Tollywood Visual Effects: టాలీవుడ్ సినిమాల లెవెల్ రోజురోజుకి తారాస్థాయికి చేరుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇందులో భాగంగా.. సినిమా మేకింగ్ లో కొత్త టెక్నాలజీస్ ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా మూవీలలో ‘గ్రాఫిక్స్’ ప్రేక్షకుల కోసం భారీ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో సమస్యలూ కూడా లేకపోలేదు. అందుకే మేకర్స్ ఈ సిచ్యువేషన్‌ను ఎదుర్కోవడానికి కొత్త మార్గాలను వెతుకుతున్నారు. ఈ మధ్య సినిమాలను గమనిస్తే.. భారీ చిత్రాలు చెప్పిన టైంలో ప్రేక్షకులు ముందుకు రావడం కష్టం అవుతుంది. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న పాన్-ఇండియా సినిమాల రీసెంట్ రిలీజ్లు గ్రాఫిక్స్ ఆలస్యాల కారణంగా వాయిదా పడడం సాధారణంగా మారింది.
Mana Shankara Varaprasad: మెగా మూవీ సెట్ లోకి అడుగుపెట్టబోతున్న విక్టరీ వెంకటేష్..!
ప్రస్తుతం సినిమాలలో విజువల్ ఎఫెక్ట్స్ కీ రోల్ ప్లే చేస్తూ.. ఇండియన్ సినిమాను గ్లోబల్ రేంజ్‌కి తీసుకెళ్తున్నాయి. ముఖ్యంగా పీరియాడిక్, హిస్టారికల్ సినిమాల్లో గ్రాఫిక్స్ మరింత కీలకంగా మారుతోంది. మేకర్స్ ఈ క్రాఫ్ట్‌పై ఎక్కువ టైం కేటాయిస్తూ భారీగా ఖర్చులు పెట్టుతున్నారు. అయితే కొంతమంది మేకర్స్ ఈ పరిస్థితిని తక్కువ బడ్జెట్లో బెస్ట్ క్వాలిటీ అవుట్‌పుట్ ఇవ్వడం ద్వారా ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు. ‘మిరాయి’ వంటి సక్సెస్ స్టోరీస్ టాలీవుడ్‌కు కొత్త దిశను చూపించాయని అనవచ్చు. ఇదివరకు ‘హనుమాన్’ సినిమా కూడా అంతే. ఈ నేపథ్యంలో పాత గ్రాఫిక్స్ టీమ్స్ స్థానంలో కొత్త టీమ్స్ ఎంపిక చేయడం, బడ్జెట్ లెక్కలలో సవరణలు చేయడం జరుగుతోంది. ఇలా రాబోయే సినిమాల్లో గ్రాఫిక్స్ విషయంలో కొత్త ట్రెండ్ ఏర్పడుతోంది. చివరికి ఈ ఫార్ములా అన్ని సినిమాలకు వర్క్ అవుతుందా అనే సందేహం మాత్రం కొనసాగుతూనే ఉంది.
Tollywood Movie Shootings: వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా స్టార్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే?