సీఎం, డిప్యూటీ సీఎం మద్దతు పాకిస్తాన్‌కా, ఆస్ట్రేలియాకా..? కుమారస్వామి విమర్శలు..
జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌లపై విమర్శలు గుప్పించారు. సీఎం, డిప్యూటీ సీఎం కొందరు సహచరులతో కలిసి బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు వెళ్లారు. దీనిపై కుమారస్వామి శనివారం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం కష్టకాలంలో ఉంటే ప్రభుత్వం మాత్రమ క్రికెట్ మ్యాచులు చూస్తోందని ఆరోపించారు.
ఈ మ్యాచ్‌లో మీరు పాకిస్తాన్‌కి మద్దతు ఇచ్చారా..? లేక ఆస్ట్రేలియాకు మద్దతు ఇచ్చారా..? అని సెటైర్లు వేశారు. ప్రజలు ప్రభుత్వంలో అవినీతి గురించి మాట్లాడుతుకుంటున్నారని అన్నారు. ప్రజలు మాకు అధికారం ఇచ్చారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.. పర్సంటేజీలు, అవినీతిపై ప్రజలు మాట్లాడుకుంటున్నారు, మేం చెప్పినట్లు చేశామని కాంగ్రెస్ చెబుతున్నప్పటికీ, రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారని కుమారస్వామి అన్నారు.
రాష్ట్రప్రభుత్వం, కేంద్రం సహాయం కోసం లేఖలు రాసింది, రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు కేంద్రాన్ని కలవాలని ప్రభుత్వానికి సూచించారు. కొన్ని జిల్లాల్లో నీటి కొరత ఉందని, రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం కర్ణాటకలో జేడీఎస్, బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఇరు పార్టీలు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కుమారస్వామి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు జనసేనలో తావు లేదు.
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. టీడీపీతో పొత్తు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. చర్చల్లో పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలి.. వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు తావు లేదు.. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధులది గురుతర బాధ్యత అని చెప్పుకొచ్చారు. ప్రజా ఉపయోగ అంశాలపై బలంగా మాట్లాడాలి.. ఎవరైనా ఒక నాయకుడు ప్రభుత్వ పాలసీలకు ఆటంకం కలిగించినప్పుడు అతని విధానాలు, చేసిన తప్పుల గురించి బలంగా ప్రస్తావించండి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఆరోగ్య ఆంధ్రా లక్ష్యంగా పని చేస్తున్నాం..
విశాఖపట్నంలోని కేజీహెచ్ లో ఆధునికీకరించిన కార్డియాలజీ విభాగాన్ని ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజినీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి విడదల రజినీ మాట్లాడుతూ.. ఆంధ్ర మెడికల్ కాలేజ్ 100 యేళ్లు పూర్తి చేసుకుంది.. ఈ శత వసంతాల సంబరంలో పాల్గొనడం హ్యాపీగా ఉంది.. కేజీహెచ్ లో 600 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.. గతంతో పోల్చుకుంటే ఇక్కడ రోగులకి మెరుగైన వైద్యం అందుతుంది.. వసతులు పెరిగాయని ఆమె చెప్పుకొచ్చారు.
ఇక్కడకి వచ్చేవారికి ఆరోగ్యకరమైన వాతావరణం కలిపిస్తున్నం అని మంత్రి విడదల రజినీ అన్నారు. జిల్లాలో అధికారులు సమర్థవంతంగా పని చేస్తున్నారు.. రాష్ట్రంలో 16 వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంది.. కొత్త మెడికల్ కాలేజ్ లు తీసుకు వస్తున్నాము.. ఆరోగ్యశ్రీలో వేల కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు.. జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రతి గడపకి వైద్యం అందిస్తున్నాము అని ఆమె తెలిపారు. ఆరోగ్య ఆంధ్రా లక్ష్యంగా పని చేస్తున్నాం.. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు హయంలో చేసింది ఏమి లేదు అని మంత్రి విడదల రజినీ అన్నారు.
ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిసిన జడ్చర్ల డీసీఎం అసోసియేషన్.. పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని హామీ
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో రాజకీయ నేతలు ప్రచారంలోకి దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని తన ప్రచార జోరును పెంచారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఓ వైపు ప్రచారంలో ముందుకెళ్తుండగా, మరోవైపు పార్టీలో పలువురు నేతలు, కార్యకర్తలు చేరుతున్నారు. అందులో భాగంగానే.. ఈరోజు ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డిని జడ్చర్ల డీసీఎం అసోసియేషన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేస్తుందని.. రాబోయే రోజుల్లో కూడా మరింత అభివృద్ధి చేయాలని వారు కోరారు. అందుకోసం పార్టీ గెలుపే లక్ష్యంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ BRS స్కీమ్లను కాపీ చేసింది
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చెరుకు సుధాకర్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తన DNAలో బీజేపీ పై పోరాటం చేసేది ఉన్నది అని రాహుల్ గాంధీ అన్నారని.. రేవంత్ రెడ్డి DNA లో ఏమి ఉన్నది అని రాహుల్ గాంధీని అడుగుతున్నట్లు ఆయన ప్రశ్నించారు.
హెల్త్ అప్డేట్ ఇచ్చిన సునైనా.. ఆమెకు ఇప్పుడెలా ఉందంటే?
తమిళ నటి సునయన తెలుగు అమ్మాయే అయినా తమిళంలో ఎక్కువగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమెను తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగులో కూడా ఆమె కొన్ని గుర్తుంచుకోదగ్గ సినిమాల్లో నటించి మెప్పించింది. రాజా రాజా చోర, లాఠీ సినిమాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఆమె వరుస సినిమాలతో ఇరగదీస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సునయన హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫొటో షేర్ చేయడంతో ఆమె అభిమానులు టెన్షన్ లో మునిగిపోయారు. ఆమె తన సోషల్ మీడియాలో ఒక పోస్టు ద్వారా ఒక ఫోటోను షేర్ చేసింది, అందులో హాస్పిటల్ బెడ్ పై.. ఆక్సిజన్ పెట్టుకొని కనిపించిస్తూ ” నాకు కొంత సమయం ఇవ్వండి.. నేను మళ్లీ తిరిగి వస్తాను” అని రాసుకొచ్చింది.
ఈ దేశానికి కాంగ్రెస్ చేసిన మంచి పని ఏంటి?
కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. చిట్ చాట్లో భాగంగా.. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీర్ఎస్ కు 88 సీట్ల కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పారు. ఎన్నికలు ఉన్నపుడల్లా కాంగ్రెస్ ముహూర్తాలు పెట్టడం మాములేనని విమర్శించారు. తాము 95 శాతం అభ్యర్థులకు బి ఫార్మ్ లు ఇచ్చామన్నారు. ఎన్నికల్లో ఇప్పటివరకు ముందు ఉన్నాం… ఫలితాల్లో కూడా ముందు ఉంటామని కేటీఆర్ తెలిపారు. అక్కడక్కడా ఎమ్మెల్యేల మీద చిరు కోపం ఉన్న.. కేసీఆర్ లీడర్ షిప్ ను కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో బీజేపీ రేసులో లేదని… కాంగ్రెస్ తోనే బీఆర్ఎస్ కి పోటీ అని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రే ఆ పార్టీకి గుది బండ అని విమర్శించారు. రాహుల్ గాంధీ అజ్ఞాని అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో 5 మెడికల్ కాలేజీలు ఇచ్చారని… కానీ బీఆర్ఎస్ సర్కార్ 30 మెడికల్ కాలేజీలు ఇచ్చిందని తెలిపారు. రాహుల్ గాంధీ ఈ సారి తెలంగాణ వచ్చినప్పుడు విషయాలు తెలుసుకొని రావాలని చెప్పారు. మాకు వ్యవసాయం గురించి సుద్దులు చెబుతారా ?…మీకు బుద్ధి ఉందా ? అని మండిపడ్డారు.
గోదావరిలో నలుగురు యువకులు గల్లంతు
కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. నలుగురు యువకులు గోదావరిలో గల్లంతు అయ్యారు. తాళ్లరేవు మండలం గోపలంక దగ్గర ఈ ఘటన జరిగింది. తణుకు పరిధిలోని సజ్జాపురంకు చెందిన 8 మంది విహారయాత్రకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఇక, సెలవులు సందర్భంగా యానాం విహార యాత్రకు వచ్చిన స్టూడెంట్స్.. విహార యాత్ర ముగించుకొని వెళ్తూ వెళ్తూ.. గోదావరిలోకి యువకులు దిగారు. గోదావరిలో గల్లంతైన నలుగురు తణుకు కి చెందిన విద్యార్థులు 1. రవితేజ,(20) డిగ్రీ, బాలాజీ(21) బీటెక్, కార్తీక్(21) బీటెక్, గణేష్(22) గా గుర్తించారు.
‘నిజం గెలవాలి’ పేరుతో నారా భువనేశ్వరి పర్యటన
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతిమణీ నారా భువనేశ్వరి ఇప్పటి వరకు ప్రజల్లోకి వెళ్లలేదు. కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయ్యాక ఆమె ప్రజల్లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పాడింది. ఈ క్రమంలో భువనేశ్వరి ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు.
ఇక, 23వ తేదీ సాయంత్రం నారావారిపల్లెకు నారా భువనేశ్వరి చేరుకుంటారు. 24వ తేదీన కులదైవం నాగాలమ్మకు పూజలు చేసి, పాకాల మండలం, నేండ్రగుంటకు చెందిన రైతు చిన్నబ్బనాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తారు. తర్వాత పనపాకం లేక రాయలపురం ఎస్సీ కాలనీలో ఆమె భోజనాలు చేస్తారు.. 25వ తేదీ ఉదయం తిరుమలకు చేరుకుంటారు.. ఆ తర్వాత చంద్రగిరి సమీపంలో అగరాల నేషనల్ హైవే పక్కన అమర్నాథ్ రెడ్డి వియ్యంకుడు వెంకటరెడ్డి స్థలంలో 5 వేల మంది మహిళలతో నారా భువనేశ్వరి మీటింగ్ నిర్వహిస్తారు.
పాలస్తీనా అరబ్బుల భూమి.. ఇజ్రాయిల్ ఆక్రమించింది..
ఇజ్రాయిల్-పాలస్తీనా హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం రెండు వారాలకు చేరింది. అక్టోబర్ 7న జరిగిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ భూభాగాల్లోకి ప్రవేశించి ప్రజల్ని ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది మరణించారు. 200 మంది కన్నా ఎక్కువ మందిని హమస్ ఉగ్రవాదులు బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. ప్రస్తుతం గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల వల్ల గాజాలో 4000 మంది మరణించారు. మొత్తంగా ఈ రెండు వర్గాల మధ్య వార్ కారణంగా మరణాల సంఖ్య 5600కి చేరింది.
ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తాజాగా ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత 80 ఏళ్లుగా ఇజ్రాయిల్ పాలస్తీనా భూమిని ఆక్రమించుకోవడం వాస్తవమే అని అన్నారు. మహాత్మా గాంధీ మాటలను ఉటంకిస్తూ..‘‘ ఇంగ్లండ్ ఆంగ్లేయుల భూమి, ఫ్రాన్స్ ఫ్రెంచ్ వారి భూమి అయినట్లే, పాలస్తీనా అరబ్బుల భూమి అని మహాత్మాగాంధీ చెప్పారని నేను దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను’’ అని ఓవైసీ అన్నారు.