ఆసుపత్రి నుంచి తమీమ్ ఇక్బాల్ డిశ్చార్జ్..
బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు తమీమ్ ఇక్బాల్ గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే.. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో.. అతను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. మార్చి 24న ఢాకా ప్రీమియర్ లీగ్ (డీపీఎల్) 2025లో ఆడుతుండగా 36 ఏళ్ల ఇక్బాల్ గుండెపోటుకు గురయ్యాడు. సహచర ప్లేయర్స్, సిబ్బంది హుటాహుటిన అతడిని ఢాకాలోని కెపిజె ఎవర్‌కేర్ ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేసిన తర్వాత.. డాక్టర్లు తమీమ్‌కు ఆంజియోప్లాస్టీ నిర్వహించారు. చికిత్స అనంతరం అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. దీంతో.. డాక్టర్లు అతన్ని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
మయన్మార్‌లో భారీ భూకంపం.. ఈ ప్రాంతంలో ఎందుకు, భూగర్భంలో ఏం జరుగుతోంది..?
మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ రోజు మధ్యాహ్నం 12.50 గంటలకు 7.7, 6.4 తీవ్రతతో కూడా శక్తివంతమైన భూకంపాల కారణంగా మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్ వణికాయి. సాగింగ్ పట్టణానికి వాయువ్యంగా 16 కి.మీ దూరంలో, 10 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉంది. ఈ భూకంపాల వల్ల చాలా భవణాలు దెబ్బతిన్నాయి. మయన్మార్ రాజధాని నేపిడాలో 1000 పడకల ఆస్పత్రి కుప్పకూలింది. చాలా భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. మాండలేలోని ఐకానిక్ అవా వంతెన ఇరావడీ నదిలోకి కూలిపోయింది. వీటికి సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం.. కేసులన్నీ…
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులన్నింటినీ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు బదిలీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు సమాచారం అందిస్తూ, ఇప్పటికే పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదై ఉన్నాయని స్పష్టం చేశారు. నెలలుగా పెద్ద దందాగా మారిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా, ఇప్పటివరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులన్నింటినీ సమగ్ర దర్యాప్తు కోసం SITకు బదిలీ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది.
అభివృద్ధి చేయడం నేర్చుకోండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సలహా
హైదరాబాద్ నగర అభివృద్ధి, రియల్ ఎస్టేట్ పరిస్థితి, ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ, గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో నగరం సౌభాగ్యంగా ఎదిగిందని, కానీ 15 నెలల కాంగ్రెస్ పాలనలో అభాగ్యంగా మారిందని విమర్శించారు. హైదరాబాద్ నగరాభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని కేటీఆర్ ఆరోపించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరుతో నగరంలోని రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా కుంచించుకుపోయిందని తెలిపారు.
అత్యంత శక్తిమంతుల జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తన పరిపాలనా నైపుణ్యం.. ప్రభావంతమైన రాజకీయంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత శక్తిమంతమైన నాయకునిగా నిలిచారు. ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2025 సంవత్సరానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యధిక శక్తిమంతులైన 100 మంది ప్రముఖులతో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం దక్కించుకున్నారు. 2024 సంవత్సరపు జాబితాలో 39 స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 28వ స్థానానికి చేరుకోవడం విశేషం. దేశంలో రాజకీయ, వ్యాపార, క్రీడా, వినోద రంగాల్లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర పాలనలో తీసుకువచ్చిన మార్పులు, వ్యూహాత్మక రాజకీయ కార్యకలాపాలు, దేశవ్యాప్తంగా ఇండియా కూటమిలో పోషిస్తున్న ప్రముఖమైన పాత్రతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఈ గుర్తింపు లభించింది. తనదైన దూకుడుతో భారత రాజకీయాల్లో ఆయన చూపుతున్న ప్రభావం, నాయకత్వ లక్షణాలతో ఆయన ర్యాంకు మెరుగుపడింది. ఒక ప్రాంతీయ నాయకుడినే కాకుండా దేశంలోనే అత్యంత శక్తిమంతమైన, చురుకైన ముఖ్యమంత్రుల్లో ఒకరిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిర్భవించారు.
అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అర్జున్ సన్నాఫ్ వైజయంతి. విజయశాంతి చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తోంది. ఇందులో వైజయంతిగా విజయశాంతి నటిస్తోంది. తల్లి, కొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా సాగుతోంది. ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. కల్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ సినిమాతో రాబోతున్నాడు. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ వచ్చేది ఎప్పుడనేది అప్డేట్ ఇచ్చారు. మార్చి 31న ‘నా యాల్ది’ అనే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.
మల్లాపూర్ అమన్ స్వీట్స్ ఫ్యాక్టరీ సీజ్.. గడువు ముగిసిన స్వీట్లతో మళ్లీ తయారీ!
ప్రముఖ స్వీట్ షాపులో అయితే ఎలాంటి కల్తీ ఉండదు.. నాసిరకం ఉండదని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ కూడా కల్తీ జరుగుతుందని విషయం ఇప్పుడు బయటపడింది.. ఎందుకంటే ప్రముఖ స్వీట్ షాపులకు సరఫరా చేస్తున్నా తయారీ కేంద్రం పైన ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.. ఈ సోదాల్లో భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.. మల్లాపూర్ లోని అమన్ స్వీట్స్ తయారీ కేంద్రం పైన ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు నిర్వహించారు.. భయంకరమైన నిజాలతో వెంటనే దానిని సీజ్ చేయడం జరిగింది.. స్వీట్ షాపుల్లో మిగిలిపోయిన లేదా కాలం చెల్లిన స్వీట్స్ ని అన్నిటిని ఇక్కడికి చేర్చి వాటితో మళ్లీ కొత్త స్వీట్స్ తయారు చేసి అదే స్వీట్ షాప్ లోకి పంపిస్తున్నారు. కాలం చెల్లిన స్వీట్స్ ని రీసైకిల్ చేసి కొత్త స్వీట్స్ పై కొత్త లేబులింగ్ చేసి తిరిగి షాపుల్లోకి సప్లై చేస్తున్నారు.. దీంతో పాటు నాసిరకం వస్తువులను వాడుతున్నారు.. అపరిశుభ్రత మధ్యలో స్వీట్స్ ను తయారుచేసి సప్లై చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల విచారణలో బయటపడింది ..దీంతో స్వీట్ షాపు స్వీట్ కర్మగారాన్ని వెంటనే అధికారులు సీజ్ చేశారు.. దాని లైసెన్సులు కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ..
మీ తల్లి, చెల్లి వీడియోలు పెట్టుకోండి.. హీరోయిన్ సంచలనం..
హీరోయిన్ శృతి నారాయణన్ ప్రైవేటీ వీడియో లీక్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిపోయింది. ఓ ఆడిషన్ కోసం ఆమె ఇచ్చిన ప్రైవేట్ వీడియో ఇది. దాన్ని కొందరు సీక్రెట్ గా రికార్డు చేసి ఇప్పుడు సోసల్ మీడియాలో లీక్ చేశారు. దానిపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే శృతి నారాయణన్ సీరియస్ గా స్పందించింది. తనను ఇలా బాధపెట్టడం సమంజసం కాదని చెప్పుకొచ్చింది. ఈ మేరకు వరుసగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసింది ఈ భామ. తన ప్రైవేట్ వీడియోను ఇలా ప్రచారం చేయడం ఆపేయాలంటూ ఆమె రిక్వెట్ చేస్తూనే స్కామర్లపై ఫైర్ అయింది.
50 ఏళ్ల వయసులో మలైకా అందాల అరాచకం..
బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా అరాచకం అంతా ఇంతా ఉండట్లేదు. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్టులు కుర్రాళ్లకు మెంటలెక్కిస్తుంటాయి. యాభై ఏళ్ల వయసులో కూడా తగ్గేదే లే అన్నట్టు అందాలను ఆరబోస్తూనే ఉంది. ఈ వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు ఏ మాత్రం తీసి పోని అందాలను మెయింటేన్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ కు ఆమె పెట్టింది పేరు. ఒకప్పుడు ఆమె ఐటెం సాంగ్స్ తో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది. కండల వీరుడు సల్మాన్ ఖాన్ తమ్ముడిని పెళ్లి చేసుకున్న తర్వాత ఓ కొడుకు పుట్టాడు. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది.
కేదార్‌నాథ్ సహా చార్‌ధామ్‌లో రీల్స్, యూట్యూబ్ వీడియోలపై బ్యాన్..
యమునోత్రి, గంగోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ల ‘‘చార్ ధామ్’’ యాత్ర మరికొన్ని రోజుల్లో మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ఏర్పాట్లను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ యాత్ర కోసం 9 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. కేవలం ఆరు రోజుల్లోనే 9 లక్షల మంది నమోదు చేసుకున్నారు. కేదార్‌నాథ్ కి 2.75 రిజిస్ట్రేషన్లు, బద్రీనాథ్‌కి 2.2 లక్షల రిజిస్ట్రేషన్లు, గంగోత్రికి 1.38 లక్షలు, యమునోత్రికి 1.34, హేమకుండ్ సాహిబ్‌కి 8000 రిజిస్ట్రేషన్లు వచ్చాయి.