ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి..
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మన ఊరు మనబడి పథకం కింద 721 కోట్లతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాయపర్తి మండలం కొండాపురం గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల అనూహ్యమైంది. పాఠశాలలో వసతులను పరిశీలించారు. నీటి వసతి, మరుగుదొడ్లు, తరగతి గదులు, మధ్యాహ్న జావా, విద్యాబోధన, పాఠశాల ఆవరణలోని పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
అక్కడ నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణాలను పరిశీలించి త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని సూచించారు. సీఎం చొరవతో ప్రభుత్వ పాఠశాలలో బాలబాలికలకు మంచి విద్యను అందించడమే కాకుండా ఆరోగ్య పరిరక్షణకు రాగి జావను అందిస్తున్నామన్నారు. ఆ తర్వాత రాగి జావా నయాత్‌ను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి విద్యార్థులకు సందేశం పంపారు.
మీ ఛాప్టర్ క్లోజ్.. ఇక మీరు ఆఫీసు మూసుకోవాల్సిందే..!’
రాజకీయం అంటూ ఏంటీ అని చంద్రబాబు, లోకేష్ లపై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా రాష్ట్రంలోని అందరికి అన్నీ అందిస్తున్నామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీల కార్యకర్తలు ఏ ఇంటికైనా వెళ్ళగలుగుతున్నారా.. ఆ పార్టీల కార్యకర్తలు ప్రజలను ఓటు అడిగే పరిస్ధితిలో లేరు అని ఆయన పేర్కొన్నారు. అన్ని పార్టీలను కలిసి రమ్మనండి.. విడి విడిగా రమ్మనండి… సింహం సింగిల్ గా వస్తుంది.. చంద్రబాబు ముసలి నక్కలాగా తరమండ్రా నాకొడకల్ని అనటం రౌడీయిజం కాదా అని మంత్రి కారుమూరి అన్నారు.
దేశంలో ముస్లింలపై విద్వేష వాతావరణం సృష్టిస్తున్నారు..
మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లపై కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి లోక్ సభలో అవిశ్వాన తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. భారత దేశంలో బతకాలంటే మోడీకి ఓటేయాల్సిందేనని చెప్పినందుకు కొద్ది రోజుల క్రితం ఓ కానిస్టేబుల్ ముస్లింలను రైలులో ఎక్కించి చంపేశాడని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. నేడు దేశంలో ముస్లింలపై విద్వేష వాతావరణం సృష్టిస్తున్నారని అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. మణిపూర్ అల్లర్లపై హోంమంత్రి మాట్లాడారని, అస్సాం రైఫిల్స్‌పై ఏమీ మాట్లాడలేదని ఆయన అన్నారు. మణిపూర్‌లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. ఆయుధాలు దోచుకుంటున్నారు.. కానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందని ఓవైసీ ప్రశ్నించారు.
దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరనికి ఎంత ఇచ్చారో చెప్పాలి
దమ్ము ధైర్యం ఉంటే కాళేశ్వరనికి ఎంత ఇచ్చారో చెప్పాలని బీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు కేంద్రానికి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక్క రూపాయి ఇచ్చినట్లు నిరూపిస్తే BRS ఎంపీలం రాజీనామాలు చేస్తామన్నారు. 86 వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇచ్చామని నిషికాంత్ దుబే అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని చూడలేక ఓర్వ లేక ఆ అభివృద్ధికి మేమే నిధులిచ్చాం అంటున్నారని అన్నారు. రూల్ 222 ప్రకారం నిషికాంత్ దుబే పై సభను తప్పుడోవ పట్టించినందుకు స్పీకర్ కు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామన్నారు. పార్లమెంట్ లో అవిశ్వాసం ఇచ్చామన్నారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా తెలంగాణకు అన్యాయం చేశారని చర్చ సందర్భంగా అన్ని వివరాలు చెప్పామని తెలిపారు. తెలంగాణ రాక ముందు తాగు నీరు సాగు నీరు ఉండేది కాదన్నారు. 9 ఏళ్లలో కేసిఆర్ తాగు నీటికి సాగు నీటి కోసం మిషన్ కాకతీయ, మిషన్ భగీరద ద్వారా నీరందించారని అన్నారు. కేంద్రం తెలంగాణ పట్ల కక్షతో ఉన్నారని అన్నారు. విభజన చట్టం ప్రకారం చేయాల్సినవి కూడా చేయలేదన్నారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన అవసరం కేంద్రం పై ఉందన్నారు.
ఫిలిం స్టార్స్ ఆకాశం నుంచి ఊడి పడలేదు.. చిరు వ్యాఖ్యలకి సాయి రెడ్డి మార్క్ కౌంటర్
తాజాగా జరిగిన వాల్తేరు వీరయ్య 200 రోజుల విజయోత్సవ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి ప్రభుత్వాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే పూర్తి వీడియో రిలీజ్ కాకపోవడంతో ప్రభుత్వాలు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినీ పరిశ్రమల టార్గెట్ చేయకూడదని అర్థం వచ్చేలా కామెంట్లు చేసినట్టు వీడియో వైరల్ అయింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు ఉన్నాయని భావించి ప్రభుత్వం తరఫున మంత్రులు అధికార పార్టీకి చెందిన నేతలు పెద్ద ఎత్తున మెగాస్టార్ చిరంజీవి మీద విరుచుకుపడ్డారు. అయితే అసలు మెగాస్టార్ చిరంజీవి టార్గెట్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాదని అర్థం వచ్చేలా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన పూర్తి వీడియోని తాజాగా సినిమా యూనిట్ రిలీజ్ చేసింది.
నిజానికి ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకున్నా ఏపీ అధికర పార్టీ కీలక నేత అయిన విజయసాయి రెడ్డి రాజ్యసభలో సినిమాటోగ్రఫీ బిల్లు చర్చ జరిగినప్పుడు చేసిన సూచనల గురించి చిరంజీవి మాట్లాడారు. ఏ హీరో ఎంత తీసుకుంటున్నారు అనే విషయం గురించి కూడా పెద్దల సభలో మాట్లాడాల్సిన అవసరం లేదని సినిమా వాళ్లు చాలా చిన్న వాళ్ళని చెబుతూ మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది. ఇక ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఒక ట్వీట్ చేశారు. ‘’సినీ రంగమేమీ ఆకాశం నుంచి ఊడి పడలేదు. ఫిలిం స్టార్స్ అయినా పొలిటిషియన్స్ అయినా ప్రజలు ఆదరిస్తేనే వారికి మనుగడ, సినీ పరిశ్రమలోని పేదలు, కార్మికుల సంక్షేమం బాధ్యత కూడా ప్రభుత్వానిదే అని పేర్కొన్న సాయి రెడ్డి వాళ్ళూ మనుషులే, వారి గురించి మీకెందుకు? వీరి గురించి ప్రభుత్వానికి ఎందుకంటే కుదరదని అన్నారు.
రూ.70కే కిలో టమాటా.. సబ్సిడీ ధరతో విక్రయం
దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. బెండకాయ, పొట్లకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌తో సహా అన్ని రకాల ఆకుకూరలు ఇప్పుడు ప్రియం అయ్యాయి. ఇప్పటికీ టమాటా కూడా అత్యధిక ధర పలుకుతోంది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పెరుగుతున్న ధరలపై ఆందోళనల మధ్య టమాటాలను కిలో రూ.70కి విక్రయిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలిపారు. పరిస్థితిని తగ్గించడంలో సహాయపడటానికి నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌సీసీఎఫ్) ఈ వారాంతంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో సబ్సిడీ ధరతో టమోటాల విక్రయాన్ని నిర్వహిస్తుందని ఆమె చెప్పారు.
కాకినాడ బీచ్ వద్ద విషాదం.. ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
కాకినాడ బీచ్ వద్ద ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన స్థానికులు వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ప్రేమజంట.. ప్రత్తిపాడు మండలం పోతులూరుకు చెందిన అరుణ్, శ్రీదేవిగా గుర్తించారు. మహిళను వివాహితగా చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు రోజురోజుకు దేశ వ్యాప్తంగా ఆత్మహత్యాయత్నం, ఆత్మహత్య ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చిన్న చిన్న కారణాలతో ప్రాణాలను వదిలేసుకుంటున్నారు. వారిక ఎదురైన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే మానసిక నిపుణులను కలవాలని కోరుతున్నారు. జీవితం అనేది అందమైన ప్రపంచం.. జీవితం అనేది విలువైనది. అందులో గెలవాలి, పోరాడాలి అనే కుతుహలం ఉండాలి కానీ.. ఇలా చిన్నచిన్న వాటికి భయపడి ప్రాణాలు తీసుకునే పని చేయొద్దు. ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి.
ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్రలో ఇది సరికొత్త రికార్డ్
జూలై నెలలో ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు 72.8 శాతం నమోదు కావడం పట్ల ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల చరిత్రలో ఇది సరికొత్త రికార్డ్ అని వ్యాఖ్యానిచారు. ఇందుకు కృషి చేసిన వైద్య సిబ్బందిని మంత్రి అభినందించి… శుభాకాంక్షలు తెలిపారు.
వైద్యారోగ్య శాఖ పరిధిలోని వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలు, పనితీరుపై మంత్రి హరీష్ రావు గురువారం సమీక్ష నిర్వహించారు. వీసీ ద్వారా జరిగిన సమీక్షలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధర్, TSMSIDC MD చంద్రశేఖర్ రెడ్డి, అన్ని జిల్లాల వైద్యాధికారులు, ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పాటుకు ముందు 30 శాతం డెలివరీలు జరిగితే, ప్రస్తుతం 73 శాతానికి చేరడం సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనలో వైద్యారోగ్య శాఖ చేస్తున్న పనితీరుకు, పురోగతికి నిదర్శనం అన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్న డెలివరీలు, ప్రభుత్వ ఆసుపత్రులపై పెరుగుతున్న ప్రజల విశ్వాసానికి, నమ్మకానికి మంచి ఉదాహరణలు అన్నారు. అత్యధికంగా నారాయణ్ పెట్ జిల్లాలో 86.9%, మెదక్ 83.5%, జోగులాంబ గద్వాల్ 81.1% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరగటం అభినందనీయం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి డెలివరీలు తక్కువగా నమోదు అవుతున్న వరంగల్, హన్మకొండ, సూర్యాపేట, నిర్మల్ జిల్లాల్లో ఫలితాలు మెరుగు పడాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర సగటు కంటే తక్కువ నమోదు అవుతున్న జిల్లాలపై వైద్యాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
సొంత ఇంటి కల కేసీఆర్ హయాంలో నెరవేరదు
మెదక్ జిల్లా నర్సాపూర్‌లో డబుల్ బెడ్రూంలను బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ పరిశీలించారు. అయితే.. డబుల్ బెడ్ రూమ్ ల కోసం మెదక్ లో బీజేపీ ధర్నా చేపట్టగా.. ఈ ధర్నాలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటివరకు డబల్ బెడ్ రూమ్ లు ఎన్ని పంపిణీ చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం 9 వేలకోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని, ఎన్నికలు అయ్యేంతవరకు ఎక్కడ కూడా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు పంపిణీ చేయరంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
వీఆర్‌ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే
వీఆర్‌ఏలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గ్రామ సేవకులుగా ఉన్న వీఆర్‌ఏలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ భరోసా ఇచ్చేలా వివిధ ప్రభుత్వ శాఖల్లో నియమించడం జరిగిందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్ జిల్లాలో వివిధ శాఖలకు కేటాయిస్తూ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్. మహమూద్ అలీ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాకు కేటాయించిన 182 మంది వీఆర్‌ఏలను విద్యార్హతల ఆధారంగా వివిధ కేటగిరీలలో నియమించామని ఆయన తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో APPSC ద్వారా కేవలం నెలకు 3 వేల రూపాయలతో కన్ సాలిడేటెడ్ వేతనంతో నియమించబడిన వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ.. దేశ చరిత్రలో నిలిచిపోతుంది.