రేపు మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇక్కడి పార్టీల భవిష్యత్తును ఓటర్లు తేల్చనున్నారు. ఎవరు గెలుస్తారన్న సర్వేలు చెప్పిన.. ఓటర్లు మాత్రం ఎవ్వరి వైపు మొగ్గుచూపుతారు అనేది తెలియాల్సి ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ పలు పార్టీలు ఎన్నికల పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యనే తీవ్రమైన పోటీ కొనసాగుతుంది. మధ్యప్రదేశ్ లో బీఎస్పీ, సమాజ్ వాద్ పార్టీ, కమ్యూనిస్టులు కూడా బరిలో నిలిచారు.
Read Also: Kajol Deep Fake Video: వైరల్ అవుతున్న హీరోయిన్ కాజోల్ న్యూడ్ వీడియో
ఇక, మధ్యప్రదేశ్ లో 5.6 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 22.36 మంది తొలిసారి తమ ఓటు హక్కును వేయనున్నారు. ఇక్కడ మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని దాదాపు ఎన్నికల సర్వేలు వెల్లడించాయి. 20 ఏళ్ళుగా మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే ప్రస్తుతం బీజేపీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరికేత ఉన్నట్టు సమాచారం. దానికి తోడు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి హస్తం పార్టీ ఎమ్మెల్యేల్ని లాక్కోవడంతో కాషాయ పార్టీకి ప్రతికూలంగా మారింది. ఇక, ఈసారి ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ గట్టి పట్టుదలతో కనబడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓట్లను నమ్ముకుని ఎన్నికల బరిలోకి దిగుతోంది. అయితే, ఎస్సీ, ఎస్టీలు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉంటున్నారు. కులాల సర్వే హామీతో ఓబీసీ ఓట్లు తమకు పడతాయని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది.
Read Also: Bryan Johnson: వామ్మో.. కొడుకు బ్లడ్ ఎక్కించుకుంటే తండ్రి వయసు తగ్గిందా..?
మరో వైపు, ఛత్తీస్ ఘడ్ లో ఇప్పుడు రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 7న తొలి విడతగా 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పుడు మరో 70 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్ జరగబోతుంది. రెండో విడతలో మొత్తం 958 అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1.63 కోట్ల ఓటర్లు రేపు (శుక్రవారం) వీరి భవితవ్యం తేల్చనున్నారు. ఇక, మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. కానీ బీజేపీ మాత్రం అధికార పార్టీపై అవినీతి ఆరోపణలు చేస్తుంది. అయితే ఛత్తీస్ ఘడ్ లో రాహుల్ గాంధీ, సీఎం భూపేశ్ బఘేల్, ప్రియాంక గాంధీలు సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బీజేపీ పార్టీ తరపున అమిత్ షా, జేపీ నడ్డా, హిమంత బిశ్వశర్మ, అనురాగ్ ఠాకూర్‌తో పాటు ఇతర నేతలు ప్రచారం చేశారు.