Richest States: 2023-24లో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GDSP), తలసరి స్థూల దేశీయోత్పత్తి (GDP) ఆధారంగా భారతదేశంలోని 10 సంపన్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. ప్రముఖ సంస్థ నివేదిక ప్రకారం, భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండడంలో రాష్ట్రాలకు ప్రత్యేక సహకారం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఆర్థికంగా బలంగా ఉన్నాయి. మరి అవేంటో ఒకసారి చూద్దామా..
Viral Video: అమెరికాలో వెయిటర్ ఉద్యోగాల కోసం నిరుద్యోగుల క్యూ.. భారతీయులు కూడా!
భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో ఒక జాతీయ రాజధాని ప్రాంతం (NCT) ఉంది. ఇక ధనిక రాష్ట్రాల్లో మహారాష్ట్ర టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత రెండో స్థానంలో తమిళనాడు, మూడో స్థానంలో కర్ణాటక, నాలుగో స్థానంలో గుజరాత్, ఐదో స్థానంలో ఉత్తరప్రదేశ్ లు ఉండగా.. పశ్చిమ బెంగాల్ ఆరో స్థానంలో, రాజస్థాన్ ఏడవ స్థానంలో, తెలంగాణ ఎనిమిదో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ తొమ్మిదో స్థానంలో, మధ్యప్రదేశ్ పదో స్థానంలో ఉన్నాయి.
Iran Israel War: హిజ్బుల్లా నాయకుల సమావేశంపై దాడి.. నస్రల్లా వారసుడు సఫీద్దీన్ హతం?
ఇకపోతే, మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండటానికి ప్రధాన కారణం అది బాలీవుడ్‌కు కేంద్రంగా ఉండడం అలాగే ఎంతోమంది పారిశ్రామికవేత్తలకు బలమైన కోటగా ఉండడమే. ఓ నివేదిక ప్రకారం S&P గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ నుండి వచ్చిన అంచనాలు 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి భారతదేశ GDP దాదాపు రెండింతలు 7 ట్రిలియన్ల డాలర్స్ కు పైగా పెరుగుతుందని సూచిస్తున్నాయి. అంచనాల ప్రకారం, భారతదేశం 2030-31 ఆర్థిక సంవత్సరం నాటికి ఎగువ మధ్యతరగతి ఆదాయ స్థితిని సాధించడానికి ట్రాక్‌లో ఉందని, ఇది అంచనా వేసిన వార్షిక వృద్ధి రేటు 6.7 శాతంగా కొనసాగుతుందని తెలిపింది. స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో భారతదేశ GDP వృద్ధి చెందుతుంది.