ఈరోజుల్లో టమోటా ధరలు బంగారంతో పోటి పడుతున్న సంగతి తెలిసిందే.. ప్రతి రైతు కూడా ఈ పంటను వెయ్యాలని ఆసక్తి చూపిస్తున్నారు.. టమాటా ధరలు రోజురోజుకు పెరిగిపోతు సామాన్యూడికి చుక్కులు చూపిస్తున్నాయి. ఇంట్లో టమాటాలతో వంట చేసుకోవడం ఖరీదైనదిగా మారిపోయింది.. ఎందుకంటే టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్నటి వరకు మార్కెట్లో టమాటా ధర 50రూ ఉండగా, ప్రసుత్తం టమాటా ధర 120 నుంచి 150 వరకు పలుకుతుంది. ఇందుకు గల ప్రధాన కారణం ఆకాల వర్షాలు వల్లన పంట రాలిపోయి, దిగుబడులు రాక వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు.. దాంతో ధరలు పెరిగిపోతున్నాయి..
ఏపీలో ని కొన్ని ప్రాంతాల్లో టమోటా పంటను పండిస్తున్నారు.. ఆకాల వర్షాలు వల్లన పంట దిగుబడి తగ్గిపోయింది.. సరాఫరా తగ్గడంతో మార్కెట్లో ఉన్న టమాటా ధర ఒకేసారి పెరిగి పోయింది… దాంతో ప్రభుత్వం కూడా రైతులను టమోటాను పండించాలని కోరుతున్నారు.. మరి టమోటా పంటను పందించడానికి ఏ సమయం సరైనదో ఇప్పుడు తెలుసుకుందాం..
టమాటాలో మంచి దిగుబడులు సాధించాలి అంటే మార్చి చివరి వారంలో నారు పోసుకోవాలి. ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు కాపు రావడం మొదలవుతుంది. అప్పుడు మనకు మంచి రేటు దక్కుతుంది.. అలాగే ఎండాకాలం లో పంట రావాలంటే డిసెంబర్ లో గాని, జనవరి లోని నారు పోసుకుంటే ఏప్రిల్ కి కాపు రావడం మొదలవుతుంది.. అప్పుడు మార్కెటుకు తీసుకొని వెళ్లితే మంచి లాభాలు వస్తాయి.. ఇప్పుడు నారు పోసుకోవడం మంచిదే.. ఇప్పుడు పంటను వేస్తె భారీ వర్షాలు పడతాయని అనుకుంటారు. మీ కాలంలో పంటను వేసే రైతులు స్కెటింగ్ పద్ధతిలో వెయ్యడం మంచిది.. ఈపద్దతిని మనం పాటించినట్లతే ఏకాలంలో అయినా దిగుబడులను తీయవచ్చు.. ఈ పంటను ఎప్పుడూ పడితే అప్పుడు కాకుండా ఒక సమయం లో వెయ్యడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఈ పంట గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే వ్యవసాయ నిపుణులను అడిగి తెలుసుకోవడం మంచిది..