ప్రతి పార్లమెంట్ నియోజక వర్గంలో బీసీలకు రెండు సీట్లు
నిజామాబాద్ లో కాంగ్రెస్ బిసి గర్జన సన్నాహక సమావేశంలో మాజీ ఎంపీ, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుయాష్కిగౌడ్ మాట్లాడుతూ.. ప్రతి పార్లమెంటు నియోజక వర్గంలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది అని ఆయన పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు అవకాశాలు ఇవ్వాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాం అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వెనుజబడిన వర్గాల వారిని చదువుకు దూరం చేస్తున్నాడు అని కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ అన్నారు. బీసీలు, దళితులు, గిరిజనులు చదువుకుంటే రాజ్యాధిజరం అడుగుతారని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు.. బీసీలు ఎవరికి వ్యతిరేఖం కాదు, కేవలం తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. కాంగ్రెస్ అందరి పార్టీ, బీఆర్ఎస్ దొరల పార్టీ.. గద్దర్ కోరుకున్న సామాజిక న్యాయం రావాలంటే.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలవాలి అని మధుయాష్కీ అన్నారు.
తమిళ్ సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ కమెడియన్..
సునీల్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ కు విలన్ అవుదామని వచ్చి సునీల్ స్టార్ కమెడియన్‌గా ఎదిగాడు. అప్పట్లో సునీల్ కు డిమాండ్ మాములుగా ఉండేది కాదు. ఆయన కోసమే రైటర్‌లు స్పెషల్ గా కామెడీ క్యారెక్టర్ ను డిజైన్ చేసేవారు.కమెడియన్ గా కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడు సునీల్ అనూహ్యంగా అందాల రాముడితో హీరో గా మారాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.. ఆ సినిమా తరువాత కూడా కమెడియన్ గా రాణించాడు సునీల్.ఆ తర్వాతే ఏకంగా స్టార్ దర్శకుడు రాజమౌళితో మర్యాదరామన్న సినిమా చేసి భారీ హిట్ అందుకున్నాడు. ఇక అదే ఊపు లో హీరో గా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు.అయితే కమెడియన్ గా రాణించిన సునీల్ ను ప్రేక్షకులు హీరోగా యాక్సెప్ట్ చేయలేకపోయారు. తన స్నేహితుడు మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ తెరకెక్కించిన అరవింద సమేత సినిమా తో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాడు. ఇక అప్పటి నుంచి సునీల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.పైగా సునీల్ అలాంటి పాత్రలే చేస్తానని ఎటువంటి కండీషన్‌లు పెట్టకుండా .. వచ్చిన ప్రతీ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. సునీల్ క్రేజ్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీ కి చేరింది.. అక్కడ సునీల్ కు వరుస అవకాశాలు వస్తున్నాయి.. జైలర్ సినిమాలో సునీల్ నటన తమిళ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. శివ కార్తికేయన్ నటించిన మహావీరుడు సినిమాలో సునీల్ రోల్ కు మంచి స్పందన లభించింది. సునీల్ ప్రస్తుతం విశాల్ నటిస్తున్న మార్క్ ఆంటోని సినిమాలో అలాగే కార్తి నటిస్తున్న జపాన్ సినిమాలో సునీల్‌కు మంచి పాత్ర దక్కినట్లు సమాచారం.. ఇవే కాకుండా ఈగై, బుల్లెట్ అనే మరో రెండు తమిళ సినిమాల్లో సునీల్ ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.ఇలా ఒక్క ఏడాదిలోనే దాదాపు ఆరడజను తమిళ సినిమాల్లో నటిస్తూ సునీల్ దూసుకుపోతున్నాడు..
25 రోజులలో తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్.. వనమా సంచలనం
భద్రాద్రి కొత్తగూడెం క్లబ్ లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నియోజకవర్గం ప్రత్యక్ష సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెంలో మళ్ళీ నేనే పోటీ చేస్తా, కేసీఆర్‌తో ఇటీవల జరగిన సమావేశంలో కేసీఆర్ హామీ ఇచ్చారని వనమా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. కొత్తగూడెంలో వందల కోట్లు నిధులు మంజూరు తో నిర్దేశించిన పనులు వేగంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించిన వనమా.. 25 రోజులలో సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికారులకు తెలపటం చర్చనీయాంశంగా మారింది.
కాగా, ఆయన పదవి విషయంలో సుప్రీంకోర్టు నుంచి స్టే లభించిన అనంతరం తొలిసారి గత గురువారం ఆయన కొత్తగూడెంకు రాగా, జూలూరుపాడు వద్ద ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొత్తగూడెం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా మాట్లాడుతూ, దేవుడి ఆశీర్వాదం, సీఎం కేసీఆర్, కేటీఆర్తో పాటు కార్యకర్తలు, ప్రజల అండతో తనకు అంతా మంచే జరుగుతుందన్నారు. వచ్చే ఎన్నికల కోసం నేటి నుంచే కార్యాచరణకు దిగుతానని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తానని కేసీఆర్ భరోసా ఇచ్చారని, జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటానని అన్నారు.
కాజోల్ కాలికి గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ రీ ఎంట్రీతో అదరగొడుతుంది. ఈ మధ్యనే ది ట్రైల్ అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది. లాయర్ గా కాజోల్ నటన సిరీస్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. అమెరికన్ వెబ్ సిరీస్ ది గుడ్ వైఫ్ కు రీమేక్ గా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. ఇక ఈ సిరీస్ కు సీజన్ 2 రానున్న విషయం కూడా తెల్సిందే. ప్రస్తుతం ఆ షూటింగ్ లో పాల్గొంటున్న కాజోల్.. మరో రెండు ప్రాజెక్ట్స్ కు సైన్ చేసినట్లు సమాచారం. అయితే గత కొన్నిరోజుల క్రితం కాజోల్ కాలికి గాయం అయ్యినట్లు తెలుస్తోంది. ఆమె కాలికి గాయం అయ్యిందని తెలియడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అస్సలు ఆమెకు ఏమైంది.. ? ఆ కాలికి దెబ్బ ఎలా తగిలింది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు.
త్వరలోనే అంబేడ్కర్ విగ్రహం ప్రారంభిస్తాం..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అతి పెద్ద అంబేడ్కర్ విగ్రహాన్ని తొందరలోనే ప్రారంభిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ప్రతి రోజు 500 మంది ఇక్కడ అంబేద్కర్ స్మృతివనం పనులు చేస్తున్నారు.. అంబేద్కర్ విగ్రహం ఇంతపెద్దది ఇదే.. 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ మెగా ప్రాజెక్టు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అంబేద్కర్ జీవిత విశేషాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం.. ఒక మినీ థియేటర్, అంబేద్కర్ కు సంబంధించిన అన్ని అంశాలు ఉంటాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. అంబేడ్కర్ స్మృతివనంలో వెలకట్ట లేని ఎన్నో విశేషాలతో ఈ నిర్మాణం ఉంటుంది అని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. 20 వేల మంది వరకూ వచ్చేలా ఏర్పాటు చేస్తున్నాం.. కన్వెన్షన్ సెంటర్ ఆలస్యం కావచ్చు.. చరిత్రలో ఇదొక పేజీగా లిఖించుకునేలా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం పూర్తవుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. రాజ్యాంగ దినోత్సవం రోజే పూర్తి చేసుకోవాలని నిర్ణయించామన్నాడు.
బోధన్‌లో సీనియారిటీకి సిన్సియారిటీకి మధ్యే పోటీ
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎన్‌ఎస్‌ఎఫ్ మైదానంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ నుంచి మంత్రిగా పని చేసిన సుదర్శన్ రెడ్డి ఒక్క చెరువు ను కూడ బాగు చేయలేదని, బోధన్ లో సీనియారిటీ కి సిన్సియారిటీకి మధ్యే పోటీ అంటూ వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ కవిత. లక్ష 30 వేల ఉద్యోగాలు ఇచ్చింది కేవలం తెలంగాణ లోనేనని, బీఆర్ఎస్ అంటే ఇంటి పార్టీ అన్నారు. మిగితా పార్టీలకు ఈవీఎం లాగా తెలంగాణ ప్రజలు కనపడుతారని, తెలంగాణ లో గులాబీ విప్లవం వచ్చిందన్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్ యాత్ర చేసినట్లు రాహుల్ గాంధీ జోడో యాత్ర ఉందని, స్వాతంత్రం వచ్చాక ఏం చేశారు అని రాహుల్ యాత్ర చేసారన్నారు.
రాష్ట్రాభివృద్ధిపై టీడీపీకి దమ్ముంటే చర్చకు రావాలి
టీడీపీ నేత గద్దె రామ్మోహన్ వ్యాఖ్యలకు వైసీపీ విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ దేవినేని అవినాష్ కౌంటర్ ఇచ్చారు. జిల్లా పరువు దిగజారిపోయిందన్న గద్దె విమర్శలును ఆయన ఖండించారు. టీడీపీ హయాంలో కాల్ మని, సెక్స్ రాకెట్ తో జిల్లా పరువు పోయింది.. కృష్ణా జిల్లా పరువును నిలబెట్టిన నాయకుడు సీఎం జగన్ అని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు గురించి పట్టించుకోకుండా.. 175 అసెంబ్లీ సీట్లపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ సూచించారు.. సజ్జల వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సిగ్గు లేని ఆరోపణలు చేస్తున్నారు అంటూ అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్థాయిని మరిచి గద్దె రామ్మోహన్ విమర్శలు చేస్తున్నారని వైసీపీ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. టీడీపి హయాంలో చేసిన అభివృద్దిపై సవాల్ చే..స్తే ఏ ఒక్క టీడీపీ నేత ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు.. అభివృద్ది, సంక్షేమంపై మేము విసిరే సవాల్ స్వీకరించే దమ్ము ఎవరికి లేదు.. రిటైనింగ్ వాల్ నిర్మించిన ఘనత సీఎం జగన్ ది.. గద్దె సిగ్గులేకుండా అవాస్తవాలు మాట్లాడుతున్నారు.. 2019లో రిటైనింగ్ వాల్ కడితే ఇళ్లలోకి నీరు ఎందుకు వచ్చిందో గద్దె రామ్మోహన్ చెప్పాలి అని దేవినేని అవినాష్ డిమాండ్ చేశారు.
ఆటో డ్రైవర్ తెలివికి వావ్ అనాల్సిందే.. గ్రేట్ ఐడియా..
మనదేశంలో టెక్నాలజీ రోజురోజుకు పరుగులు పెడుతుంది.. ఈ క్రమంలో ఎన్నో కొత్తవి ఆవిష్కరిస్తున్నారు.. ముఖ్యంగా కర్ణాటక ఒకడుగు ముందు ఉంది.. బెంగుళూరు నగరం స్టార్టప్ సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. సాధారణ ప్రజలు కూడా సాంకేతిక పరిజ్ఞానంతో బాగా ప్రావీణ్యం కలిగి ఉంటారు. చాలా మంది వ్యక్తులు తమ ‘పీక్ బెంగళూరు’ క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు, అవి నగరంలోని సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను కలిసిన వారి అనుభవాలను ఆశ్చర్యపరిచాయి..
మహిళ తన ఆటో డ్రైవర్ చెల్లింపులను అంగీకరించడానికి తన స్మార్ట్‌వాచ్‌ను ఎలా ఉపయోగించాడో పంచుకోవడానికి గతంలో ట్విట్టర్‌లోని వెళ్లింది. ఆటో డ్రైవర్స్ యూనియన్ అభివృద్ధి చేసిన నమ్మ యాత్రి యాప్ ద్వారా మహిళ ఆటోను బుక్ చేసుకుంది. ఆమె క్యూఆర్ కోడ్ కోసం డ్రైవర్‌ను అడిగినప్పుడు, అతను తన చేతిని తిప్పి తన స్మార్ట్ వాచ్‌ని అతనికి చూపించాడు. అతను QR కోడ్‌ని తన స్మార్ట్‌వాచ్ స్క్రీన్‌సేవర్‌గా సేవ్ చేసుకున్నాడు.
విశాఖకు జనసేన చీఫ్.. వారాహి విజయ యాత్రలో పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆరో రోజు వారాహి విజయ యాత్రలో ఆయన పాల్గోనున్నారు. ఫీల్డ్ విజిట్ కోసం భీమిలి(మండలం)ఎర్రమట్టి దిబ్బలను జనసేనాని పరిశీలించనున్నారు. జియో హెరిటేజ్ సైట్ గా అరుదైన గుర్తింపు సాధించిన ఎర్రమట్టి దిబ్బలు.. ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారుల కళ్ళు వీటిపై పడ్డాయని జనసేన పార్టీ ఆరోపిస్తుంది. అధికార పార్టీ, ప్రభుత్వంపై జనసేనాని ఆరోపణలు చేస్తున్నాడు. అరుదైన ఎర్రమట్టి దిబ్బల సమీపంలో తవ్వకాలను పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు.
ఎర్రకోట ప్రసంగాన్ని ప్రధాని మోడీ రాజకీయాల కోసం వాడుకున్నారు
ఎర్రకోట ప్రసంగాన్ని ప్రధాని మోడీ రాజకీయాల కోసం వాడుకున్నారని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. మణిపూర్ శాంతి నెలకొంటుంది అంటున్న ప్రధాని పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ అంశం ఎందుకు మాట్లాడలేదన్నారు. ప్రధాని మణిపూర్ లో పర్యటించి ప్రజలకి విశ్వాసం కలిగించి ఉంటే బాగుండేదని, ఏమి చేయలేదు కానీ ఎర్రకోట వేదికగా మణిపూర్ గురించి మోడి మాట్లాడారన్నారు. ప్రధాని మోడీ బీజేపీ నాయకులు ఎవరైనా మణిపూర్ లో పర్యటించారా ? అని ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో ప్రధాని ఏం చేశారు.. గంట కొట్టారు , దీపాలు పెట్టారు , చప్పట్లు కొట్టారు దానివల్ల కోవిడ్ ఏమైనా తగ్గిందా ? రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించకుండా దొంగచాటుగా వ్యాక్సిన్లు తయారు చేసే వాళ్ళకి పవర్ ఇస్తారు ..ఇలానే ప్రధానమంత్రి చేస్తారా ? అని పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
బాలీవుడ్ నటి జాక్వెలిన్‌కు ఢిల్లీ కోర్టులో బిగ్ రిలీఫ్!
బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది. సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది. 2022 నవంబర్‌లో ఆమె విదేశాలకు వెళ్లేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాలనే బెయిల్ షరతును ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు సవరించింది.అదనపు సెషన్స్ జడ్జి (ASJ) శైలేందర్ మాలిక్ వాస్తవాలు, పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాత విదేశాలకు వెళ్లడానికి ముందస్తు అనుమతి తీసుకోవాలనే బెయిల్ షరతును సవరించాలని కోరుతూ దరఖాస్తును అనుమతించారు. విదేశాలకు ప్రయాణం అవ్వడానికి మూడు రోజుల ముందు కోర్టు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి తెలియజేయాలని పేర్కొంది. మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ గత ఏడాది నవంబర్‌లో బెయిల్ పొందారు. అయితే కోర్టు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదనే షరతుతో అప్పుడు బెయిల్ ఇచ్చింది.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్
ఏపీ ట్రాన్స్ కోలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులకు 2018 రివైజ్డ్ పే స్కేళ్ల ప్రకారం వేతనాలు సవరిస్తూ సీఎం జగన్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. థర్డ్ పార్టీ ఏజెన్సీలు, కాంట్రాక్టర్ల ద్వారా ట్రాన్సుకోలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు సవరించినట్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైస్కిల్డ్, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్ స్కిల్డ్ కార్మికులకు వేతనాలను పెంచుతున్నట్లు సీఎం జగన్ ప్రభుత్వం వెల్లడించింది.
హైస్కిల్డ్ కార్మికులకు రూ.22,589 నుంచి రూ. 30,605కు, స్కిల్డ్ కార్మికులకు రూ.20,598 నుంచి రూ. 27,953 కు పెంచుతున్నట్లు ప్రకటించగా.. సెమీ స్కిల్డ్ కార్మికులకు రూ.17,144 నుంచి రూ.23,236కు, అన్ స్కిల్డ్ కార్మికులకు రూ. 16,473 నుంచి రూ.22,318కి పెంచారు. ఈ నెల 9వ తేదీన సబ్ కమిటీతో జరిగిన చర్చల్లో 2018 పేస్కేళ్ల ప్రకారం 2 శాతం పెంపుదలకు విద్యుత్ ఉద్యోగ సంఘాలు అంగీకరించాయని ఈమేరకు ఉత్తర్వులను ఏపీ ట్రాన్సుకో సీఎండీ కె.విజయానంద్ జారీ చేశారు.
కోటాలో రాలిపోతున్న విద్యార్థులు.. మరో విద్యార్థి ఆత్మహత్య
రాజస్తాన్‌లోని కోటా.. ప్రవేశ పరీక్షల కోచింగ్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు విద్యార్థి ఆత్మహత్యలకు కోటలా మారింది. ఈ నెలలోనే నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు 20 మంది నిండు ప్రాణాలను తీసుకున్నారు. ఐఐటీ, ఐఐఎంలలో అత్యధిక మందికి సీటు లభిస్తున్నప్పటికీ చాలా మందిలో భవిష్యత్‌పై భరోసా కూడా కరువు అవుతోంది. రాను రాను విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. కొందరు హాస్టల్ భవనంపై నుంచి దూకి, మరికొందరు సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకొని , కొందరు సూసైడ్ నోట్ రాసి మరికొందరు మౌనంగా కన్నవారికి కడుపుకోత మిగిల్చి వెళ్లిపోతున్నారు. రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరస ఆత్మహత్యలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మంగళవారం రాత్రి మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెలలోనే ఇది నాలుగో ఘటన కావడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.