భారీ మెజార్టీతో బాలయ్య విజయం సాధిస్తారు.. హ్యాట్రిక్ కొడతారు..
మరోసారి హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు నటసింహం, సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. ఇప్పటికే పలుమార్లు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వస్తున్నారు.. ఇక, ఆయన సతీమణి వసుంధర దేవి నియోజకవర్గంలో పర్యటిస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేలా పనిచేస్తున్నారు.. ఇక, ఈ రోజు నియోజకవర్గంలో పర్యటించిన వసుంధర దేవి.. హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది బాలకృష్ణే అన్నారు.. భారీ మెజారిటీతో మరోసారి విజయం సాధిస్తారు.. హ్యాట్రిక్ కొడతారని ధీమా వ్యక్తం చేశారు.. నియోజకవర్గ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ఉచితంగా తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.. ఆసుపత్రిని అభివృద్ధి చేశాం.. మొబైల్ఆరోగ్య సేవలు, క్యాన్సర్ చికిత్స అందించిన ఘనత కూడా నందమూరి బాలకృష్ణదే అన్నారు ఆయన సతీమణి వసుంధర దేవి.
అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం.. మరో ఐదు స్థానాలపై పవన్ క్లారిటీ..!
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న వేళ.. అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టాయి.. పొత్తులపై సందిగ్ధత తొలగిపోవడం.. ఏఏ సీట్లు అనేదానిపై కూడా క్లారిటీ రావడంతో.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేశారు.. పోటీ చేసే అభ్యర్థులకు క్లారిటీ ఇస్తున్నారు.. తాజాగా మరో ఐదు స్థానాలపై స్పష్టత ఇచ్చారు జనసేనాని.. భీమవరం, నరసాపురం, ఉంగుటూరు, తాడేపల్లి గూడెం, రాజోలు స్థానాల అభ్యర్థులపై ఓ నిర్ణయానికి వచ్చారు.. ఇప్పటికే ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్.. తాజాగా ఐదు అసెంబ్లీ స్థానాలపై స్పష్టత ఇవ్వడంతో.. మొత్తం జనసేన పోటీ చేసే 21 స్థానాల్లో 11 స్థానాలపై నిర్ణయానికి వచ్చినట్టు అయ్యింది.. ఇక, తాజాగా పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చిన ఆ ఐదు నియోజకవర్గాలు.. అభ్యర్థుల పేర్ల విషయానికి వస్తే.. భీమవరం – రామాంజనేయులు, రాజోలు – వర ప్రసాద్, నరసాపురం – బొమ్మిడి నాయకర్, ఉంగుటూరు – ధర్మరాజు, తాడేపల్లి గూడెం – బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లను ఖరారు చేశారట.. దీనిపై ఆయా అభ్యర్థులకు పవన్ కల్యాణ్ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది.. ఎన్నికలకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని.. ప్రచారాన్ని ముమ్మరం చేసేలా ప్లాన్ చేసుకోవాలని సూచించినట్టుగా సమాచారం.
ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని మేం చెప్పాలా..? ఓటేస్తారా..? ద్రోహం చేస్తారా..?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నదమ్ముడుగా ఉండి మీకు సహాయం చేస్తే ఓటేస్తారా..? ద్రోహం చేస్తారా..? అని ప్రశ్నించారు మంత్రి ధర్మానప్రసాదరావు.. జగన్‌కు ద్రోహం చేసేవారిని ఏం అనాలి అని మండిపడ్డారు.. జగన్ తీసుకొచ్చిన ప్రతి పథకంలో ఓ ఐడియాలజీ ఉందన్న ఆయన.. వృద్ధులంతా ప్రశాంతంగా ఉన్నారు.. ఇళ్లల్లో గోడవల్లేవు.. పిల్లల కోసం స్కూల్స్ లో సమూల మార్పులు చేశామని వెల్లడించారు. ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి అని మేం చెప్పాలా..? చెప్పక్కర్లేదు కదా? అని సభిలకును ప్రశ్నించారు. మీ చేతులను నరికేసుకుంటారా..? చేతులకు బలం చేకూర్చే ప్రభుత్వం తెచ్చుకుంటారా..? అనేది మీ చేతుల్లోనే ఉందన్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు మంత్రి ధర్మాన.. హామీలు ఇచ్చి ఎగ్గోట్టే పెద్దమనిషి.. ఇప్పుడు కోత్తమోసాలతో వస్తున్నాడు అంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డ ఆయన.. చంద్రబాబు మాయలో పడోద్దు అని సూచించారు. ఆయనెప్పుడు నిజం మాట్లడరు.. ఆయన్ను గెలిపిస్తే బోడి గుండె మిగులుద్ది అంటూ హెచ్చరించారు. ఈ ప్రభుత్వంలో పేద ప్రజలకు గౌరవంగా బ్రతికే అవకాశం వచ్చింది.. అర్హతున్న వారందరికీ పార్టీలతో సంబంధం లేకుండా పథకాలు ఇస్తున్నాం అని పేర్కొన్నారు. ఎవ్వరికీ నయా పైసా లంచం ఇవ్వకుండా పథకాలు అందజేస్తున్నాం అని తెలిపారు. మా హయాంలో.. మీ బిడ్డ ప్రభుత్వంలో.. మీకు మంచి జరిగిందనే భావిస్తేనే ఓటు వేయండి అని ధైర్యంగా చెబుతున్న దమ్మున్న లీడర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఒక్కడే అని వెల్లడించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.
నిప్పుల కొలిమిగా నంద్యాల.. రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదు
మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే ఎక్కువగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.. మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.. ఇక, ఈ రోజు నంద్యాల నిప్పుల కొలిమిగా మారింది.. రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు చెబుతున్నారు.. ఈ రోజు నంద్యాలలో 41.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అయినట్టు వెల్లడించారు అధికారులు.. గత రెండు రోజులుగా 40 డిగ్రీల లోపు గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అవుతూ వస్తుండా.. నేడు అదనంగా 1.5 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగి 41.5 డిగ్రీలకు చేరింది.. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు.. ఎండల తీవ్రతతో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రోడ్లపైకి రాలేని పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు..
పొత్తులపై చంద్రబాబు రోజుకో రాజకీయం.. ప్రతీ ఒక్కరూ జగన్‌కు అండగా ఉండాలి..!
ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు పొడిచింది.. సీట్లు కూడా ఖరారు కావడంతో.. అన్ని పార్టీలు అభ్యర్థల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.. అయితే, తాజా పొత్తులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. దివంగత నేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో పాటు అదనంగా మరికొన్ని పథకాలను ప్రజలకు అందిస్తున్నారని ప్రశంసలు కురిపించిన ఆయన.. పొత్తులపై రోజుకో రకంగా రాజకీయం చేస్తున్నారు అంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు.. 2019లో వారంతా చెత్త అని బయటకు వచ్చాడు.. మళ్లీ ఇవాళ ఏం అవసరం వచ్చిందో.. ప్రధాని నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడని దుయ్యబట్టారు. అవసరం తీరాక వాడుకుని వదిలేసే రకం చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు. ఇక, ఈ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ ఒంటరిగా ముందుకు వెళ్తున్నారు.. ప్రతీ ఒక్కరూ సీఎం జగన్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు బాలినేని.. టీడీపీ, జనసేన, బీజేపీలు కలసి వైఎస్ జగన్ పై పోరుకు వస్తున్నాయి.. పేదలకు మేలు చేసేది ఒక్క వైఎస్సార్ కుటుంబం మాత్రమే.. ప్రతీ ఒక్కరూ సీఎం జగన్ కు అండగా ఉండాలని సూచించారు.. ఏ పార్టీ అని చూడకుండా.. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్న ఏకైక నాయకుడు సీఎం జగనే అన్నారు. మా ప్రభుత్వంలో మీకు మంచి జరిగితే, లబ్ధిచేకూరితేనే మీ బిడ్డకు అండగా ఉండాలని అంటూ చెబుతున్న దమ్మున్న లీడర్ సీఎం జగన్ అన్నారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.
రేపటితో ముగియనున్న గ్రూప్-1 దరఖాస్తు గడువు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 563 పోస్టుల భర్తీ ఈ ప్రకటన జారీ కాగా.. మార్చి 14వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హత గల అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. గ్రూప్ -1 పరీక్షల కోసం ఇప్పటివరకు 2.7లక్షల దరఖాస్తులు వచ్చాయి. రేపు సాయంత్రం 5 గంటలకు గడువు ముగియనుంది. పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. అప్లికేషన్ ప్రాసెస్ ఫీజును రూ. 200గా నిర్ణయించారు. ఎగ్జామినేషన్ ఫీజు రూ. 120గా నిర్ణయించారు. అయితే నిరుద్యోగులకు ఈ ఫీజు(ఎగ్జామినేషన్ ఫీజు) నుంచి మినహాయించారు. 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించనున్నారు.
సోదరుడితో బంధాలు తెంచుకున్న మమత.. అసలేం జరిగిందంటే..!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన సోదరుడు బాబుల్‌తో రక్తసంబంధాన్ని తెంచుకున్నారు. ఈ మేరకు మమత ప్రకటించారు. తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై బాబుల్ బెనర్జీ అసహనం వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబుల్‌తో అన్ని బంధాలను తెంచుకున్నట్లు తెలిపారు. బాబుల్.. మమతకు సోదరుడు. ఇతను బీజేపీతో సన్నిహితంగా ఉన్నట్లు తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది. మా కుటుంబం.. బాబుల్‌తో అన్ని బంధాలను తెంచుకున్నామని మమత ప్రకటించారు. ప్రతిసారీ ఎన్నికల సమయంలో ఏదో సమస్య సృష్టిస్తారని.. అత్యాశపరులు తనకు ఇష్టముండదన్నారు. బీజేపీతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. బాబుల్‌తో మాకు ఎలాంటి సంబంధం లేదని సోదరుడిని ఉద్దేశిస్తూ మమత వ్యాఖ్యానించారు. హావ్‌డా లోక్‌సభ స్థానాన్ని ప్రసూన్ బెనర్జీకి తిరిగి కేటాయించడంపై బాబుల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ట్యాక్స్ వివాదం.. హైకోర్టులోనూ ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికల వేల కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బలు తగలుతున్నాయి. ఆదాయపు పన్ను వివాదంలో న్యాయస్థానంలోనూ చుక్కెదురైంది. ఆదాయపు పన్ను శాఖ నోటీసులపై స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ అప్పీలేట్ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును హైకోర్టు కూడా సమర్థించింది. తాము జోక్యం చేసుకోలేమంటూ కాంగ్రెస్ వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. 2018-19 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్నుల విషయంలో ఆదాయపు పన్ను విభాగం గతంలో కాంగ్రెస్‌కు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. దీనిపై పార్టీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో చర్యలు చేపట్టిన ఐటీ విభాగం.. పన్ను రికవరీ నిమిత్తం ఇటీవల పార్టీకి నోటీసులు జారీ చేసింది. ఆ మదింపు సంవత్సరానికి పార్టీ చెల్లించాల్సిన వాస్తవ పన్ను డిమాండ్ రూ.102 కోట్లు కాగా.. వడ్డీతో కలిపి అది రూ.135.6 కోట్లకు పెరిగింది. ఇందులో రూ.65.94 కోట్లను ఇటీవల ఐటీ అధికారులు రికవరీ చేసుకున్నారు. ఈ క్రమంలోనే తమ అకౌంట్లపై ఐటీ విభాగం ఎలాంటి చర్యలు చేపట్టకుండా నోటీసులపై స్టే విధించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో పిటిషన్ వేసింది. ఇందుకు ట్రైబ్యునల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది.
నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, ఖట్టర్.. బీజేపీ రెండో లిస్టులో ఉన్న కీలక నేతలు వీరే..
లోక్‌సభ ఎన్నికలకు మరికొన్ని రోజుల్లో షెడ్యూల్ విడుదల కాబోతున్న నేపథ్యంలో బీజేపీ తన రెండో జాబితాను ప్రకటించింది. గతవారం 195 మందితో తొలిజాబితా ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, బుధవారం 72 మందితో రెండో జాబితాను ప్రకటించింది. మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలోని పలు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో పలువురు మాజీ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు ఉన్నారు. నితిన్ గడ్కరీకి ఈ సారి బీజేపీ సీటు ఇవ్వదని మహారాష్ట్రలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరోసారి ఆర్ఎస్ఎస్ కంచుకోట నాగ్‌పూర్ నుంచి ఆయన బరిలో నిలిచారు. గడ్కరీ బీజేపీలో అవమానాలు ఎదుర్కొంటే మా కూటమిలో చేరాలని ఉద్ధవ్ ఠాక్రే అడిగారు. అయితే ఠాక్రే ఆఫర్ అపరిపక్వమైనది, హాస్యాస్పదమైనదిగా గడ్కరీ కొట్టిపారేశారు. 2019లో కాంగ్రెస్ అభ్యర్థి నానా పటోలేపై గడ్కరీ గెలుపొందారు. 2014, 2019లో నాగ్‌పూర్ నుంచి గడ్కరీ వరసగా విజయం సాధించారు. ఒక రోజు క్రితం హర్యానా ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన మనోహర్ లాల్ కట్టర్ కర్నాల్ ఎంపీ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఇక రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ ముంబై నార్త్ నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్రమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ హమీర్‌పూర్ నుంచి బరిలో ఉన్నారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై హవేరి నుంచి, తేజస్వీ సూర్య బెంగళూర్ సౌత్ నుంచి, ధార్వాడ్ నుంచి ప్రహ్లద్ జోషి పోటీలో ఉన్నారు.
ఎలక్టోరల్ బాండ్లపై సీఈసీ ఏమన్నారంటే..!
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన వివరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఎన్నికల సంఘం స్వీకరించిందని.. సకాలంలో సంబంధిత సమాచారాన్ని అందజేస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 12, 2019 నుంచి ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ECకి సమర్పించాలని ఎస్‌బీఐకి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆ డేటాను ఎన్నికల సంఘానికి అందజేసింది. ఇక ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సకాలంలోనే వివరాలను ఎస్‌బీఐ అందించిందని సీఈసీ తెలిపారు. అలాగే వివరాలను పరిశీలిస్తున్నామని.. సకాలంలోనే ఆ వివరాలు అందిస్తామని చెప్పుకొచ్చారు.
పవన్ బట్టల నిండా రక్తం.. అతనిని చేతుల్లో మోసుకుంటూ పరిగెత్తాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఒక పక్క సినిమాలు.. ఇంకోపక్క రాజకీయాలతో బిజీగా మారాడు. ప్రస్తుతం సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి ఏపీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రచారాల కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. మొదటినుంచి కూడా పవన్ లో ఎదుటి మనిషికి సాయం చేసే గుణం ఉంది. తప్పు జరిగితే నిలదీసే తత్త్వం ఉంది. ఇది తన తండ్రి దగ్గరనుంచి వచ్చిందని పవన్ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. అయితే రాజకీయాల్లోకి వచ్చాడు కాబట్టి.. ఇలాంటి మాటలు చెప్తున్నాడు అని విమర్శలు వస్తున్నాయి. కానీ, తాను రాజకీయాల్లోకి రాకముందే.. అసలు స్టార్ గా అవ్వకముందే ఎదుటివారికి సాయం చేసే గుణం ఉందని సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఇంటర్వ్యూ పాతదే అయినా.. పవన్ మంచి మనసు ఎలాంటిదో చూడండి అంటూ పవన్ అభిమానులు మరోసారి ఈ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు. అసలు పవన్ గురించి చోటా ఏమన్నాడు అంటే.. ” తొలిప్రేమ సినిమా సమయంలో అనుకుంటా.. ఒక క్రికెట్ సీన్ చేస్తున్నాం. గచ్చిబౌలిలోని నానక్ రామగూడా లో.. అప్పుడు అక్కడ ఒక పెద్ద క్వారీ ఉండేది. ఆ రోజు పవన్ కళ్యాణ్ రవిబాబుతో క్రికెట్ ఆడుతూ ఒక ఫైట్ ఉంటుంది. ఆ షాట్ తీస్తున్నాం. రవిబాబు, పవన్ కళ్యాణ్ వైట్ అండ్ వైట్ డ్రెస్ లో ఉన్నారు. కళ్యాణ్ గారు అప్పుడే కొత్తగా వస్తున్న ఓ సుమోలో సెట్స్ కి వచ్చారు. నేను ఆయన కోసం బయట ఎదురు చూస్తున్నా. నన్ను చూసి ఏంటి ఇక్కడున్నారన్నారు అని అడిగారు. నేను మీకోసమే అని చెప్పాను. సరే పదండి వెళ్దాం అని అందరం కలిసి వెళ్తున్నాం.. ఇంతలో ఓ వ్యక్తి పవన్ కళ్యాణ్ ని చూస్తూ స్కూటర్ డ్రైవ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ వెనుకగా ఉండటంతో వెనక్కి తిరిగి మరీ చూసాడు. అంతలోనే అతడిని ఒక కారు వచ్చి గుద్దేసింది. స్టార్లు .. అప్పుడప్పుడే షూటింగ్ అన్నట్లు చూసాడు అతను.. అంతలోనే కారు వాడు గుద్దేసాడు. ఆ వ్యక్తి ఎగిరి దమ్మని పడ్డాడు. అరే పడ్డారు అని నేను అక్కడే ఉన్నాను. కానీ, పవన్ పరిగెత్తుకెళ్లి.. పడిన అతన్ని చేతులతో మోసుకుంటూ.. తన సుమోలో ఎక్కించి హాస్పిటల్ కు పంపించాడు. ఆ వైట్ అండ్ వైట్ డ్రెస్ మొత్తం రక్తంతో తడిసిపోయింది. షూటింగ్ లేదు.. ఏమి లేదు.. అస్సలు ఆయనకు షూటింగ్ అన్న విషయం కూడా గుర్తులేదు. అది పవన్ కళ్యాణ్ గొప్పతనం. సహాయం అంటే ఆయన ఎంతో చలించిపోతాడు. ముక్కు..ముఖం తెలియకపోయినా అయ్యో అతడు ఏ కష్టంలో ఉన్నాడని అలోచిస్తూనే ఉంటాడు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఓల్డ్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఆమెతో శృంగారం.. అందుకే విడాకులు.. మాజీ భార్య కీలక వ్యాఖ్యలు
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురిఞ్చి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో నటించకపోయినా.. ఆయనకు టాలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎన్నో మంచి చిత్రాలను తీసి మెప్పించిన అమీర్.. ప్రస్తుత రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. ఇక ఆయన పెళ్లిళ్ల గురించి, విడాకుల గురించి, ఎఫైర్స్ గురించి కూడా అందరికి తెల్సిందే. మొదట రీనా గుప్తాను వివాహమాడిన అమీర్.. ఆమెకు విడాకులు ఇచ్చి కిరణ్ రావును వివాహమాడాడు. వీరిద్దరి మధ్య విబేధాలు రావడంతో గత కొన్నేళ్ల క్రితం వీరు కూడా కూడా విడిపోయారు. అయితే.. విడాకులు తీసుకున్నా కూడా వీరందరూ స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటున్నారు. ఇక అప్పట్లో కిరణ్ రావును అమీర్ వివాహం చేసుకున్నప్పుడు.. ఆమెపై ఎన్నో విమర్శలు వచ్చాయి. రీనా ఉన్నప్పుడే.. అమీర్, కిరణ్ రావు ప్రేమలో ఉన్నారని, ఆమెతో రొమాన్స్ చేయడం వలనే రీనా విడాకులు ఇచ్చిందని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై కిరణ్ రావు స్పందించింది. ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ” రీనా విడాకులు ఇవ్వడానికి కారణం నేను అని అనుకుంటున్నారు. కానీ, రీనాతో అమీర్ విడిపోయినా రెండేళ్లకు మా బంధం మొదలయ్యింది. లగాన్ సినిమాకు అసిస్టెంట్ గా నేను చేసినా కూడా అమీర్ తో మాట్లాడలేదు. ఈ సినిమా రిలీజ్ అయిన మూడు సంవత్సరాల తరువాత మేము సన్నహితంగా ఉండడం మొదలుపెట్టాం. అంటే అప్పటికే రీనాకు, అమీర్ కు విడాకులు అయ్యి రెండేళ్లు అయ్యింది. లగాన్ సినిమా షూటింగ్ సమయంలోనే మా మధ్య ప్రేమ చిగురించిందని, నాతో రొమాన్స్ చేయడం వలన రీనా విడాకులు ఇచ్చింది అనేది పచ్చి అబద్దం” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.