Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 5pm 02 05 2024

Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌

Published Date :May 2, 2024 , 5:09 pm
By Gogikar Sai Krishna
Top Headlines @5PM : టాప్‌ న్యూస్‌
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘సీబీఐ కేంద్రం నియంత్రణలో లేదు’.. సుప్రీంకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

సీబీఐపై కేంద్రానికి ఎలాంటి నియంత్రణ లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. వాస్తవానికి అనేక కేసుల్లో దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని సీబీఐ తీసుకోలేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం కేంద్రంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. ఇందులో సీబీఐకి ఇచ్చిన సాధారణ సమ్మతిని రాష్ట్రం ఉపసంహరించుకున్నప్పటికీ, ఫెడరల్ ఏజెన్సీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ద్వారా రాష్ట్రంలోని కేసులను దర్యాప్తు చేస్తోందని ఆరోపించారు.

మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు.. డొక్కు బస్సులతో నడిపిస్తున్నారు

మహిళలకు ఉచిత బస్సు మాత్రం అమలు చేస్తున్నారు. అది కూడా పాత డొక్కు బస్సులతోనే నడిపిస్తున్నారని మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. బోడుప్పల్, వివేకానందనగర్ వాసులతో బ్రేక్‌ఫాస్ట్ మీటింగులో ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. సాధారణంగా మామూలు ఉద్యోగులు ఏమనుకుంటారో నాకు తెలుసు. వారికి రాజకీయాలంటే అంత ఆసక్తి ఉండదన్నారు. వారి వృత్తి, వ్యాపారాలలో బిజీగా ఉంటారు. మేము ఎదురు పడినా అంత పట్టించుకోరన్నారు. ఓట్లప్పుడు మాత్రం అడగడానికి వస్తారన్నారు. సమస్యలు చెప్తే మాత్రం పట్టించుకోరు అని వారు భావిస్తారని అన్నారు. కానీ మీకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి, మౌలిక వసతులు కల్పించడానికి రాజకీయ నాయకుల అవసరం ఉంటుంది. కేవలం హామీలను, కులాలను పట్టించుకోకండని తెలిపారు.

ఏపీ స్పెషల్‌ స్టేటస్‌ టీడీపీ మర్చిపోయింది..!

ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్‌ స్టేటస్‌ వ్యవహారాన్ని టీడీపీ మర్చిపోయింది అని ఫైర్ అయ్యారు ఏపీ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాకూర్‌.. విజయవాడలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. బీజేపీ, టీడీపీ, జనసేన మేనిఫెస్టో లు ఎవరివి వారివే అని ఎద్దేవా చేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నుంచీ ఒక గ్యారెంటీ కార్డు ప్రతీ ఓటరుకు ఇస్తున్నాం… 8,800 ప్రతీనెలా ఒక కుటుంబ ఆదాయంగా ఉండాలి.. అలా లేకపోతే.. కాంగ్రెస్ కేంద్రం నుంచి అందిస్తుందన్నారు. ఇక, బీజేపీకి స్వంతంగా మేనిఫెస్టో నే లేదు అని దుయ్యబట్టారు.. మైనారిటీ డిక్లరేషన్ గురించి ప్రధాని నరేంద్ర మోడీ ముందు చంద్రబాబు మాట్లాడగలరా? అని సవాల్‌ చేశారు.. ముస్లిం మైనారిటీలను ఫూల్స్ అనుకుంటున్నారు వాళ్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. మరోవైపు.. ఈ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో 158 స్ధానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని.. మిగిలిన స్ధానాల్లో కమ్యూనిష్టులు పోటీ చేస్తున్నారని వెల్లడించారు ఏపీ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌ మాణిక్కం ఠాకూర్‌. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా బరిలోకి దిగగా.. టీడీపీ-జనసేన-బీజేపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి.. ఇక, సీపీఎం, సీపీఐ తో కలిసి కాంగ్రెస్ పోటీ చేస్తున్న విషయం విదితమే.

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి టికెట్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు..

కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థికి టికెట్ ఎలా వచ్చింది? కరీం నగర్ అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ కార్యకర్తలకే తెలియదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ సమక్షంలో పలువురు సినీ, టీవీ ఆర్టిస్టు లు బీజేపీలో చేరారు. కేసీఆర్ కొడుక్కు తెలియకుండానే సిరిసిల్ల కేంద్రంగా పోన్ ట్యాపింగ్ జరిగిందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు… అధికారిక ప్రకటన ఎందుకు చేయడం లేదు? అన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ అనే నాణానికి బొమ్మ బొరుసు అని అన్నారు. అమెరికా ప్రభాకర్ రావు అశోక్ రావు కూతురు ఇంట్లో ఉంటాడన్నారు. కాంగ్రెస్ వాళ్ళ నుండి డబ్బులు తీసుకోవడానికి భయపడుతున్నారు కరీంనగర్ లో అన్నారు. 6 గ్యారంటీ లు, పోన్ ట్యాపింగ్ విషయం లో ప్రజల్లో తీవ్రంగా చర్చ జరుగుతుందన్నారు. నయీం కేసు లెక్కనే ఈ కేసు కూడా క్లోజ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని నుండి బయటపడేందుకు రిజర్వేషన్ అంశం తీసుకొచ్చారన్నారు. కరీం నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కి టికెట్ ఎలా వచ్చింది? మంత్రి కి కెసిఆర్ కుటుంబం కు ఉన్న సన్నిహిత సంబంధం ఏమిటని అన్నారు.

మంత్రి అమర్నాథ్‌ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోడీ క్లారిటీ ఇస్తేనే ప్రజలు నమ్ముతారు..!

మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై తమ విధానం స్పష్టమన్న ఆయన.. అసలు వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌పై బీజేపీ విధానం ఏంటో ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రధాని నరేంద్రమోడీ చెప్పాలని డిమాండ్‌ చేశారు.. అనకాపల్లి బహిరంగ సభలోనే ప్రధాని మోడీ.. ఈ ప్రకటన చేస్తేనే జనం.. ఎన్డీఏ (బీజేపీ-టీడీపీ-జనసేన)కూటమిని విశ్వసిస్తారని తెలిపారు.. అంతే కానీ, వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ పై కూటమి నేతలు ప్రస్తుతం చెబుతున్న నోటి మాటలను నమ్మడానికి జనం సిద్ధంగా లేరని పేర్కొన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్‌.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రీ షెడ్యూల్..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర రీషెడ్యూల్ చేశారు బీఆర్ఎస్ శ్రేణులు. కేసీఆర్ ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ 48 గంటలపాటు రద్దు చేసిన నేపథ్యంలో రేపు (3న) సాయంత్రం 8 గంటలకు గడువుముగియనుంది. అయితే.. గడువు ముగిసిన 8 గంటల తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర, రోడ్డు షో గతంలో ప్రకటించిన విధంగా యదావిధిగా కొనసాగనుంది.

ల్యాండ్ టైటిలింగ్ అమలు చేస్తే భూములు ఈజీగా అమ్ముకోవచ్చు..

గత కొన్ని రోజులుగా టీడీపీ పార్టీ నేతలు వైసీపీ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై అనేక అపోహలు ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న భూహక్కుదారులకు భూములపై హ మరింత బలం చేకూర్చే విధంగా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకువచ్చామన్నారు. భూ హక్కుదారుల మధ్య ఎమ్మార్వో లాంటి వాళ్ళు లేకుండా ప్రభుత్వం అండర్‌లో ఉండే విధంగా చూస్తామన్నారు. కొన్ని ఛానెళ్లపై యాక్షన్ తీసుకోవాలని ఉందన్నారు. జీరోస్ పేపర్ భూ హక్కుదారులు దగ్గర ఉంటాయని అంటున్నారని, అవన్నీ అబద్ధపు మాటలన్నారు. ల్యాండ్ టైటిలింగ్ అమలు చేస్తే భూహక్కుదారులు భూములను ఈజీగా అమ్ముకోవచ్చన్నారు. 2019లో ఇచ్చిన మేనిఫెస్టో, 2024లో ప్రవేశ పెట్టిన మేనిఫెస్టో దేశంలో ఓ కొత్త ఒరవడి తీసుకు వచ్చిందన్నారు.

నేడు ఉప్పల్‌ లో ఐపీఎల్‌ మ్యాచ్‌.. మెట్రో సేవలు పొడిగింపు..

హైదరాబాద్ వాసులకు తాజాగా మెట్రో అధికారులు శుభవార్త అందించారు. నేడు (2న) ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. గురువారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. ఈ సందర్బంగా ఐపీఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. ఉప్పల్ మార్గంలో వెళ్లే మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించారు. నాగోల్‌, ఉప్పల్‌ స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్ల నుంచి చివరి రైళ్లు ఈ నేపథ్యంలో మెట్రో రైళ్లు అర్ద రాత్రి 12:15 చివరి ట్రైన్ బయలు దేరి 1:10 వరకు చివరి టర్మినల్స్ కు చేరుకొందని మెట్రో అధికారులు వెల్లడించారు. సాధారణంగా ఐపీఎల్ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరిగినా హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని విద్వేషాలను సృష్టిస్తుంది

సూర్యాపేట జిల్లా మోతె, నడిగూడెం మండల కేంద్రాల్లో నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని విద్వేషాలను సృష్టిస్తుందని, బీజేపీకి మరో అవకాశం ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లకు తూట్లు పడతాయని ఆయన అన్నారు. పదేళ్లుగా భాజపా ప్రచారానికే పరిమిత మయ్యిందని, బీఆర్ఎస్ పార్టీకి ఒక్క ఎంపీ స్థానం కూడా రావడం కష్టమే అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ నెల 5న అమిత్ షా, 6న జేపీ నడ్డా తెలంగాణలో పర్యటన

ఈ నెల 5 న అమిత్ షా, 6న జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రచార షెడ్యూల్‌ను బీజేపీ విడుదల చేసింది. 5న ఉదయం 11:30 గంటలకు ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం సిర్పూర్ కాగజ్నగర్ లో బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొంటారు. మధ్యాహ్నం 1.30 గంటలకు నిజామాబాద్ పార్లమెంట్ నిజామాబాదులో బహిరంగ సభకు విచేస్తారు. సాయంత్రం 4 గంటలకు మల్కాజ్ గిరి లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు అమిత్‌ షా. ఈ నెల 6న బీజేపీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా 11 గంటలకు పెద్దపల్లి లో మధ్యాహ్నం 1గంటకు, భువనగిరిలో మధ్యాహ్నం 3.30 గంటలకు నల్గొండలో జరగనున్న బహిరంగ సభలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amit Shah
  • CM Revanth Reddy
  • kcr
  • Narendra Modi
  • telugu news

తాజావార్తలు

  • Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Ronin Hero Rat: బొరియలు తవ్వడం కాదు.. బాంబులు పసిగట్టడం దీని స్పెషాలిటీ! గిన్నిస్ రికార్డు సాధించిన ఎలుక..

  • MS Dhoni-Rohit Sharma: ముగిసిన ధోనీ, రోహిత్ శకం.. అభిమానుల మదిలో చెరగని ముద్ర!

  • బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటున్నారా.. జర ఇది చూడండి..

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions