కుప్పకూలిన మూడంతస్థుల భవనం:
ఏపీలోని ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పెద్ద దోర్నాలలో మూడు అంతస్థుల భవనం కుప్పకూలింది. శ్రీశైలం రోడ్డులో అందరూ చూస్తుండగానే.. వాసవి లాడ్జి భవనం కూలిపోయింది. వాసవి లాడ్జి భవనం పక్కనే మరో భవన నిర్మాణం కోసం పునాది గుంతలు తీయటంతో ఈ ఘటన చోటుచేయుకుంది. ఈ ఘటనతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనకు సంబందించిన ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
విద్యార్థినుల సూసైడ్ నోట్:
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య కలకలం రేపింది. భువనగిరి ఎస్సీ బాలికల హాస్టల్‌లో 10వ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. హైదరాబాద్ హబ్సిగూడకు చెందిన బాలికలు భువనగిరిలోని రెడ్డివాడ బాలికల ఉన్నత పాఠశాలలో హాస్టల్‌లో ఉంటూ 10వ తరగతి చదువుతున్నారు. ఎప్పటిలాగే శనివారం పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు సాయంత్రం తిరిగి హాస్టల్‌కు చేరుకున్నారు. ఇద్దరూ హాస్టల్‌లో ట్యూషన్‌కు వెళ్లలేదని..ట్యూషన్ టీచర్ పిలిస్తే రాత్రి భోజనం చేసి వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. మధ్యాహ్న భోజన సమయంలో కూడా వారు రాకపోవడంతో ఓ విద్యార్థిని అనుమానం వచ్చి గదిలోకి వెళ్లి చూడగా షాక్ తిన్నారు. ఇద్దరు విద్యార్థినులు అప్పటికే ఫ్యాన్లకు వేలాడుతున్నారు. చూసిన వెంటనే విద్యార్థి యాజమాన్యానికి చెప్పింది. యాజమాన్యం వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి ఇద్దరినీ జిల్లా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను పరీక్షించిన వైద్యులు.. విద్యార్థినిలు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.
పల్లెల్లో ‘స్పెషల్ శానిటేషన్ డ్రైవ్’:
ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించాలని, ముఖ్యంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ గ్రామాలను అద్దం పట్టేలా చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చివరి రోజున గ్రామసభ నిర్వహించి పారిశుధ్య కార్మికులను సన్మానించాలని సూచించారు. సర్పంచ్‌ల పదవీ కాలం ముగియడం, గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభం కావడంతో గ్రామ పంచాయతీల పాలనపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ములుగు జిల్లా కలెక్టరేట్ నుంచి మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. . ఈసందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో రోడ్లను శుభ్రం చేయడంతోపాటు పిచ్చిమొక్కలను తొలగించాలన్నారు.
ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ:
నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులు సమావేశం కానున్నారు. సచివాలయంలో మధ్యాహ్నం 3.30 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. రానున్న బడ్జెట్ సమావేశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాల తేదీల అంశం కూడా చర్చకు రానుంది. అయితే ఈసారి పూర్తి బడ్జెట్ కాకుండా ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశంలో ఆరు హామీలపై చర్చ జరగనుంది. అంతే కాకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. రూ. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ రెండు పథకాల అమలుకు కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది.
11 రోజుల్లో రూ.11 కోట్ల విరాళాలు:
అయోధ్యలో రాంలాలాకు పట్టాభిషేకం జరిగి నేటికి 12 రోజులు. ఈరోజు సంగతి పక్కన పెడితే, రామ్ లల్లాకు గత 11 రోజుల్లో రూ.11 కోట్లకు పైగా విరాళాలు అందుకున్నారు. రామ్ లల్లాకు ప్రతిరోజు సగటున కోటి రూపాయలు భక్తులు విరాళంగా అందజేస్తున్నట్లు సమాచారం. రామజన్మభూమి తీర్థ క్షేత్రం ప్రకారం, 11 రోజుల్లో సుమారు రూ. 8 కోట్లు విరాళాల పెట్టెల్లో డిపాజిట్ చేయబడ్డాయి. గత 11 రోజుల్లో దాదాపు 25 లక్షల మంది భక్తులు రాంలాలా ఆస్థానంలో మొక్కులు చెల్లించుకున్నారు. చెక్కు, ఆన్ లైన్ ఆఫర్ల రూపంలో సుమారు రూ.3 కోట్ల 50 లక్షలు వచ్చినట్లు సమాచారం. ప్రాణ ప్రతిష్ట తర్వాత తొలిరోజే 3 కోట్ల 17 లక్షల ఆఫర్ వచ్చింది. రామభక్తుల ఈ అపారమైన భక్తిని దృష్టిలో ఉంచుకుని.. అయోధ్య రామనగరిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి.
గ్రామీ అవార్డ్ కు నామినేట్ అయిన మోడీ:
గ్రామీ అవార్డ్స్ 2024 ఈవెంట్ ఆదివారం ఫిబ్రవరి 04, 2024న షెడ్యూల్ చేయబడింది. చలనచిత్ర ప్రపంచంలో ఆస్కార్ అవార్డ్ ఎంత పెద్ద అవార్డుగా పరిగణించబడుతుందో, అదే విధంగా సంగీత ప్రపంచంలో గ్రామీ అవార్డును అతిపెద్ద అవార్డుగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారుల పని లిట్మస్ టెస్ట్ ద్వారా ఉత్తీర్ణత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా కంపోజ్ చేసిన సంగీతంలో ఒకరిని అవార్డుకు ఎంపిక చేస్తారు. ఈ అవార్డులు వివిధ విభాగాలలో పంపిణీ చేయబడ్డాయి. ఈ ఏడాది భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ పాటలో సాహిత్యం రాసినందుకు అతను నామినేట్ అయ్యాడు. ఈ పాటకు ఫల్గుణి షా, గౌరవ్ షా సంగీతం అందించారు.
ఫ్యాన్స్ క్రికెట్ లీగ్ గెలిచిన రోరింగ్ రెబల్స్:
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ స్టార్ హీరోల ఫ్యాన్స్ అంతా కలిసి ‘ఫ్యాన్స్ క్రికెట్ లీగ్’ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. సీజన్ 1 ఇటీవలే గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్ లాంటి స్టార్ హీరోల అభిమానులు ఈ లీగ్ లో ఆడారు. గత రాత్రి ప్రభాస్ ఫ్యాన్స్ ‘రోరింగ్ రెబల్స్’ మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ‘హంగ్రీ చీతాస్’ మధ్య ఫైనల్స్ గ్రాండ్ గా జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హంగ్రీ చీతాస్ ఏడు వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసారు. రోరింగ్ రెబల్స్ కి 158 పరుగుల టార్గెట్ ని ఛేజ్ చేయడానికి రంగంలోకి దిగిన రోరింగ్ రెబల్స్… ఛేజింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచే ఎటాకింగ్ గేమ్ ఆడి టార్గెట్ ని ఛేజ్ చేసారు.
బుమ్రా దెబ్బకు బ్యాట్ కిందపడేసిన స్టోక్స్:
శాఖలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనంలో కీలకపాత్ర పోషించాడు. బుమ్రా దెబ్బకు ఇంగ్లీష్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌట్ అయింది. యార్కర్స్, స్వింగ్ బంతులతో బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ని పెవిలియన్‌కు పంపిన బంతి హైలెట్ అని చెప్పాలి. బుమ్రా దెబ్బకు స్టోక్స్ ఏకంగా బ్యాట్ కిందపడేశాడు. ఇన్నింగ్స్ 50వ ఓవర్‌లో రెండో బంతిని స్టోక్స్ ఎదుర్కొన్నాడు. ఆఫ్ స్టంప్ దిశగా తక్కువ ఎత్తులో వచ్చిన బంతిని స్టోక్స్ డిఫెండ్ చేయబోయాడు. అయితే బంతి మిస్ అయి ఆఫ్ స్టంప్‌ని పడగొట్టింది. దీంతో స్టోక్స్ వెనక్కి కూడా చూడకుండా బ్యాట్ కింద పడేసి నిరాశతో క్రీజును వదిలివెళ్లాడు.