గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష రద్దుపై కీలక ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు.. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్న వారు కొనసాగుతారని ఆదేశాలు ఇచ్చింది హైకోర్టు డివిజన్ బెంచ్.. ఇక, ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్టు.. కాగా, గ్రూప్-1 పరీక్ష రద్దుపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ లో సవాలు చేసింది ఏపీపీఎస్సీ.. అయితే, తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఉద్యోగులు కొనసగవచ్చని ఏపీ హైకోర్టు పేర్కొంది.
వరుడి బాగోతం బట్టబయలు.. పీటల మీద ఆగిన పెళ్లి..
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని రామళ్లకోటకు చెందిన యువకునికి.. కర్నూలుకి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. కట్నాలు, కానుకలు అన్నీ కుదరడంతో.. రామళ్లకోట టు వెల్దుర్తి రోడ్డులోని బ్రహ్మగుండం క్షేత్రంలో 20వ తేదీన ఉదయం 9గంటలకు పెళ్లికి ముహూర్తం పెట్టారు.. ఇక, బుధవారం ఉదయం పెళ్లి తతంగం ప్రారంభమైంది.. ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు, పెద్దలు, కుటుంబ సభ్యులు ఇలా అంతా పెళ్లి మండపడానికి చేరుకుంటున్నారు.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో మరికొందరు ముందుగానే కలిసి వెళ్లిపోయారు.. ఇక, పెళ్లి పీటల మీదకు చేరుకున్నారు.. వధువు, వరుడు.. ఇదే సమయంలో.. ఓ పిడుగులాంటి వార్త.. చేరింది.. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు పెళ్లి కుమారుడు తనతో సహజీవనం చేస్తున్నాడంటూ.. వైజాగ్ నుంచి కాల్ చేసింది అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఓ వివాహిత.. తనను పెళ్లి చేసుకున్నాడని.. పిల్లాడు కూడా ఉన్నాడంటూ ఫొటోలు పంపించింది.. ఇక, పెళ్లి కుమారుడి బాగోతం బట్టబయలు కావడంతో.. పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లిని ఆపేశారు. ఇక, పెళ్లికుమారుడు మహేంద్రనాయుడు, అతడి కుటుంబ సభ్యులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. విశాఖ పోర్టులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న మహేంద్రనాయుడు.. మరో మహిళతో సహజీవనం చేస్తూ వచ్చాడట.. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలుకుతూ.. తన శారీరక వాంఛలు తీర్చుకున్న అతగాడు.. గుట్టుచప్పుడు కాకుండా మరో పెళ్లికి సిద్ధం కాగా.. ఆ విషయాన్ని తెలుసుకున్న వివాహిత.. ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేసి.. ఆ తర్వాత పెళ్లి కూతురు కుటుంబ సభ్యులకు టచ్‌లోకి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే.. పెళ్లి ఆగిపోవడంతో పెద్ద గొడవే జరిగింది.. గ్రామ పెద్దలు, బంధువులు కలుగజేసుకుని.. పంచాయతీ నిర్వహించి.. వారు ఇచ్చిన కట్నకానుకలతో పాటు కొంత జరిమానా కట్టించేలా ఒప్పించి.. క్షమాపణలు చెప్పి పంపించినట్టుగా తెలుస్తోంది..
మారిన మైలవరం వైసీపీ పరిశీలకుడు.. కారణం అదేనా..?
ఎన్టీఆర్ జిల్లా మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.. మైలవరం నియోజకవర్గానికి చెందిన పార్టీ పరిశీలకుడిని మార్చివేసింది అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో కర్రా హర్షారెడ్డిని నియమించింది వైసీపీ అధిష్టానం.. నియమించి నెలరోజులు పూర్తవ్వకముందే అప్పిడి కిరణ్ కుమార్ రెడ్డి ని పరిశీలకుడి పదవి నుండి తప్పించింది అధిష్టానం.. అయితే, అసలు కిరణ్ కుమార్‌రెడ్డిని ఎందుకు తొలగించారు? అనే చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. ఐ ప్యాక్ టీంతో నియోజకవర్గ కార్యకర్తల గొడవ నేపథ్యంలోనే పరిశీలకుడిని మార్చినట్లు ప్రచారం సాగుతోంది.. అంతేకాదు.. నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్న సర్నాల తిరుపతిరావు యాదవ్ ఫొటోల కంటే పరిశీలకుడైన కిరణ్ కుమార్ రెడ్డి ఫొటోలు పెద్దవి పెట్టుకున్నారట.. ఈ వ్యవహారంలో సోషల్ మీడియా లో పోస్టులు హల్ చల్ చేశాయి.. ఇక, ఐ ప్యాక్ టీం రుగ్వేద ఒక వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో సోషల్ మీడియాలో పార్టీ కార్యకర్త పోస్ట్ పెట్టడం కూడా రచ్చగా మారింది.. ఈ విషయమై ఐ ప్యాక్ టీం నాగేంద్ర , రెడ్డిగూడెం మండల పార్టీ కార్యకర్త మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం.. బూతులు తిట్టుకున్న వ్యవహారానికి సంబంధించిన ఆడియో కూడా వైరల్‌గా మారిపోయిందట.. దీంతో.. దిద్దుబాటు చర్యలు చేపట్టిన వైసీపీ అధిష్టానం.. మైలవరం పరిశీలకుడు అప్పిడి కిరణ్‌కుమార్‌రెడ్డిని మార్చివేసింది.. ఆయన స్థానంలో కర్రా హర్షారెడ్డిని నియమించినట్టు చర్చ సాగుతోంది.
నా పిల్లల మీద ఒట్టు.. కొడాలి నాని, వల్లభనేని వంశీతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు…!
మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌తో నాకు ఎటువంటి సంబంధాలు లేవు అని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్.. పట్టాభిపై, పార్టీ కార్యాలయంపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని నేను ముందే చెప్పాను.. నాకు వంశీ, కొడాలితో సత్సంబంధాలే ఉంటే నేను ఎందుకు చెబుతాను? అని ప్రశ్నించారు. వంశీ, నానితో సంబంధంలేదని నా పిల్లల మీద ప్రమాణాలు చేసి చెబుతున్నాను అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, నారా భువనేశ్వరి మీద వంశీ ఆరోపణలు చేసినప్పుడే సర్వస్వం కోల్పోయావని వంశీకి మెసేజ్ చేశానని గుర్తుచేసుకున్నారు. పార్టీ కోసం పని చేయటమే నాకు తెలుసు.. పని చేయటం రాని వాళ్లు నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు.. పోటీ చేయటం కోసం ఇలాంటి ప్రచారాలు చేయాలా ? అంటూ మండిపడ్డారు. ఇక, పెనమలూరు టీడీపీలో పంచాయతీ కొనసాగుతూనే ఉంది.. ఎన్నికల్లో పోటీపై బోడే ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ టికెట్ నాకే వస్తుందని నమ్ముతున్నానన్న ఆన.. అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని బట్టి.. నేను పోటీ చేసే విషయం ఆధారపడి ఉంటుందన్నారు. బాధలో నేను ఏమన్నా మాట్లాడి ఉంటే అధిష్టానాన్ని క్షమాపణలు కోరుతున్నానన్న బోడే.. నాకంటే బెటర్ అభ్యర్ధి దొరుకుతారని పార్టీ ఐవీఆర్ఎస్ సర్వే చేస్తున్నారని భావిస్తున్నాను.. ఖచ్చితంగా టికెట్ నాకే ప్రకటిస్తారని నా నమ్మకం అన్నారు. అన్నం తినేవాడు ఎవరైనా వైసీపీలో చేరతారా? అని వంశీ అన్నాడు.. నేను వల్లభనేని వంశీతో మాట్లాడటం, కలవటం జరగలేదు అని స్పష్టం చేశారు. ఇది జరిగిందని ఎవరైనా చెబితే దమ్ముంటే వాళ్లు నిరూపించాలి అంటూ సవాల్ చేవారు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్.
ఉత్కంఠకు తెర.. రాజోలు జనసేన అభ్యర్థిగా మాజీ ఐఏఎస్..
గత ఎన్నికల్లో జనసేన పార్టీ ఒకేఒక్క స్థానంలో విజయం సాధించింది.. అదే రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం.. అప్పట్లో విజయం సాధించిన రాపాక వరప్రసాద్.. అక్రమంగా అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతూ వచ్చారు.. ఆ పార్టీలో చేరారు.. ఇప్పుడు ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. అయితే, ఈ సారి రాజోలు నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసేది ఎవరు అనేదానిపై ఉత్కంఠ వీడింది. రాజోలు అభ్యర్థిగా.. మాజీ ఐఎఎస్ దేవ వరప్రసాద్‌ను ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి దేవ వరప్రసాద్ ను ప్రకటించడంతో రాజోలు ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.. ఇక, దేవ వరప్రసాద్ స్వగ్రామం మలికిపురం మండలం దిండి గ్రామం. అయితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు సార్లు ఓడి పోయి జనసేన పార్టీలో చేరిన బొంతు రాజేశ్వరరావు నిన్నటివరకు రాజోలు టికెట్ వస్తుందని ఆశించారు.. ఇప్పుడు దేవా వరప్రసాద్‌ను జనసేన అభ్యర్థిగా ప్రకటించడంతో.. బొంతు వర్గం నిరాశలో ఉంది.
పవన్ నన్ను మంత్రిని చేస్తాను అన్నారు.. ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సంచలన ఆరోపణలు చేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ పితాని బాలకృష్ణ.. పవన్ కల్యాణ్‌ను కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను… కానీ, ఎలాంటి రెస్పాన్స్ రావడంలేదన్నారు.. నన్ను మంత్రి చేస్తాను అన్నారు.. కానీ, ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ అన్ని కులాలకు ఆవకాశమిచ్చారు.. కానీ, శెట్టి బలిజలకు ఎందుకు ప్రాధాన్యత లేదు? అని ప్రశ్నించారు.. నాకు సరైన హామీ ఇవ్వకుండా ఎలా పని చేయగలను అంటూ నిలదీశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తో పాటు అన్ని పార్టీలు నన్ను తమ పార్టీలోకి రావాలని అడుగుతున్నారని తెలిపారు. అయితే, పవన్ కల్యాణ్‌ను కలిసే అవకాశం వస్తే.. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటాను అని ప్రకటించారు ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ పితాని బాలకృష్ణ. కాగా, ఈ మధ్యే సమావేశం నిర్వహించిన పితాని బాలకృష్ణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్న విషయం విదితమే.. నేను, మీరు ఒక్కటే అనుకున్నాను.. కానీ, నాకు సీటు కేటాయించకపోవడం బాధ కలిగించిందన్నారు. అయితే, గత ఎన్నికల్లో పితాని బాలకృష్ణనే తొలి అభ్యర్థిగా ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కానీ, ఇప్పుడు సీటు కేటాయించకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పితాని.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ్ముడు అరెస్ట్.. కాసేపట్లో పోలీస్ కస్టడీకి మధుసూదన్ రెడ్డి
పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డిని కాసేపట్లో పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఇల్లిగల్ మైనింగ్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఈ నెల 15న అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో మధుసూదన్ రెడ్డికి 14 రోజుల పాటు జిల్లా కోర్టు రిమాండ్ విధించింది. నేటి నుంచి మూడ్రోజుల పాటు కస్టడీలోకి అతడ్ని తీసుకోనున్నారు. ఈ విచారణలో మధుసూదన్ రెడ్డి స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డు చేయనున్నారు. అయితే, అక్రమ మైనింగ్ కేసులో పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధుసూదన్ రెడ్డికి చెందిన ‘సంతోష్ సాండ్ మైనింగ్’ కంపెనీ అనుమతులకు మించి ప్రభుత్వ భూముల్లో మైనింగ్ చేయడంతో పాటు లీజ్ అగ్రిమెంట్ ముగిసిన రెన్యువల్ చేయించలేదని కలెక్టర్ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘స్పెషల్ టాస్కో ఫోర్స్’ తెలిపింది. ఇక, కమిటీ ఇచ్చిన నివేదికల ప్రకారం పటాన్ చెరు పరిధిలోని లక్డారం, రుద్రారం, చిట్కుల్ గ్రామాలలో ఐదు మైనింగ్ సంస్థలు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించి గత నెల 22న వాటిని అప్పటి ఆర్డీవో రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీజ్ చేయగా.. అందులో ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ సాండ్ మైనింగ్ కంపెనీ కూడా ఉన్నది. దీనిపై పటాన్ చెరు తహసీల్దార్ రంగారావు ఇచ్చిన ఫిర్యాదుతో శుక్రవారం ( మార్చ్ 15వ తేదీన) నాడు ఉదయం పోలీసులు మధుసూదన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇక, విషయం తెలుసుకున్న మధు అనుచరులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకొని వీరంగం సృష్టించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పోలీసుల వెహికిల్స్ పై రాళ్లు కూడా రువ్వారు.
బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్లపై విచారణ జరపాలి..
బీజేపీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ పై విచారణ జరిపించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యరాలు సోనియా గాంధీ డిమాండ్ చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బయటపడ్డ సమాచారంపై విచారణ జరగాల్సిందే అని అన్నారు. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బీజేపీకి 56 శాతం నిధులు వస్తే.. కాంగ్రెస్‌కు 11 శాతం ఫండ్స్ మాత్రమే వచ్చాయని తెలిపారు. బీజేపీకి వేల కోట్ల రుపాయాల ఎలక్టోరల్ బాండ్లు ఎలా వచ్చాయని ఆమె క్వశ్చన్ చేశారు. అక్రమంగా కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేశారు.. కేంద్ర ప్రభుత్వ తీరును సోనియా గాంధీ తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బ తీసేందుకు మోడీ సర్కార్ కుట్ర చేస్తుందని సోనియా గాంధీ అన్నారు.
మెదడులోని చిప్ సాయంతో చెస్ ఆడిన పక్షవాతం సోకిన వ్యక్తి..!
2016లో ఎలన్ మస్క్ బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ ‘న్యూరాలింక్’ ను సంగతి తెలిసిందే. అంగవైకల్యం వ్యక్తులు ప్రపంచంతో సంభాషించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈ స్టార్టప్ కంపెనీ.. న్యూరాలింక్. ఈ కంపెనీ తయారు చేసిన బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ చిప్ ను వైకల్యం పొందుతున్న రోగి మెదడులో అమర్చే ప్రయోగాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే.. కాళ్లు చేతులు పక్షవాతానికి (క్వాడ్రిప్లెజియా) గురైన పేషెంట్ నోలన్ అర్బాగ్ అనే వ్యక్తిలో తొలి న్యూరాలింక్ చిప్ ను అమర్చారు. ఈ ప్రాజెక్టులో తాను భాగం అవ్వడం తన అదృష్టమని ఆయన సంతోషం వ్యక్తం అర్బాగ్. ఈయన ప్రపంచంలోని మొట్టమొదటి న్యూరాలింక్ చిప్ అమర్చిన వ్యక్తి. ప్రపంచంలోని మొట్టమొదటి న్యూరాలింక్ చిప్ అమర్చిన వ్యక్తి.. ఇప్పుడు తన ఆలోచనల ద్వారా కంప్యూటర్ ను నియంత్రించగలడని, అలాగే ఆలోచనల ద్వారా వీడియో గేమ్ లు ఆడగలడని ఎలన్ మస్క్ పేర్కొన్నారు. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఇకపై ప్రమాదాలతో శరీర భాగాలు పని చేయకుండా మంచానికే పరిమితమైన వారు, పక్షవాతంలో శరీర భాగాలు పని చేయకుండా మంచానికే పరిమితం అయిన వాళ్లకు కూడా న్యూరాలింక్ పని చేస్తుందని మస్క్ ప్రకటించారు.
చెన్నై vs బెంగళూరు.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ సీజన్ మరి కొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్ మార్చి 22న చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందుకు కారణం ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలే. ఏడాది తర్వాత ధోనీ, రెండు నెలల విరామం అనంతరం విరాట్ బరిలోకి దిగి అభిమానులను అలరించనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఓసారి పరిశీలిస్తే.. సీఎస్‌కేదే పైచేయిగా ఉంది. సీఎస్‌కే, ఆర్‌సీబీ జట్లు ఐపీఎల్ టోర్నీలో ఇప్పటివరకు 31 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో చెన్నై 20 మ్యాచ్‌లు గెలిస్తే.. బెంగళూరు 10 మ్యాచ్‌ల్లో గెలిచింది. ఓ మ్యాచ్‌లో ఫలితం రాలేదు. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఇరు జట్లు ఎనిమిది సార్లు తలపడ్డాయి. ఇందులో ఆర్‌సీబీ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. మిగిలిన 9 మ్యాచ్‌లలో సీఎస్‌కేదే విజయం. 2008లో చెపాక్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేని ఆర్‌సీబీ ఓడించింది.
ఫ్రీ స్ట్రీమింగ్.. ఓటీటీలో రిలీజైన తెలుగు కామెడీ వెబ్‌సిరీస్ తులసివనం..!
యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు కామెడీ వెబ్‌సిరీస్ తులసివనం. ఈ సిరీస్ గురువారం నుంచి ఓటీటీలోకి వచ్చేసింది. ఈటీవీ విన్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సిరీస్ సంబంధించి మొదటి ఎపిసోడ్‌ను ఫ్రీగా చూడొచ్చొని ఓటీటీ సంస్థ ప్రకటించింది. ఈ సిరీస్ సంబంధించి మొత్తం మూడు ఎపిసోడ్స్‌ను మాత్రమే రిలీజ్ చేసారు చిత్ర బృందం. సిరీస్ లోని మిగితా ఎపిసోడ్స్ త్వరలోనే రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సిరీస్ లోనటీనటుల విషయానికి వస్తే.. అక్షయ్ లగుసాని, ఐశ్వర్య హోలక్కల్, వెంకటేష్ కాకుమాను, టాక్సీవాలా విష్ణులు కీలక పాత్రలు పోషించారు. ఇక కథ విషయానికి వస్తే.. తులసి అనే ఓ యువకుడి జీవితంలో జరిగిన కొన్ని చిత్రవిచిత్ర సంఘటనలతో దర్శకుడు అనిల్ రెడ్డి ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించాడు. ఐఏఎస్ ఆఫీసర్ గా తులసిని చూడాలని తండ్రి కోరుకుంటాడు. కానీ అతను మాత్రం క్రికెటర్ అవ్వాలని కలలు కంటాడు.
హనుమాన్ కు తొలి అవార్డును అందుకున్న ప్రశాంత్ వర్మ..
టాలీవుడ్లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో హనుమాన్ కూడా ఒకటి.. ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుందో తెలిసిందే.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు.. ఇప్పుడు అవార్డును తాజాగా అవార్డును కూడా సొంతం చేసుకుంది.. ఈ సినిమాకు తొలి అవార్డును అందుకున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.. ఈ హనుమాన్ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.350 కోట్లకి పైగా వసూళ్లు సాధించి భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు ఇటీవల ఓటీటీలో అడుగుపెట్టిన హనుమాన్ అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.. భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది.. ఇక హనుమాన్ కు బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు రావడంతో డైరెక్టర్ ఆనందం రెట్టింపు అయ్యింది.. ఈ విషయాన్ని డైరెక్టర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.. హనుమాన్ సినిమాకి తొలి అవార్డు అందుకున్నాను. థాంక్యూ రేడియో సిటీ అంటూ పోస్ట్ పెట్టారు ప్రశాంత్ వర్మ. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ప్రశాంత్ వర్మకి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.. మున్ముందు ఇంకా అవార్డులను అందుకుంటారని కామెంట్స్ పెడుతున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆక్టోపస్ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తుంది.. ఈ సినిమా తర్వాత జై హనుమాన్ సినిమా చేయబోతున్నాడు..
ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యని స్టార్ హీరోలు వీళ్లే…
ఈమధ్య సీక్వెల్ సినిమాలతో పాటుగా రీమేక్ సినిమాలు కూడా ఎక్కువయ్యాయి.. ఒక ఇండస్ట్రీలో ఒక హీరో సినిమా సూపర్ హిట్ అయితే ఆ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకోవడం వెంటనే సినిమాను రీమేక్ చేస్తున్నారు.. ఇప్పటివరకు చాలా సినిమాలు రీమేక్ అయ్యాయి.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు సైతం రీమేక్ సినిమాలను చేసి హిట్ కొట్టారు.. అందులో కొందరు హీరోలు ఇంతవరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యలేదు వారేవ్వరో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం స్టార్ ఇమేజ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, కమల్ హాసన్, విజయ్ దళపతి, రజినీకాంత్ మొదలుకొని చాలా మంది హీరోలు రీమేక్ సినిమాల్లో నటించి భారీ హిట్ ను అందుకున్నారు.. కానీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యలేదు.. ఆయన ఇప్పటివరకు 28 సినిమాలు చేశారు.. అందులో అన్ని కూడా కొత్తగా చేసినవే.. మహేష్ సినిమాలు రీమేక్ అయ్యాయన్న సంగతి తెలిసిందే.. గతంలో దళపతి విజయ్ కత్తి మూవీని తెలుగులో రీమేక్ చేసే ఛాన్స్ మహేష్‌బాబుకు వచ్చింది.. కానీ నో చెప్పాడు.. అలాగే రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా రీమేక్ సినిమాలకు దూరంగా ఉన్నారు.. పెళ్లిచూపులుతో హీరోగా మారిన విజయ్ దేవరకొండ అన్ని కొత్త కథలతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు కానీ ఇప్పటివరకు ఒక్క రీమేక్ జోలికి వెళ్ళలేదు.. హీరో దుల్కర్ సల్మాన్ ఈయన 45 సినిమాలు చేశాడు.. అందులో ఒక్కటి కూడా రీమేక్ చెయ్యలేదు.. కొత్త కథలతో విభిన్న పాత్రలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు.. రక్షిత్ శెట్టి కూడా ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యలేదు.. 14 ఏళ్ల కెరీర్‌లో అన్ని స్ట్రెయిట్ సినిమాలే చేశాడు.. వీరంతా ఇప్పటివరకు ఒక్క రీమేక్ సినిమా కూడా చెయ్యలేదు..