లైగర్ వంటి డిజాస్టర్ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ సినిమాలు చేసిన ఆశించిన ఫలితం మాత్రం దక్కలేదు విజయ్ దేవరకొండకు. ఈ సినిమాలతో రౌడీ ఫ్యాన్స్ సాటిస్ఫై అవలేదు. రెండు సినిమాలు కూడా ఓ మోస్తరు విజయాన్ని మాత్రమే అందుకున్నాయి. దీంతో విజయ్ సాలిడ్ కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో VD12 ప్రాజెక్ట్ చేస్తున్నాడు విజయ్. ఈ సినిమా పై అంచనాలు గట్టిగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది.
Also Read : Sid Sriram : హైదరాబాద్‌లో సిధ్ శ్రీరామ్ మ్యూజికల్ కాన్సర్ట్.. ఎప్పుడంటే..?
దేవరకొండ అగ్రెసివ్ లుక్‌తో అదరగొట్టాడు. షార్ట్ హెయిర్ కట్ మరియు గడ్డంతో కనిపించాడు రౌడీ. ఎప్పటి నుండో ఈ సినిమా నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత నాగవంశీ సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాను రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టుగా రాబోతుందని నాగవంశీ ఇటీవల తెలిపాడు. ఇప్పటి వరకు 80 శాతం షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేసినట్టు తెలుస్తోంది. రానున్న సమ్మర్ కానుకగా మార్చి 30న రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. దాదాపు ఈ డేట్ కె వస్తుందని టాక్ టాలీవుడ్ సిర్కిల్స్ లో వినిపిస్తుంది. ఆ డేట్ కు రావాల్సిన రెండు స్టార్ హీరోల సినిమాలు పోస్ట్ పోన్ అవుతాయని అందుకే ఆ స్లాట్ కు తమ సినిమాను తీసుకురావలని VD 12 మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూట్ జరుగుతుంది.