సిద్ధార్థ్ లూథ్రా ఆసక్తికర ట్వీట్.. ‘కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది’
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు.. అయితే, ఆయన బెయిల్ కోసం, మరోవైపు హౌస్ రిమాండ్ కోసం.. ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలించడం లేదు.. ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా రంగంలోకి దిగి వాదనలు వినిపిస్తున్నారు. ఈ సమయంలో ఆయన చేసిన ఓ ట్వీట్ (X).. ఆసక్తికరంగా మారింది.. స్కిల్ స్కాం కేసులో రిమాండ్లో ఉన్న చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా ట్వీట్ చర్చకు దారిసింది.. ”అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు ఇంకా న్యాయం కనుచూపు మేరలో లేదు అని తెలిసినప్పుడు.. కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది” అని గురు గోవింద్ సింగ్ వ్యాఖ్యలను ట్విటర్‌లో షేర్ చేశారు.. ‘ఈరోజు ఇదే మా నినాదం’ అని ఆయన పేర్కొన్నారు. దీంతో మీరే గెలుస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. మరికొందరు నెగిటివ్ కామెంట్లు కూడా రాసుకొస్తున్నారు.
భారీ స్కామ్‌లు జరిగాయి.. రాజధాని లేని రాష్ట్రాన్ని చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది..!
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు.. అందరూ సమానమే అన్నారు. ఇప్పటి వరకు చంద్రబాబు తనకు అనుకూలంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చాడు.. 2014 నుంచి 2019 వరకు వివిధ పథకాల ద్వారా.. వివిధ స్కీమ్‌ల ద్వారా భారీ దోపిడీ జరిగిందన్నారు. స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, అమరావతి రింగ్ రోడ్డులో భారీ స్కామ్‌లు జరిగాయని ఆరోపించిన ఆయన.. కోర్టు సాక్షాదారాలు అన్ని పరిశీలించిన తర్వాతే చంద్రబాబును రిమాండ్‌కి తరలించిందన్నారు. చంద్రబాబు ప్రతి విషయాన్ని మేనేజ్ చేసుకోవడానికి అలవాటు పడ్డాడు.. 2014లో ఓటుకు నోటు కేసును కూడా ఇలాగే మేనేజ్ చేశాడని విమర్శించారు. రాష్ట్ర ప్రజలను తాకట్టుపెట్టి ఈ రోజుకి రాజధాని లేని రాష్ట్రాన్ని చేసిన ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుందని మండిపడ్డారు మాజీ ఎంపీ, వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి.
ఆ టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులకు హైకోర్టు నోటీసులు.. ప్రభుత్వానికి ఆదేశాలు
టీటీడీ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ఎమ్మెల్యే సామినేని ఉదయ భాను, దేశాయ్ నికేతన్, శరత్ చంద్రారెడ్డికి పర్సనల్ నోటీసులు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు విజయవాడకి చెందిన మాజీ రైల్వే ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు.. మంచి నడవడిక లేని, అనర్హులను, నేర చరిత్ర ఉన్నవారిని టీటీడీ సభ్యులుగా నియమించడం చట్ట వ్యతిరేకమని ధర్మాసనానికి విన్నవించారు.. ఇక ఆ పిటిషన్ విచారించిన చీఫ్ జస్టిస్ మరియు జస్టిస్ రఘునందన రావు ధర్మాసనం.. ప్రభుత్వాన్ని వివరణ కోరింది.. అయితే, శిక్ష ఇంకా విధించని కారణంగా వారు నేరస్థులుగా పరిగణించలేదని ప్రభుత్వం తరుపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు.. మరోవైపు.. ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మెడికల్ కౌన్సిల్ ఇండియా సభ్యత్వం నుండి తొలగింప బడిన కేథన్ దేశాయ్‌ను టీటీడీ సభ్యుడిగా నియమించారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు చింతా వెంకటేశ్వర్లు తరపు న్యాయవాది శ్రావణ్.. లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డి విచారణ ఎదుర్కొన్నారని, ఎమ్మెల్యే ఉదయ భానుపై క్రిమినల్ కేసులు నమోదు కాబడ్డాయన్నారు.. అయితే, కౌంటర్ దాఖలు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
2 రోజుల పాటు స్కూళ్లకు సెలవు.. వారికి మాత్రమే..
రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు డిసైడ్ చేసింది ప్రభుత్వం.. ఇంతకీ విషయం ఏంటంటే.. తెలంగాణ వరుసగా వివిధ పోస్టులకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్న విషయం విదితమే కాగా.. త్వరలోనే టీఎస్ టెట్ (TS TET) కూడా జరగనుంది.. ఇప్పటికే ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లను ఉంచారు అధికారులు.. చాలా మంది అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు.. ఈ నెల 15న టెట్ నిర్వహించనున్నారు.. రాష్ట్రవ్యాప్తంగా టెట్ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.. రెండు పేపర్లుగా అంటే పేపర్ -1, పేపర్ -2గా టెట్ నిర్వహించబోతున్నారు.. ఈ నెల 15వ తేదీన జరగనున్న టెట్‌లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. టెట్ నేపథ్యంలో.. ఎగ్జామ్ సెంటర్స్ పడిన స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.. టెట్ సెంటర్లలో 14వ తేదీన హాఫ్ డే స్కూల్ మాత్రమే నిర్వహించనున్నారు.. ఇక, పరీక్ష జరిగే 15వ తేదీన ఆయా స్కూళ్లకు విద్యాశాఖ సెలవు ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. గత ఏడాది టెట్ నిర్వహించిన విద్యాశాఖ.. టీఎస్ టెట్-2023 నోటిఫికేషన్ ఆగస్టులో విడుదల చేసింది.. ఆగస్టు 2 నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది.. 2.83 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే, టెట్‌లో అర్హత సాధించినవారికే డీఎస్సీ, గురుకుల లాంటి వివిధ ఉపాధ్యాయుల పోస్టులకు సంబంధించిన పరీక్షలకు అర్హులు కావడంతో.. తమ అదృష్ట్యాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నారు ఫ్యూచర్ పంతుల్లు. ఇక, ఈ ఏడాది పేపర్-1కి 1,139 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్-2 పరీక్ష కోసం 913 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో అత్యధికంగా 92 పరీక్షా కేంద్రాలు, ములుగు జిల్లాలో అత్యల్పంగా 8 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఈసారి కూడా టెట్ సిలబస్‌లో ఎలాంటి మార్పు లేదు. పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి. సెకండరీ గ్రేడ్ టీచర్ల నియామకం కోసం పేపర్-1 నిర్వహిస్తారు మరియు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత సాధించేందుకు పేపర్-2 నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 మార్కులు ఉంటాయి. పేపర్-1 పరీక్షలో 1-8 తరగతులకు ప్రామాణిక ప్రశ్నలు మరియు పేపర్-2 పరీక్షలో 6-10 తరగతులకు ప్రామాణిక ప్రశ్నలు ఉంటాయి.
అమెరికాలో పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఏపీ విద్యార్థిని మృతి.. నవ్వుతున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన శ్రీమతి కందుల జాహ్నవి సౌత్ లేక్ యూనియన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్శిటీ క్యాంపస్‌లో మాస్టర్స్ చదువుతుంది. కాగా ఈ ఏడాది డిసెంబర్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్ డిగ్రీని అందుకొంనుంది. ఇంతలో విధి ఆమెని చిన్నచూపు చూసింది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఆమె ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో చనిపోయింది. టెల్ పోలీస్ డిపార్ట్‌మెంట్ సమాచారం ప్రకారం మార్క్ చేయబడిన పెట్రోలింగ్ SUVని నడుపుతున్న అధికారి డెక్స్టర్ అవెన్యూ నార్త్‌లో ఉత్తరం వైపు ప్రయాణిస్తున్నారు అదే సమయలో మహిళ పాదచారి క్రాస్‌వాక్‌లో తూర్పు నుండి పడమరకు దాటుతుండగా వాహనం ఆమెను ఢీకొన్నది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి మృతి చెందింది. కాగా ఈ ఆక్సిడెంట్ కి సంబంధించిన ఓ వీడియో వెలుగు చూసింది. జాహ్నవి మరణించాక ఆమె మరణం గురించి ఒక అధికారి నవ్వుతూ, సరదాగా మాట్లాడడం తన బాడీ కెమెరాలో రికార్డ్ కావడంతో సీటెల్ పోలీసు యూనియన్ నాయకులపై దర్యాప్తు ప్రారంభించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. సోమవారం ఈ వీడియో ని విడుదల చేశారు. అనంతరం టెల్ కమ్యూనిటీ పోలీస్ కమీషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో Mr ఆడెరర్ మరియు అతని సహోద్యోగి మధ్య జరిగిన సంభాషణ “హృదయ విదారకమైనది అంటూ దిగ్బ్రాంతి వ్యక్తంచేసింది. కాగా ఈ ఘటన పై దర్యాప్తు కొనసాగుతుందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
జీ20 సదస్సుపై చైనా అక్కసు.. పాకిస్తానే కాస్త నయం..
భారతదేశం జీ20 సమావేశాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు డ్రాగన్ కంట్రీ చైనా, దాయాది దేశం తట్టుకోలేకపోతున్నాయి. భారత పరపతి పెరగడాన్ని చైనా మీడియా తగ్గించే ప్రయత్నం చేస్తోంది. చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ మౌత్ పీస్ మీడియా అయిన గ్లోబల్ టైమ్స్ ఈ సదస్సును తక్కువ చేసే ప్రయత్నం చేసింది. ఇక పాకిస్తాన్ మాత్రం ఏ మాత్రం దాచకుండా తన పరిస్థితిని అర్థం చేసుకుని వ్యవహరించింది. అంతర్జాతీయ మీడియా భారత ప్రయత్నాలను మెచ్చుకుంటే, చైనా మాత్రం ‘భారతదేశ భ్రమ’ అంటూ వ్యాఖ్యానించింది. చైనా ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషన్ స్టడీస్ కథనంలో ప్రధాని నరేంద్రమోడీ భారతదేశాన్ని ‘ప్రపంచ అగ్రగామి శక్తి’గా ధృవీకరించాలని జీ20ని సువర్ణావకాశంగా పరిగణించారని పేర్కొంది. భారత్ సూపర్ పవర్ కావాలనే కల ఆదర్మప్రాయమైనదని, అయితే ఈ క్రమంలో అనేక క్రూరమైన ఎదురు దెబ్బలు ఉంటాయని, జీ 20 సమ్మిట్ నుంచి భారత్ ఎక్కువగా ఆశిస్తోందని, సూపర్ పవర్ కావాలనే భ్రమను ప్రతిబింభిస్తోందని గ్లోబల్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.
పోలీసులకు ప్రధాని మోడీ విందు..
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన G20 సమ్మిట్ విజయవంతంగా పూర్తయింది. కాగా ఈ విజయంలో ఉన్నత అధికారులతో పాటుగా పోలీసులకి కూడా భాగం ఉంది. ఈ విషయం స్వయంగా మోడీనే చెప్పారు. చెప్పడమే కాదు పోలీసుల కృషిని గుర్తించి ఆ కృషిని దేశవ్యాప్తంగా తెయచేసేందుకు పోలీసులతో కలిసి విందు చేయనున్నారు ప్రధాని మోడీ. వివరాలలోకి వెళ్తే జి20 సమ్మిట్‌ను విజయవంతం చేయడంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికీ గుర్తింపు లభించే విధంగా ప్రధాని మోడీ ఈ వారం పోలీసులతో కలిసి విందు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా ప్రతి జిల్లా నుండి శిఖరాగ్ర సమావేశంలో అబ్దుతంగా పనిచేసిన కానిస్టేబుళ్లు, ఇన్స్పెక్టర్ల జాబితాను కోరినట్లు ఫోర్స్ లోని వర్గాలు తెలిపాయి. ఈ జాబితాలో 450 మంది సిబంది ఉంటారని అంచనా వేస్తున్నారు. వీరు మిస్టర్ అరోరాతో పాటు, G20 సమ్మిట్ వేదికగా ఉన్న భారత్ మండపంలో ప్రధానితో కలిసి విందు చేసే అవకాశం ఉంది. ఈ వారం ప్రారంభంలో G20 సమ్మిట్‌కు కొంతమంది ఢిల్లీ పోలీసు సిబ్బంది చేసిన కృషికి పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా ప్రత్యేక ప్రశంస డిస్క్ మరియు సర్టిఫికేట్‌ను కూడా ప్రదానం చేశారు.
రష్యా పర్యటనలో కిమ్.. క్షిపణుల ప్రయోగంలో నార్త్ కొరియా
అంతర్జాతీయ వేదిక పైన ఒంటరిగా మిగిలిన రష్యా నార్త్ కొరియాతో పొత్తు పెట్టుకోనుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధకాండ ప్రబలుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా వీలైనంత యుద్ధ సామాగ్రిని పోగుచేసుకునే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో ఆయుధాలపరంగా ముందు వరుసలో ఉన్నాం అంటూ.. ఎప్పుడు మాధ్యమాలలో విన్యాసాలు చేసే నార్త్ కొరియా నుండి కూడా ఆయుధాలను కొనుగోలు చెయ్యాలి అనుకుంటున్నట్లు అంతర్జాతీయ మాధ్యమాల సమాచారం. ఈ క్రమంలో నార్త్ కొరియా ధ్యక్షుడు రష్యా పర్యటనకు వెళ్లారు. నా పనిలో నేను బిజీగా ఉంటా.. మీరు మీ పనిలో బిజీ గా ఉండమని ఆఙ్ఞాపించారేమోగాని కిమ్ పర్యటనలో ఉన్నప్పుడే నార్త్ కొరియా అధికారులు క్షిపణులను ప్రయోగించినట్లు దక్షిణ కొరియా అధికారులు పేర్కొన్నారు. బుధవారం ఉత్తర కొరియా తన తూర్పు సముద్రాల వైపు ప్యోంగ్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న సునాన్ సమీపంలో రెండు స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు.
అదిరిపోయే బిజినెస్ ఐడియా .. ఇంట్లోనే ఉంటూ నెలకు రూ.45 వేలు సంపాదించవచ్చు..
బిజినెస్ చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. ఇంట్లో నుంచే డబ్బులు సంపాదించే అదిరిపోయే వ్యాపారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ బిజినెస్ చెయ్యాలనుకొనేవారికి ఇది బెస్ట్ చాయిస్.. సెల్ఫ్-లైఫ్ ఎక్కువగా ఉండే వీటిని తయారు చాలా సులభం. బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా కిచెన్‌లోనే బిస్కెట్లను తయారు చేయవచ్చు. బిస్కెట్ తయారీకి పదార్థాలను కలపడం, బిస్కెట్ల ను స్క్వేర్ లేదా రెక్టాంగిల్ షేప్‌లో బేక్ చేయడం, వాటిని ప్యాక్ చేయడం వంటి నాలుగు పనులు చేస్తే సరిపోతుంది.. తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందే బిజినెస్ ఇది..ఈ బిజినెస్ తో నెలకు రూ.35వేల నుంచి రూ.45వేల వరకు సంపాదించవచ్చు. వ్యాపార కార్యకలాపాలను మరింత పెంచితే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించొచ్చు. ఈ బిజినెస్ ఎలా ప్రారంభించాలి, లాభాలేంటి ఇటువంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.. బిస్కెట్ల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, రూ.5 లక్షలు పెట్టుబడి మొత్తం అవసరం అవుతుంది. రూ.90,000 పెట్టుబడి పెట్టగలిగితే, ప్రధాన మంత్రి ముద్ర యోజన నుంచి రూ.4.1 లక్షల రుణాన్ని పొందవచ్చు…ఈ పథకం కింద, బ్యాంక్ నుంచి రూ.2.5 లక్షల టర్మ్ లోన్, రూ.1.75 లక్షల వర్కింగ్ క్యాపిటల్ లోన్ పొందుతారు. మొత్తంగా రూ.4.25 లక్షల రుణం పొందవచ్చు. ఈ వ్యాపారానికి కావలసిన ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు, మిక్సర్లు, గ్రైండర్లు వంటి పరికరాలకు, పిండి, చక్కెర, వెన్న, గుడ్లు, స్పైసెస్ వంటి మొదలగు పదార్థాలకు డబ్బులను పెట్టాలి..
అప్పుడు బాంబ్ బ్లాస్ట్.. ఇప్పుడు బ్లాక్ మార్క్.. చంద్రబాబుపై దర్శకేంద్రుడు ట్వీట్
ఏపీ రాజకీయాలు రోజురోజుకు హీటెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గరనుంచి రాష్ట్రం నిరసన సెగలు కమ్ముకున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆయనను అరెస్ట్ చేసి 14 రోజుల రిమాండ్ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇక చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ అభిమానులు నిరసనలు చేపట్టారు. కేవలం టీడీపీ నేతలు మాత్రమే కాకుండా ప్రముఖులు కూడా ఆయన అరెస్ట్ ను ఖండిస్తున్నారు. ఇక నిన్నటివరకు మాట్లాడని చిత్ర పరిశ్రమ ఒక్కొక్కరిగా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ఇప్పటికే నిర్మాత అశ్వినీదత్, సూపర్ స్టార్ రజినీకాంత్.. తమ మద్దతును తెలిపారు. తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సైతం.. చంద్రబాబు ఈ బ్లాక్ మార్క్ ను దాటుకొని బయటకు రావాలని ట్వీట్ చేశాడు. “శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు క్షేమంగా ఎలా అయితే బ్రతికి బయట పడ్డారో ఇప్పుడు కూడా ఆ స్వామి వారి ఆశీస్సులతోనే ఎలాంటి బ్లాక్ మార్క్ లేకుండా జైలు నుంచి తప్పకుండ బయటకు వస్తారు” అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. చంద్రబాబు హయంలో రాఘవేంద్ర రావు ఎన్నో సినిమాలు తీశాడు. మొదటినుంచి చంద్రబాబు.. దర్శకేంద్రుడుకు మంచి స్నేహితుడు అంతేకాకుండా.. చంద్రబాబు హయాంలోనే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ కు రాఘవేంద్ర రావు చైర్మన్ గా విధులు నిర్వహించిన విషయం తెల్సిందే.
బ్రేకింగ్.. రాజమండ్రి జైలుకు పవన్ కళ్యాణ్.. ఎందుకంటే?
ఏపీ నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. రేపు రాజమండ్రికి జనసేనాని పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. రాజమండ్రి జైల్లో స్నేహ బ్లాక్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తో జనసేన అధ్యక్షుడు పవన్ ములాఖాత్ కానున్నారు. జైలులో ఇద్దరు అగ్రనేతలు కలవనున్న క్రమంలో ఎలాంటి అంశాలు చర్చకు రానున్నాయి అనేది హాట్ టాపిక్ అవుతోంది. చంద్రబాబుకు మద్దతు తెలిపి, ధైర్యం చెప్పడానికి జనసేనాని వెళుతున్నారని సమాచారం. ఇక ప్రత్యేక విమానంలో రాజమండ్రికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్ జైలు అధికారులు ఇచ్చే సమయంలో సెంట్రల్ జైల్లో ములాఖాత్ కానున్నారని అంటున్నారు. చంద్రబాబుతో బాబు ములాఖత్ కు సంబంధించి ఇప్పటికే జైలు అధికారులకు దరఖాస్తు చేశారని తెలుస్తోంది. చంద్రబాబు కుటుంబ సభ్యులను కూడా పవన్ కలిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఈరోజు నాలుగు గంటలకు బాబు తరపు లాయర్ సిద్దార్థ్ లూద్రా జైలులో ములాఖత్ కానున్నారు. మరోపక్క రాజమండ్రిలో అందుబాటులో ఉన్న పార్టీ ముఖ్య నేతలతో లోకేష్ సమావేశం కాగా యువగళం బస్సు నుంచి బయటకు వచ్చిన భువనేశ్వరి, బ్రాహ్మిణి కూడా ఈ భేటీలో పాల్గొన్నట్టు తెలుస్తోంది. జరుగుతున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ పై చర్చ జరిగినట్టు చెబుతున్నారు. ఇక ఇంకో పక్క తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, నారావారిపల్లెలో నారా చంద్రబాబు కోసం గ్రామస్తులు గత మూడు రోజులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. బుధవారం కూడా చంద్రబాబు క్షేమంగా తిరిగి రావాలని గ్రామస్తులు, ఆయన బంధువులు చండీ హోమం చేపట్టారని తెలుస్తోంది.