీమిండియా ఆటగాళ్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కు సన్నధమ్మ అవుతున్నారు. ఇప్పటికే అన్ని టీమ్స్ ప్రాక్టీస్ ను కూడా మొదలు పెట్టేశాయి కూడా. ఇక ఐపీఎల్ సంబంధించిన విశేషాలు చాలానే ఉన్నాయి.
నిజానికి మనకు ఐపీఎల్ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది బ్యాటమెన్స్ కొట్టే బౌండరీలు. బ్యాటింగ్ అయినా, బౌలింగ్ అయినా.. ప్రతిదీ వేగంగా జరుగుతుంది. ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌గా ఐపీఎల్ చరిత్ర గాంచింది. ఈ ఐపీఎల్ ఆటలో అనేకమంది స్టార్ క్రికెటర్లు వారి ప్రతిభను ప్రదర్శించి అనేక రికార్డులు లిఖించారు. అయితే, వీటిలో మంచి రికార్డులతో పాటు కొన్నిసార్లు ఆటగాళ్లు చెత్త రికార్డులను కూడా నెలకొల్పుతారన్న విషయం తెలిసిందే. ఇక వాటిలో ఒకటే అత్యధిక సార్లు డకౌట్ అయ్యిన ఆటగాళ్ల లిస్ట్. మరి ఈ జాబితాలో మొదటి స్థానాల్లో ఉన్న ప్రముఖ ఆటగాళ్ల గురించి చూద్దమా..
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
Read Also: SIPB Meeting: ఎస్ఐపీబీ సమావేశం.. రూ.1,21,659 కోట్ల పెట్టుబడులకు ఆమోదం
దినేష్ కార్తీక్ (18 డకౌట్లు):
టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ దినేష్ కార్తీక్ ఈ మధ్యే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి విదితమే. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచే లీగ్‌లో భాగమైన కార్తీక్ అనేక టీమ్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) జట్టుతో ఐపీఎల్లో అడుగుపెట్టిన ఆయన 2024 ఐపీఎల్ సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతో ముగించాడు. అయితే, కార్తీక్, ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా 18 సార్లు డకౌట్ అయ్యి అగ్ర స్థానంలో ఉన్నాడు.
గ్లెన్ మాక్స్వెల్ (18 డకౌట్లు):
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు గ్లెన్ మాక్స్వెల్ ఈ లిస్ట్ లో రెండో స్థానంలో నిలిచాడు. 2012లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఆయన, ఆ తర్వాత 2013లో ముంబై ఇండియన్స్ జట్టులో, 2014లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ఇప్పటి పంజాబ్ కింగ్స్) తరఫున, ఆ తర్వాత ఆర్సిబి తరుపున అసాధారణ ప్రదర్శన కనబరిచిన మాక్స్వెల్ 18 సార్లు డకౌట్ అయ్యి రెండో స్థానంలో నిలిచాడు.
Read Also: Hari Hara Veera Mallu : “హరిహర వీరమల్లు” రిలీజ్ అప్పుడేనా?
రోహిత్ శర్మ (17 డకౌట్లు):
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. 5 ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుని టీమిండియా మాజీ కెప్టెన్‌గా ఎంఎస్ ధోనితో సమానంగా నిలిచాడు. 2009లో ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న డెక్కన్ ఛార్జర్స్ జట్టులో కూడా రోహిత్ సభ్యుడే. బ్యాట్స్‌మన్‌గా కూడా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రోహిత్ ఒకడు. ఇన్ని రికార్డ్స్ తో పాటు రోహిత్ 17 సార్లు డకౌట్ అయ్యి మూడో స్థానంలో ఉన్నాడు.
పియూష్ చావ్లా (16 డకౌట్లు):
ఈ లిస్ట్ లో టీమిండియా లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లా కూడా స్థానం సంపాదించుకున్నాడు. 2008లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఆయన 2013 వరకు ఆ జట్టుకే ప్రాతినిధ్యం వహించాడు. ఆపై 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టులో చేరి ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి పంజాబ్‌ను ఓడించి KKRకు రెండో టైటిల్ అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ లో మొత్తం 16 సార్లు డకౌట్లు అయ్యి నాల్గవ స్థానంలో ఉన్నాడు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!