సంచలనం రేపుతున్న మీర్జా రిమాండ్ రిపోర్ట్.. స్నాప్ చాట్ ద్వారా డ్రగ్స్ సప్లై
తెలంగాణలో రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసు ఇప్పుడు హాట్ టాపిక్. అప్పటికే 14 మందిని అదుపులో తీసుకున్న పోలీసుల విచారణలో రోజుకో కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ఇవాళ గచ్చిబౌలి పోలీసుల ఎదుట డైరెక్టర్ క్రిష్ హాజరైన విషయం తెలిసిందే.. ఇక రిమాండ్ లో వున్న మీర్జా వాహిద్ బేగ్ విచారించగా పోలీసులకు రిపోర్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రధాన నిందితుడు వివేకానంద్ ఆదేశాలతో డ్రైవర్ కు, ప్రవీణ్ కు డ్రగ్స్ ను పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్ అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. స్నాప్ చాట్ ద్వారా చాట్ చేస్తూ డ్రగ్స్ సప్లై, డెలివరీ ముఠా చేస్తున్నారని తెలిపారు. డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ ద్వారా వివేకానందుకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలోనే 10సార్లు డ్రగ్ సరఫరా చేసినట్లు గుర్తించారు. మిర్జా వహీద్ బేగ్ రిమాండ్ రిపోర్ట్ లో మరోసారి డైరెక్టర్ క్రిష్ పోలీసులు పేరును ప్రస్తావించడం కీలకంగా మారింది.
100 ఎకరాల్లో 15 లక్షల మంది పాల్గొనేలా మేదరమెట్ల ‘సిద్ధం’ మహాసభ
మేదరమెట్ల జాతీయ రహదారి పక్కన 4వ చివరి సిద్దం మహాసభ నిర్వహిస్తున్నామని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సిద్ధం సభ అనంతరం ఎన్నికల ప్రచారం మెుదలవుతుందన్నారు. సభా వేదిక కేంద్రంగా రాష్ట్ర వైసీపీ క్యాడర్‌కు సీఎం జగన్ దిశ, దశను నిర్దేశిస్తారని ఆయన వెల్లడించారు. అధికారం చేపట్టిన అనంతరం వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ళలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని సీఎం జగన్ ప్రజలకు వివరిస్తారని తెలిపారు.
సభా వేదికగా వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేయబోతున్నామో మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నామన్నారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే 175కు 175 సాదిస్తామనే విషయంలో ఎటువంటి అనుమానాలు లేవన్నారు. సభ మొత్తం 100 ఎకరాల్లో 15 లక్షల మంది పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆరు పార్లమెంట్ స్థానాలు, జిల్లాల నుంచి ప్రజలు ఈ సభకు హాజరవుతారని విజయసాయిరెడ్డి తెలిపారు.ఇప్పటి వరకు జరిగిన సిద్దం సభల స్పందనను చూస్తే వైసీపీ తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వస్తుందనారంలో ఎటువంటి అనుమానం లేదన్నారు. మా పాలన, సంక్షేమం చూసి బిసీలు వైసీపీ వైపు ఆకర్షితులయ్యారని ఆయన పేర్కొన్నారు. సభలో ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.
భారతదేశంలో పేదరికం పోయింది.. తేల్చిన గణాంకాలు
భారతదేశంలో పేదరికం చాలా వరకు తగ్గింది. ఇదే విషయం అధికారిక డేటా నిర్ధారిస్తుంది. హెడ్‌కౌంట్ ప్రావర్టీ రేషియో 2011-12లో 12.2 శాతం నుండి 2022-23 నాటికి 2 శాతానికి తగ్గింది. ప్రపంచ పేదరిక జనాభా రేటుపై ఇది సానుకూల పరిణామంగా పరిగణించబడుతుంది. ఇతర దేశాల మాదిరిగానే భారతదేశం కూడా దారిద్య్రరేఖకు ఎగువకు చేరుకోవాల్సిన సమయం ఆసన్నమైందని దీని అర్థం. అధిక దారిద్య్ర రేఖ ఇప్పటికే ఉన్న సామాజిక భద్రతా కార్యక్రమాలను పునర్నిర్వచించటానికి అవకాశాన్ని అందిస్తుంది.
భారతదేశంలో ఆహారం, బట్టలు, మందులు, ఇతర వస్తువులపై ఎవరు ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల గృహ వినియోగ వ్యయ సర్వే (HCES) ను విడుదల చేసింది. ఈ సర్వే ఆగస్టు 2022 – జూలై 2023 మధ్య నిర్వహించబడింది. 11 ఏళ్ల క్రితం 2011-12లో చివరిసారిగా ఇలాంటి సర్వే జరిగింది. ప్రస్తుతం ప్రజలు కూరగాయల కంటే గుడ్లు, చేపలు తినడానికే ఎక్కువ ఖర్చు పెడుతున్నారని సర్వే రిపోర్టులో ఒక ట్రెండ్ వచ్చింది. ఒక గ్రామంలోని పేదవాడి జీవితం రోజువారీ ఖర్చు రూ.45. అయితే నగరంలో నివసించే అత్యంత పేదవాడు కేవలం రూ.67 మాత్రమే ఖర్చు చేస్తున్నాడు.
చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వేమిరెడ్డి దంపతులు
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శనివారం టీడీపీలో చేరారు. టీడీపీ కండువాతో ఆయనను చంద్రబాబు నాయుడు తమ పార్టీలోకి ఆహ్వానించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీమణి ప్రశాంతి రెడ్ది, నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా టీడీపీలో చేరారు. నెల్లూరులోని పీవీఆర్ కన్వెక్షన్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని.. వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో ఈజీగా గెలవబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.
మూసి రివర్ నిర్లక్ష్యం కావడం వల్లనే డ్రైనేజీగా మార్చారు..!
మూసి రివర్ నిర్లక్ష్యం కావడం వల్ల డ్రైనేజీగా మార్చారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ లోని ప్రైవేట్ హోటల్లో జరిగిన CII తెలంగాణ స్టేట్ అన్యువల్ మీటింగ్ 2023-24 కాన్ఫరెన్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భట్టి విక్రమార్క హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు పూర్తి సహకారం అందించడానికి సంసిద్ధతగా ఉందన్నారు. ఇందిరమ్మ రాజ్యం లోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. తెలంగాణలోని మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మిగా చూస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో మహాలక్ష్మి పథకం కింద మహిళల అందిస్తున్న ఉచిత బస్సు రవాణాను ఇప్పటి వరకు 18.50 కోట్ల మంది మహిళలకు జీరో టికెట్స్ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కొత్త ఇండస్ట్రీ పార్కుల ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలను తయారు చేస్తున్నామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తుందన్నారు.
వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో ఈజీగా గెలవబోతున్నాం..
రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అజాత శత్రువు అని.. టీడీపీలో చేరుతున్నారంటే జిల్లాలో ఎంతో ఉత్సాహం కనబడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వేమిరెడ్డి రాకతో నెల్లూరు జిల్లాలో ఈజీగా గెలవబోతున్నామని ఆయన అన్నారు. పేద ప్రజలకు సేవ చేయాలని టీడీపీలోకి వచ్చిన వేమిరెడ్డి దంపతులను సాదరంగా ఆహ్వానిస్తున్నామని చంద్రబాబు వారిని పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాలు, వ్యాపారం కాకుండా.. సేవ కోసం వేమిరెడ్డి వచ్చారని.. నెల్లూరులో వైసీపీ అంతా ఖాళీ అవుతోందన్నారు. నెల్లూరు ప్రజలు ఎంతో ఉత్సాహంతో ఉన్నారన్నారు. సాధారణంగా ఎవరైనా పార్టీలో చేరాలంటే హైదరాబాద్ లేదా అమరావతికి వస్తారని.. కానీ నెల్లూరుకు వచ్చి వేమిరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించానంటే అదే వారికి ఇచ్చిన ప్రత్యేకత అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. రాజకీయాలకు గౌరవం తెచ్చే వ్యక్తులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామన్నారు. నెల్లూరు రాజకీయ నాయకులు ఆత్మాభిమానంతో ఉంటారన్నారు.
బీజేపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడైనా రావొచ్చు..!
బీజేపీ అభ్యర్థుల జాబితా ఎప్పుడైనా రావొచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించేందుకు విజయ సంకల్ప యాత్రలు చేస్తున్నారని తెలిపారు. యాత్రలకు మంచి స్పందన ఉంటుందని తెలిపారు. గత 10 సంవత్సరాలు గా మోడీ చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు, తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు యాత్రల ద్వారా ప్రజల ముందు పెట్టామన్నాఉ. అభివృద్ది చెందిన భారత్ కోసం మేనిఫెస్టో తయారీకి ప్రజల నుండి సలహాలు తీసుకోవాలని నిర్ణయించారు. దేశంలో ఇంకా పేదరికం ఉంది, మౌలిక వసతులు, విద్యా, వైద్యము లేదన్నారు. 2047 లో దేశం అభివృద్ది చెందిన దేశంగా ఉండాలనేది బీజేపీ సంకల్పం అన్నారు. GYAN ఎజెండా గా ముందుకు వెళ్తామన్నారు. గరిబ్ కళ్యాణ్(G) యూత్ (Y) అగ్రికల్చర్(A) నారి శక్తి(N)..రెండు రకాల మేనిఫెస్టో లు… ఒకటి 5 సంవత్సరాల కోసం… రెండోది 25 సంవత్సరాల కోసం అన్నారు. ప్రధాని నీ మా ప్రధాని, మన ప్రధాని అనే విధంగా మోడీ పని చేస్తున్నారన్నారు. నిధుల సమీకరణ కూడా చేస్తున్నామన్నారు. మా కార్యకర్తల నుండి మొదలు పెడుతున్నామన్నారు. బీజేపీ ప్రజల చేత స్థాపించబడిందని, ప్రజల కోసం, ప్రజల చేత నడిచే పార్టీ.. బీజేపీ కుటుంబ పార్టీ కాదన్నారు. ఎవరైన ఆర్థిక సహాయం చేయాలని అనుకుంటే నమో యాప్ ద్వారా చేయండన్నారు.
పవన్‌కల్యాణ్ రాజకీయాలకు పనికి రారు
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) రాజకీయాలకు పనికి రాని వ్యక్తి అని మంత్రి అంబటి రాంబాబు (Ambati rambabu) విమర్శించారు. ప్రకాశం జిల్లాలో మంత్రి మీడియాతో మాట్లాడారు. పవన్‌కల్యాణ్ కేవలం తెలుగు దేశం (TDP) కోసమే జనసేన పార్టీని నడుపుతున్నారని తెలిపారు. నిన్నటి దాకా జనసేనకు మద్దతు తెలిపిన కాపులంతా ఆ పార్టీని వదిలి వైసీపీలో (YCP) చేరుతున్నారని చెప్పుకొచ్చారు. కాపు నేత హరిరామ జోగయ్య వాళ్ల కుమారుడు కూడా సీఎం జగన్ (CM Jagan) సమక్షంలో వైసీపీలో చేరారని గుర్తుచేశారు. జనసేన మీద ఆశలు పెట్టుకున్న కాపులంతా పవన్.. చంద్రబాబు (Chandrababu) చెంతకు చేరటంతో మోసపోయామని భావించారని.. పవర్ షేరింగ్ లేకుండా పోవడంతో కాపులు నిరాశకు గురయ్యారని తెలిపారు.
అధికారాలను వికేంద్రీకరణ ద్వారా ముందుకు వెళదాం
శంషాబాద్‌లోని మల్లికా కన్వెన్షన్ లో రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే మన అందరి జీవితాలు బాగుపడతాయి అనుకున్నామని, కానీ గత పది సంవత్సరాల్లో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందన్నారు. బిల్లులు రాక సర్పంచులు ఇబ్బందులు పడ్డారని, ఆనాడు రాజీవ్ గాంధీ గ్రామ పంచాయతీలను పటిష్ట పరిస్తే ఇప్పుడు 10 సంవత్సరాలుగా పంచాయతీలను నిర్వీర్యం చేశారన్నారు పొన్నం ప్రభాకర్. అంతేకాకుండా.. గ్రామ పంచాయతీ వ్యవస్థ ఈ 10 ఏళ్లలో ప్రతినిధులకు సంబంధం లేకుండానే కార్యక్రమాలు జరిగిపోయాయని ఆయన మండిపడ్డారు. రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ద్వారా మీనాక్షి నటరాజన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
మిషన్ భగీరథపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తాగునీటి వనరులైనటువంటి రిజర్వాయర్ల వారీగా ప్రస్తుతం ఉన్న నీటి నిలువలపై సమక్షించారు. రిజర్వాయర్లు, నదుల వంటి తాగునీటి వనరుల స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని రాష్ట్రంలోని అన్ని మారుమూల గ్రామాలు, ఆవాసాలు, తండాలు, గుడాలకు ప్రతిరోజు తాగునీటి సరఫరా జరిగేలా చూడాలని మంత్రి ఇంజనీర్లను ఆదేశించారు. ప్రత్యేకంగా పూర్వపు అదిలాబాద్, కరీంనగర్ జిల్లాలోని పంపుసెట్ల సమస్యను త్వరితంగా పరిష్కరించి వేసవిలో ఎటువంటి తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చీఫ్ ఇంజనీర్లను ఆదేశించారు. పైపులైన్లు పగిలిపోయిన లీకైన వెంటనే వాటిని సరిదిద్దు నీటి సరఫరాను అదే రోజు పునరుద్ధరించాలి ఈ విషయంలో ఎటువంటి ఆలస్యం ఉండకూడదని ఆదేశించారు.
సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు లేఖ.. దేనికోసమంటే..!
ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి (CM Jagan) టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని బహిరంగ లేఖలో ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలకు తాగునీరు సరఫరా (Drining Water) చేయలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) ఉండటం సిగ్గుచేటు అని అచ్చెన్నాయుడు లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో సురక్షిత నీరు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న విషయం ముఖ్యమంత్రికి తెలుసా?, గుంటూరులో కలుషిత జలంతో ప్రబలుతున్న డయేరియా, కలరా కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేశారు. లక్షలాది మంది ఆస్పత్రి పాలవుతున్నా పట్టకపోవడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనన్నారు. గుంటూరులో డయేరియాతో నలుగురు మృతి చెందారని.. మరో ముగ్గురికి కలరా వ్యాధి సోకిందని తెలిపారు.