ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం సీట్లు..
లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు అధికార వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇడుపులపాయ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నేతలకు జగన్ పెద్ద ఎత్తున అవకాశం కల్పించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ఆయన ప్రకటించారు. సామాజిక వర్గాల వారీగా 2019తో పోలిస్తే ఈసారి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలకు ఎక్కువ సీట్లను సీఎం జగన్ కేటాయించారు.
2028 వరకు ఉచిత రేషన్.. 81 కోట్ల మందికి ప్రత్యక్ష ప్రయోజనం
లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటనతో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ రెండో దఫా పాలన ముగియనుంది. రెండవ టర్మ్‌లో, మోడీ ప్రభుత్వం కోట్లాది మందికి ప్రత్యక్షంగా లబ్ది చేకూర్చే అనేక పథకాలను ప్రారంభించింది. వాటిలో ఒకటి.. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY). ఈ పథకం కింద 2028 సంవత్సరం వరకు దాదాపు 81 కోట్ల మంది ప్రజలు ఉచిత రేషన్‌ను పొందడం కొనసాగిస్తారు. గత ఏడాది నవంబర్‌లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పిఎంజికెఎవై) విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీని కింద ఈ పథకాన్ని ఐదేళ్లపాటు పొడిగించారు. ఈ విస్తరణ వల్ల ఖజానాపై దాదాపు రూ.11.8 లక్షల కోట్ల భారం పడనుంది. ఈ పొడిగింపు జనవరి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది.
కాంగ్రెస్ 2జి స్కాం చేస్తే.. బీఆర్ఎస్ నీళ్ళ స్కాం
కాంగ్రెస్ 2జి స్కాం చేస్తే.. బీఆర్ఎస్ నీళ్ళ స్కాం అని ప్రధాని మోడీ అన్నారు. ఈ రోజు ఎన్నికల నగారా మోగుతుంది అని నేను టీవీలో చూసానని అన్నారు. ఎన్నికల తేదీలు ప్రకటించక ముందే ఎన్నికల పలితాలు ప్రజలు ముందే ప్రకటించారు… అబ్ కి బార్ చార్ సౌ పార్ (‘Ab ki baar char sau paar’) అని తెలిపారు. నాగర్ కర్నూల్ జన సముద్రం కనిపిస్తుందని, నిన్న సాయంత్రం అద్భుత మైన దృశ్యం మల్కాజ్ గిరిలో కూడా చూశానని మోడీ అన్నారు. బీజేపీ కి ఆశీర్వాదం ఇస్తున్నారని,అసెంబ్లీ ఎన్నికల సమయం లో ఇక్కడికి వచ్చాను… అప్పుడు ప్రజల్లో బీఆర్ఎస్ పైన ఉన్న కోపాన్ని చూసానని అన్నారు. ఇప్పుడు చూస్తున్నాను తెలంగాణ ప్రజలు మోడీ నీ మరో సారి ఆ పీఠం లో కూర్చోపెట్టాలని డిసైడ్ అయ్యారనీ.. మూడో సారి మోడీ సర్కార్ వస్తుందని అన్నారు.
వైసీపీ ఫైనల్ లిస్ట్.. ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..
పీలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఎన్నికలకు సిద్ధం అవుతోంది.. ఈ రోజు కేంద్ర ఎన్నికల కమిషన్.. లోక్‌సభతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధం అవుతుండగా.. ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ దగ్గర సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముందుగా నివాళులర్పించి.. ఆ తర్వాత పార్టీ నేతలతో కలిసి అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.. ఈ మీడియా సమావేశంలో.. ఎంపీ అభ్యర్థుల జాబితా, వివరాలను ఎంపీ నందగాం సురేష్ ప్రకటిస్తే.. ఎమ్మెల్యేల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు విడుదల చేశారు..
ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తా.. 14 సీట్లు గెలుస్తున్నాం
ఏపీలో ఎన్నికల ప్రచారానికి వెళ్తా అని, 14 సీట్లు గెలుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కారు షెడ్డుకు పోయింది.. డ్రైవర్ కి కాలు విరిగిందన్నారు. బీఎస్పీ సమాజానికి ఆర్ఎస్ ప్రవీణ్ సమాధానం చెప్పుకోవాలన్నారు. 100 రోజుల సంబరాలు ప్రజలు చేసుకుంటారన్నారు. ఎంఐఎం, బీఆర్ఎస్, బీజేపీతో కలిస్తే తిడతామన్నారు. ఎంఐఎం విధానం మా పట్ల మారిందా.. లేదా అనేది ఆ పార్టీ చెప్పాలన్నారు. హరీష్.. పార్టీలో గందర గోళం ఉందని తెలిపారు. నిన్న కవిత ఇంటికి వెళ్లిన హరీష్ వెనకాల నిలబడ్డారన్నారు. ఇప్పుడు ఇది.. రేపు ఏంటి అని గందరగోళం లో హరీష్ ఉన్నాడని అన్నారు. బీజేపీ.. బీఆర్ఎస్ ఇద్దరు కలిసి ప్రభుత్వం పడగోడతం అంటున్నారని తెలిపారు. నాతో కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. ఆ పార్టీ వాళ్ళు మన ప్రభుత్వం వస్తుందని చెప్తున్నారని తెలిపారు. మేము నిర్ణయం తీసుకుంటే ఐదో మనిషి బీఆర్ఎస్ వాళ్లకు మిగలరన్నారు. అతి తెలివి పనులు మానేయాలన్నారు.
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం..
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన ఏపీ విభజన చట్టం-2014 నియమనిబంధనలకు అనుగుణంగా పూర్తయినట్టు రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఇరు రాష్ట్రాలకు పంపిన లేఖను ఆయన మీడియాకు విడుదల చేశారు. రెండు రాష్ట్రాల నడుమ ఆస్తుల పంపకంలో భాగంగా ఆప్షన్-జీ కి ఇరు రాష్టాలు అంగీకారం తెలపడంతో విభజన పూర్తయినట్టు కేంద్రం ఈ లేఖలో తెలిపింది.
పాకిస్తాన్ వాతావరణాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో క్రియేట్ చేశారు
పాకిస్తాన్ వాతావరణాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాలలో క్రేయేట్ చేశారన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. ఇవాళ ఆయన ఆర్మూరులో మాట్లాడుతూ.. ముస్లింలతో కలిసి ప్రధాని మోడీని హేళన చేసి మాట్లాదారని ఆయన మండిపడ్డారు. హిందూ వ్యతిరేకి జీవన్ రెడ్డి అని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అండతోనే పిఎఫ్ఐకి జగిత్యాల అడ్డా గా మారిందని ఆయన ఆరోపించారు. హిందూ వ్యతిరేక శక్తి గా తయారయ్యారని, రోహింగ్యాలకు పౌరసత్వం ఇవ్వాలని జీవన్ రెడ్డి పోరాడటం విడ్డూరమన్నారు ఎంపీ అరవింద్. స్వాతంత్య్రం నుంచి కాంగ్రెస్ హిందువులను మోసం చేస్తూ వస్తోందని ఆయన విమర్శించారు. అంతేకాకుండా.. అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా విభజన చేశారని, అధికారంలో ఉండగా బీఆర్ఎస్ నేతలు అనేక అరాచకాలు చేశారని ఆయన మండిపడ్డారు. అమాయకులపై పిడి యాక్టులు పెట్టి వేదించారని, కవిత అరెస్ట్ అవినీతి రహిత పాలనకు ప్రయోజనమన్నారు ఎంపీ అరవింద్. లిక్కర్ స్కామ్ లో లింక్ ఉంది కాబట్టే కవిత అరెస్ట్ అవుతారనని చెప్పామన్నారు. కవిత అరెస్ట్ తో బీజేపీ కి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇల్లు లేని పేదలకు నాలుగు కోట్ల ఇళ్లు కట్టించాం
ముషీరాబాద్ అసెంబ్లీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పర్యటించారు. ఈ సందర్భంగా “లబ్ధిదారుల సమవృద్ది – మోడీ గ్యారెంటీ” కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలో గాంధీ నగర్ లో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి దారులను ఇంటింటికీ వెళ్లి కలుస్తూ ‘మోడీ గ్యారెంటీ’ గురించి వివరించారు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి పనులు, సాధించిన విజయాలతో పాటు పలు సంక్షేమ పథకాలు అందించిందన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, యువత మరియు పేద వర్గాల అందరి కోసం పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని, ఆ పథకాల ద్వారా లబ్ది పొందిన కోట్లాది మంది ప్రజలు ఈ దేశం లో ఉన్నారన్నారు. వారందరినీ ఈ ఎన్నికల దృష్ట్యా ప్రత్యక్షంగా కలిసి ఈ పథకాల ద్వారా వారి జీవన సరళిలో ఏ మేరకు మార్పు వచ్చిందని, ఏ రకంగా వారు శ్వశక్తులు అయ్యారో తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా ముషీరాబాద్ లో ప్రారంభించడం జరిగిందని ఎంపీ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
మోగిన ఎన్నికల నగారా.. ఏపీలో ఎన్నికలు ఆ తేదీనే
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మే 13న అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. లోక్ సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను సీఈసీ విడుదల చేసింది. ఈసీ ప్రకటనతో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లకు, 25 లోక్ సభ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ పేర్కొంది. జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని తెలిపింది. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించింది.
తెలంగాణ, ఏపీకి వర్షసూచన..
భారత వాతావరణ శాఖ (IMD) దేశంలోని అనేక ప్రాంతాలకు వర్షపాత హెచ్చరిక జారీ చేసింది, ఇది మార్చి 16 నుండి ప్రారంభమై మార్చి 21, 2024 వరకు కొనసాగుతుంది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, సిక్కిం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం మరియు త్రిపుర రాష్ట్రాలు దీని ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇంకా, జమ్మూ మరియు కాశ్మీర్ మరియు లడఖ్‌లలో కూడా మార్చి 20 మరియు 21 తేదీలలో వర్షాలు కురుస్తాయని అంచనా.
తెలంగాణలో మే 13న ఎన్నికలు..
ఏపీతో పాటు తెలంగాణలో ఒకేరోజు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలతో పాటు ఇటీవల కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయిన సంగతి తెలిసిందే. దాంతో అక్కడి స్థానం ఖాళీ కాగా.. ఆ అసెంబ్లీ స్థానానికి కూడా మే 13న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ లో.. 18వ లోక్ సభ ఎన్నికలతో పాటు, 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా వివిధ దశల్లో నిర్వహించేలా షెడ్యూల్ రిలీజ్ చేసింది. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో పలు రాష్ట్రాల్లోని 26 ఉప ఎన్నికలు కూడా ఉన్నాయి.
బీఎస్పీకి ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ రాజీనామా
బీఎస్పీ-బీఆర్ఎస్ మధ్య పొత్తు విఫలమైంది. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పార్టీని వీడుతున్నట్లు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శనివారం ప్రకటించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఎస్పీ, బీఆర్ఎస్ మధ్య పొత్తులు పూర్తిగా విఫలం కావడంతో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు భగ్నం చేయాలని బీజేపీ విశ్వ ప్రయత్నం చేసిందని విమర్శించారు అన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు కూడా అందులో భాగమేనని తెలిపారు.బీజేపీ కుట్రలకు బయపడి తాను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేనని, తన రాజకీయ ప్రస్థానాన్ని ఆపలేనని ప్రకటించారు.చివరి వరకు బహుజన వాదాన్ని తన గుండెల్లో పదిలంగా దాచుకుంటాటని స్వేరోలకు హామీ ఇచ్చారు.తనకు అన్ని రకాలుగా ఆది నుంచి సహాయ సహకారులు అందించిన స్వేరోలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇన్నాళ్లు పార్టీలో సహకరించిన పార్టీ అధినేత్రి కుమారి మాయావతి,పార్టీ రాజ్యసభ ఎంపీ, కేంద్ర సమన్వయకర్త రాంజీ గౌతమ్ లతోపాటు తొడ్పాటునందించిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.