భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగిస్తోంది. మే 7 రాత్రి పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని 9 ప్రదేశాలలో వైమానిక దాడులు చేసి లష్కరే, జైషే, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసిన తరువాత, భారత సైన్యం ఇప్పుడు సరిహద్దుకు సమీపంలో ఉన్న ఉగ్రవాద లాంచ్ ప్యాడ్‌లను నాశనం చేయడం ప్రారంభించింది. ఉగ్రవాద స్థావరాల ధ్వంసానికి సంబంధించిన కొత్త వీడియోను భారత సైన్యం విడుదల చేసింది. ఈ వీడియో నేపథ్యంలో ‘కదం కదం బధయే జా,…
ఇండియాకు ఇజ్రాయెల్ బాసట.. దాడులు కొనసాగించాలని సూచన! పాకిస్తాన్ పై దాడులు తప్పవని భారత ప్రభుత్వం గత కొన్ని రోజులుగా చెబుతునే వస్తుంది. అన్నట్లుగానే మంగళవారం అర్థరాత్రి పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులకు దిగింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేసింది. ఇక, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులకు ఇజ్రాయెల్ బాసటగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి…
లడఖ్‌లో వెనక్కి తగ్గిన భారత్- చైనా సైన్యాలు, సరిహద్దుల్లో సాధారణ పెట్రోలింగ్, ఇరు దేశాల మధ్య శాంతి యుగానికి నాందిగా ఈ చర్య, దీపావళి సందర్భంగా పరస్పరం స్వీట్లు పంచుకోనున్న సైనిక వర్గాలు లడఖ్‌లో భారత్, చైనా సైన్యాలు వెనక్కి తగ్గాయి. ఇప్పుడు ఇరు దేశాల సైన్యాలు 2020లో ఘర్షణకు ముందు ఉన్న వారి సంప్రదాయ పోస్టుల వద్ద మోహరించి ఉంటాయి. ఇప్పుడు సరిహద్దుల్లో సాధారణ పెట్రోలింగ్ మాత్రమే ఉంటుందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల తేదీలు ప్రకటించారు. భారత్ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల కార్యకలాపాలు తీవ్రంగా ఉంటాయి. ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉన్న పాకిస్థాన్‌కు ఇదంతా ఆమోదయోగ్యంగా లేదు.
జమ్మూ అండ్ కాశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు.. పూంచ్ సెక్టార్‌లో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.. ఇవాళ ఉదయం పూంచ్ సెక్టార్‌లో జవాన్లు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.. ఓ జూనియర్ కమిషన్డ్ అధికారి సహా నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. టెర్రరిస్టుల కోసం ఆర్మీ, స్థానిక పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పూంచ్ సెక్టార్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు సైనిక బృందం వెళ్లిన సమయంలో ఎదురుకాల్పులుకు తెగబడ్డారు ఉగ్రవాదులు.