ఘోర రైలు ప్రమాదం.. ఏడుగురు మృతి
రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ఇది మనదేశంలో కాదండోయ్ రష్యాలో. రష్యాలో శనివారం రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఒక వంతెన కూలిపోవడంతో ఒక ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కొన్ని బోగీలు కిందపడ్డాయి. దీంతో ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. కేకలు వేస్తూ పరుగులు తీశారు.
ముగిసిన ఎషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్-2024.. 24 పతకాలతో భారత్..!
26వ ఎషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ 24 పతకాలతో విజయవంతంగా తన ప్రయాణాన్ని ముగించింది. చివరి రోజున బంగారు పతకాలు రాకపోయినా, భారత అథ్లెట్లు తమ ప్రతిభను చాటుతూ మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలతో మెరిశారు. ఇందులో మహిళల 5000 మీటర్ల పరుగు పోటీలో పరుల్ చౌధరీ 15:15.33 సెకన్లతో రెండవ స్థానంలో నిలిచి తన రెండవ రజతాన్ని గెలుచుకుంది. ఆమె ఇంతకు ముందు 3000మీటర్ల స్టీపుల్ చేజ్ లో కూడా రజతం గెలుచుకుంది.
నేటి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ.. పిఠాపురం నుంచి ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో చౌక ధరల దుకాణాలు మళ్లీ తెరుచుకుంటున్నాయని సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,796 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ ప్రారంభం కానుంది. నేడు పిఠాపురంలో రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు రేషన్ రైస్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించనున్నారు. కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు నేటి నుంచి డీలర్లు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసరాలు పంపిణీకి సిద్ధమయ్యారు.
కొడుకు కోసం ఒకటైన ధనుష్- ఐశ్వర్య.. పిక్స్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, తలైవా కూతురు ఐశ్వర్య 2004లో ఈ ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ 18 ఏళ్ల తరువాత వివాహ బంధానికి స్వస్తి పలికారు. అసలు ఇలా ఈ జంట విడిపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఈ డివోర్స్ మీద రకరకాల రూమర్లు కూడా వినిపించాయి. ధనుష్ వేరే నటితో సన్నిహితంగా ఉంటున్నాడని, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని, అందుకే వ్యవహారం ఇక్కడి వరకు వచ్చిందని. ఇలా చాలా రకాల మాటలు కోలీవుడ్‌లో వైరల్ అయ్యాయి. కానీ విడాకులు తీసుకున్న కూడా భార్యభర్తలుగా వేరుగా ఉన్నప్పటికీ.. తల్లిదండ్రులుగా మాత్రం ఎప్పుడు కలిసే కనిపించారు. ఈ జంటకు ఇద్దరు కొడుకులు.
క్రికెట్ లవర్స్ కు పండగే.. కాకినాడలో ప్యాన్ పార్క్ ఏర్పాటు.. ఎంట్రీ ఫ్రీ
ఐపీఎల్ 2025 క్రికెట్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తోంది. రసవత్తరంగా సాగిన ఐపీఎల్ జూన్ 3న జరిగే ఫైనల్ మ్యాచ్ తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో క్రికెట్ లవర్స్ కు బీసీసీఐ గుడ్ న్యూస్ అందించింది. కాకినాడ లో ఐపీఎల్ మ్యాచ్ లు చూడడానికి ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేసింది బిసిసిఐ. జూన్ 1, 3 తేదీలలో జరిగే సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ చూడడానికి ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే తొలి సారి కాకినాడ లో ప్యాన్ పార్క్ ఏర్పాటైంది. ఈ ఫ్యాన్ పార్క్ లోకి ఉచితంగా ప్రవేశం కల్పించనున్నారు.
ఆ కారణంతో.. భార్యపై భర్త దారుణం..
నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సిన భార్యాభర్తలు క్షణికావేశాలతో దారుణాలకు ఒడిగడుతున్నారు. అనుమానం పెనుభూతమై భార్యలను అంతమొందిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కడపలో చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తె ఆమె పాలిట కాలయముడిగా మారారు. అనుమానం పెనుభూతంగా మారి ఆ పచ్చని కుటుంబంలో చిచ్చు లేపింది. చెన్నూరు మండలం కొత్త గాంధీ నగర్ లో భార్యపై అనుమానంతో, భర్త ఆమెను హత్య చేసి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఎనిమిది మంది మావోయిస్టుల లొంగుబాటు
ములుగు జిల్లాలో నక్సలైట్ ఉద్యమానికి సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం జిల్లాలో ఎనిమిది మంది మావోయిస్టు సభ్యులు స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోయారు. వారు జిల్లా ఎస్పీ డా. శబరిష్ ఎదుట తమ ఆయుధాలను వదిలి, సాధారణ జీవితం వైపు అడుగులు వేసే నిర్ణయం తీసుకున్నారు. లొంగుబాటు అయిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకంగా రూ.25,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయబడింది. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శబరిష్ మాట్లాడుతూ, లొంగుబాటు చేసిన వారిలో మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడు ఒకరు, ఏరియా కమిటీకి చెందిన ఇద్దరు, పార్టీకి చెందిన ముగ్గురు, అలాగే మిలీషియా సభ్యులు ఇద్దరు ఉన్నారని తెలిపారు.
దేశంలో 3000 దాటిన కరోనా కేసులు.. తమిళనాడులో యువకుడు మృతి
దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరగడం పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో 2000 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ సంఖ్య 3000 కు పైగా పెరిగింది. కేరళలో అత్యధికంగా 1,336 కేసులు నమోదయ్యాయి. తరువాత మహారాష్ట్ర, ఢిల్లీ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, శనివారం కరోనా కేసుల సంఖ్య 3,000 మార్కును దాటి 3,395 కు పెరిగింది. రెండేళ్ల తర్వాత భారత్ లో యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 3,000 దాటడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.
‘ఉగ్రవాది లఖ్వీ జైలులో ఉండగా తండ్రయ్యాడు’.. ఉగ్రవాదంలో పాక్ ప్రమేయాన్ని వివరించిన ఓవైసీ
‘ఆపరేషన్ సింధూర్’ విజయం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం తన వైఖరిని ప్రపంచానికి తెలియజేస్తోంది. ఏడు అఖిలపక్ష ప్రతినిధుల బృందాలు వివిధ దేశాలకు వెళ్లి, ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయం కల్పిస్తున్న తీరును బయటపెడుతున్నాయి. ఈ ఎపిసోడ్‌లో ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ శనివారం పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ ద్వంద్వ ప్రమాణాలను అనుసరిస్తోందని అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శలు చేశారు. ఒక పేరుమోసిన ఉగ్రవాది జైలులో ఉన్నప్పుడు అధికారికంగా తండ్రి అయ్యాడని చెప్పడం ద్వారా ఒవైసీ ఉగ్రవాదంలో పాకిస్తాన్ ప్రమేయాన్ని వివరించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే ఇస్లామాబాద్ విధానం దక్షిణాసియాలో అస్థిరతను ప్రోత్సహిస్తుందని ఒవైసీ అన్నారు.