బైక్ దొంగిలిచాడని చెట్టుకు కట్టేసి కొట్టిన స్థానికులు
బైక్ దొంగిలిచాడని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన బీహార్‌లోని వైశాలిలో జరిగింది. స్థానికులు చెట్టుకు కట్టేసి రక్తమొచ్చేటట్టు చితకబాదారు. అతన్ని అలా కొడుతుండగా.. కొందరు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని చెట్టు నుంచి విడిపించారు. అనంతరం అతన్ని పోలీసులు తమ వెంట తీసుకువెళ్లారు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కాగా.. అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని వైశాలి జిల్లా మహువా పోలీస్ స్టేషన్ పరిధిలోని అబ్దుల్‌పూర్ చౌక్‌లో బైక్ ను దొంగిలిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. మాస్టర్ కీతో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో ఆగ్రహించిన స్థానికులు యువకుడిపై దాడి చేశారు. అంతేకాకుండా చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. ఇదిలా ఉంటే.. యువకుడిపై ఇప్పటికే దొంగతనం కేసులు ఉన్నాయి. ఇంతకుముందు కూడా.. దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చిన ఘటనలు చాలా ఉన్నాయి. తాజాగా మరోసారి దొంగతనం చేసి పట్టుబడ్డాడు. ఈ కేసులో పోలీసులు అతనిపై దర్యాప్తు ప్రారంభించారు.
ఈ నెల 28న చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత
తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05 గంటల నుంచి 2:22 గంటల మధ్య చంద్ర గ్రహణం ఏర్పడనుంది. చంద్రగ్రహణం కారణంగా 28వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. ఈ సందర్భంగా 28వ తేదీన సహస్రదీపాలంకరణ సేవ, వయోవృద్దులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.
శనివారం 87,081 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.4.05 కోట్ల ఆదాయం సమకూరినట్టు టీటీడీ ప్రకటించింది. అలాగే, మొత్తం 41,757 మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్టు తెలిపింది. రద్దీ నేపథ్యంలో సర్వదర్శన టోకెన్లను అక్టోబరు 1, 7,8,14, 15 తేదీల్లో నిలిపివేసినట్టు టీటీడీ వెల్లడించింది.
తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయి
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. పాలమూరు ప్రజా గర్జన బహిరంగ సభా వేదికగా వాగ్బాణాలను సంధించారు. తెలంగాణ అభివృద్ధిని రెండు కుటుంబ పార్టీలు అడ్డుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. కరప్షన్, కమీషన్ ఈ రెండు పార్టీల సిద్ధాంతమంటూ విమర్శలు గుప్పించారు. పార్టీ అధ్యక్షుడి నుంచి అన్ని పదవుల్లోనూ కుటుంబసభ్యులే ఉంటారన్నారు ప్రధాని మోడీ. బీఆర్‌ఎస్ కారు స్టీరింగ్ మరో పార్టీ చేతిలో ఉందని.. తెలంగాణ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో అందరికీ తెలుసని ప్రధాని తెలిపారు. బీజేపీ మాత్రం సామాన్యుల కోసం ఆలోచిస్తుందన్నారు. మోడీ ఇచ్చే గ్యారెంటీలపై తెలంగాణ ప్రజలకు భరోసా ఉందన్నారు. తెలంగాణలో రోజు రోజుకు బీజేపీ పట్ల ఆదరణ పెరుగుతోందని ప్రధాని చెప్పారు. రాజకీయ పార్టీలను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలుగా మార్చారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జట్టు ఆట తీరును మార్చుకోవాలి.. సొంత టీమ్పై పాక్ మాజీ క్రికెటర్ విమర్శలు
ప్రపంచకప్‌కు ముందు వార్మప్ మ్యాచ్‌లో పాకిస్థాన్, న్యూజిలాండ్తో తలపడిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 345 పరుగులు చేసింది. అయితే న్యూజిలాండ్ కేవలం 43.4 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 346 పరుగులు చేసి విజయం సాధించింది. వార్మప్ మ్యాచ్ లో ఓటమి చెందిన తర్వాత పాక్ జట్టుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. జట్టు ఓటమిపై పాక్ మాజీ ఆటగాడు రమీజ్ రాజా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
“నాపై చేతబడి చేస్తున్నారు”.. బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే వింత ఆరోపణలు చేశారు. ప్రజలు తనపై చేతబడి ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. లఖింపూర్ ఖేరీ జిల్లా మెమహ్మదీ ఎమ్మెల్యే అయిన లోకేంద్ర ప్రతాప్ సింగ్ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ ఫిర్యాదు చేశారు. తనను లక్ష్యంగా చేసుకుని చేతబడి చేస్తున్నారని, ఓ ఫోటోను పోస్ట్ చేశారు. తాను భోలేనాథ్(శివుడి) భక్తుడిని అని తనకు ఏం జరగదని ఆయన అన్నారు. ఎమ్మెల్యే చేతబడి అని ఆరోపిస్తూ పోస్ట్ చేసిన ఫోటోలో ఆయన చిత్రం, కూరగాయలు, ఒక సీసా, మరికొన్ని వస్తువులు ఒక ఎర్రని వస్త్రంలో ఉండటం చూడవచ్చు.
ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అఖండ, అత్యంత మెజారిటీతో గెలిపించండి
తిరుపతి చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆశీర్వదించారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ని అఖండ, అత్యంత మెజారిటీతో గెలిపించండని కోరారు. చంద్రాబాబు సొంత నియోజక వర్గంలో పోటీ చేస్తున్నాడు ఆశీర్వదించండని, ఒక వైపు నాయకత్వ లోపంతో తెలుగుదేశం పార్టీ కొట్టు మిట్టాడుతోందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు అరెస్ట్ అయితే వాళ్ల పార్టీ నుంచి చిన్న పోరాటం కూడా జరగలేదని, బంద్ కు పిలుపునిస్తే చంద్రబాబు ఇంటిలోని కారు కూడా నిలవలేదన్నారు. తెలుగుదేశం పార్టీని ఎలా నడిపించాలో కూడా తెలియని, దిక్కు తోచని స్థితిలో ఆ పార్టీ ఉందని ఆయన అన్నారు. పైగా చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఆ పార్టీ వాళ్లు గంటలు కొట్టి, డప్పులు వాయించడం, చప్పుడు చేయడాన్ని చూస్తుంటే సంబరాలు చేసుకుంటున్నట్టు అనిపిస్తోందన్నారు. సాధారణంగా విజయోత్సవాలు, సంబరాలు చేసుకునే సమయం లోనే ఇలాంటివి చేయడం జరుగుతుందన్నారు.
కురుక్షేత్రం అంటే కురుక్షేత్రమే.. వచ్చేది జనసేన-టీడీపీ ప్రభుత్వమే..
ఈ సారి ఎన్నికలు కురుక్షేత్ర యుద్ధమని జగన్ అంటున్నారని.. జగన్ ఓటమి ఖాయమని, మేం అధికారంలోకి రావడం ఖాయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో వారాహి విజయ యాత్ర బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. మెగా డీఎస్సీ కోరుకుంటున్న అందరికీ తాము అండగా ఉంటామన్నారు. 30 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అంటున్నారని పవన్ ఈ సందర్భంగా చెప్పారు. ప్రస్తుతం కురుక్షేత్రం జరుగుతోందని.. 100 మందికి పైగా ఉన్నారు కాబట్టి.. వైసీపీ వాళ్లే కౌరవులు అని పవన్ అన్నారు. మెగా డీఎస్సీ అని జగన్ ఇచ్చిన హామీలేమయ్యాయని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సందర్భంగా జనసేనాని హామీ ఇచ్చారు. పోలీసులను అండగా పెట్టుకుని.. కిరాయి సైన్యాన్ని చేతిలో పెట్టుకున్న వైసీపీతో పోరాడుతున్నామని పవన్ అన్నారు.
ప్రజాస్వామ్యం బలహీనపడటానికి అంతర్గత శత్రువులే కారణం
ప్రజాస్వామ్య బీజాలు మన సంస్కృతిలో ఎప్పుటినుంచో ఉన్నాయని.. ప్రజాస్వామ్యం బలహీనపడటానికి అంతర్గత శత్రువులే కారణమని మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు. విజయవాడలో సిటిజెన్స్ ఫర్ డెమోక్రసీ ఆవిర్భావ సభలో ఆయన ప్రసంగించారు. సమన్యాయం కాకుండా, నాకు ఓటు వేయని వారిని అణిచేస్తాననే ధోరణి సరైనది కాదన్నారు. ఓటు హక్కు వినియోగించుకోలేకపోవడం దుర్భరమన్నారు. పట్టణ ప్రాంతాలు ఓటు హక్కు వినియోగించుకోవడంలో వెనుకబడి ఉన్నాయని.. ఓటు వేయకుండా ప్రజా ప్రతినిధి నుంచీ జవాబుదారీతనం ఎలా ఆశిస్తారన్నారు. ప్రతిపక్షాలకు సంఖ్యతో సంబంధం లేకుండా అవకాశం కల్పించాలన్నారు. గిలెటిన్ ద్వారా పద్దులు ఆమోదం పొందడం బాధాకరమన్నారు. CAG(కాగ్) నివేదికలకు కచ్చితంగా స్పందించాలన్నారు. కాగ్ పాలనా పరమైన సూచనలు ఇటీవల అరుదుగా చేస్తోందని ఆయన చెప్పారు. రాజ్యాంగ అధికరణలు 72,73 స్ఫూర్తికి విరుద్ధంగా కొన్ని జరుగుతున్నాయని ఇటీవల నివేదిక వచ్చిందన్నారు.
సెమీ ఫైనల్‌లో ఓటమి.. కాంస్యంతో సరిపెట్టుకున్న నిఖత్ జరీన్
భారత బాక్సర్ నిఖత్ జరీన్ సెమీ ఫైనల్లో ఓడిపోయింది. బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించాలన్న భారత్ ఆశలు ఆవిరయ్యాయి. 50 కేజీల విభాగంలో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో నిఖత్ జరీన్ థాయ్‌లాండ్ బాక్సర్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత వెటరన్ నిఖత్ జరీన్ 2-3 తేడాతో ఓటమి పాలైంది. దీంతో బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించాలన్న భారత్ కల చెదిరిపోయింది. అయితే నిఖత్ జరీన్ ఓడిపోయినా కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఆసియా క్రీడలు 2023లో భారత్‌కు ఇది 43వ పతకం. నిఖత్ జరీన్ ఓటమి టోర్నీకి పెద్ద తలకిందులైంది. అంతకుముందు శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ జోర్డాన్‌కు చెందిన హనన్ నాజర్‌ను ఓడించి సెమీ ఫైనల్స్‌కు చేరుకుంది. ఈ విజయం తర్వాత.. నిఖత్ జరీన్ కూడా పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం తన కోటాను బుక్ చేసుకుంది.
మైయిటీ విద్యార్థుల హత్య కేసు.. సీబీఐ భారీ ఆపరేషన్.. ఆరుగురి అరెస్ట్..
మే నెలలో మణిపూర్ రాష్ట్రంలో జాతుల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ అల్లర్లలో జూలై నెలలో అదృశ్యమైన ఇద్దరు మైయిటీ తెగకు చెందిన విద్యార్థులు దారుణంగా హత్యకు గురయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో మరోసారి మణిపూర్ అగ్నిగుండంగా మారింది. ఏకంగా సీఎం బిరేన్ సింగ్ ఇంటిపైనే దాడి జరిగింది. బాధిత వర్గం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది. తాజాగా సీబీఐ, మణిపూర్ పోలీసులు, సైన్యం భారీ ఆపరేషన్ నిర్వహించి ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిని పట్టుకుంది. ఇందులో నలుగురిని అరెస్ట్ చేయగా.. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. నిర్భంధించిన వారిలో ఇద్దరు బాలికలు ఉన్నారు. వీరిని ఇంఫాల్ నుంచి గౌహతికి తీసుకెళ్లారు.
అడ్డమైన పార్టీకి ఓటు వేసి మోసపోకండి
పెద్దపల్లి జిల్లా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి అనంతరం బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మరోసారి మనోహర్ అన్న ను గెలిపించండన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కి పాటుపడిన వ్యక్తి దాసరి అని, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మేమంతా ఒక్కటే… గెలిచిన తర్వాత బి ఆర్ ఎస్ లోకి వెళ్తా అన్న విజయ రమణ రావు మాటలు నమ్మకండని, అడ్డమైన పార్టీ కి ఓటు వేసి మోసపోకండి.ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ని అధిక మెజార్టీ తో గెలిపించుకోండని ఆయన అన్నారు.
కసిరెడ్డి నారాయణ రెడ్డి తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకం
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు వివిధ అభివృద్ధి కార్యక్రమాలాల్లో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. 35 కోట్లతో కల్వకుర్తి, ఆమనగల్ ప్రాంతాల్లో ఆసుపత్రులు మంజూరు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కల్వకుర్తి ప్రాంతం అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ కసిరెడ్డిపై మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కల్వకుర్తి టిక్కెట్ ఇవ్వనందుకు పార్టీ మారడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నమ్మి రెండు సార్లు ఎమ్మెల్సీ పదవి ఇస్తే పార్టీకి ద్రోహం చేసిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తల్లిపాలు తాగి తల్లి రొమ్ము గుద్దే రకమని హరీష్ రావు ధ్వజమెత్తారు.