Mana Shankara Varaprasad: మెగా మూవీ సెట్ లోకి అడుగుపెట్టబోతున్న విక్టరీ వెంకటేష్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mana Shankara Varaprasad: టాలీవుడ్‌లో తనదైన శైలిలో కామెడీ, ఎమోషన్ మేళవించి ప్రేక్షకులను మెప్పించిన సూపర్‌హిట్ దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో కలిసి “మన శంకర వరప్రసాద్ గారు” అనే టైటిల్ తో ఒక కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా వస్తుందన్న వార్తతోనే ఫ్యాన్స్ ఉత్సాహంలో మునిగిపోయారు. వెంకటేష్‌తో 100 కోట్ల క్లబ్‌లో చేరిన అనిల్.. ఈసారి చిరుతో మరింత భారీ సక్సెస్ అందుకోవడం ఖాయమని మెగా అభిమానులు నమ్ముతున్నారు.
Tollywood Movie Shootings: వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా స్టార్స్.. ఎవరి షూటింగ్ ఎక్కడ జరుగుతుందంటే?
Also Read
ఇకపోతే ఫిలిం సర్కిల్స్‌లో ఈ సినిమా గురించి మరో సెన్సేషనల్ అప్డేట్ హల్‌చల్ చేస్తోంది. అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్లు ఇచ్చిన విక్టరీ వెంకటేష్, ఇప్పుడు చిరు సినిమాలోనూ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ వార్త చాలా రోజులుగా చర్చనీయాంశమవుతున్నా.. వెంకటేష్ షూటింగ్‌లో పాల్గొనకపోవడంతో కొంత అనుమానం నెలకొంది. అయితే ఇప్పుడు ఆ సందేహాలన్నిటికీ చెక్ పెడుతూ వెంకటేష్ అక్టోబర్ 21 నుంచి మెగాస్టార్‌తో కలిసి షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఫన్‌తో పాటు ఎమోషన్ కలబోసిన పాత్రలో వెంకటేష్ కనిపించబోతున్నారని మేకర్స్ చెబుతున్నారు. దీంతో చిరు, వెంకీ కాంబినేషన్ మళ్లీ తెరపై చూడబోతున్న అభిమానులు సూపర్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. మొత్తానికి, మన శంకర వరప్రసాద్ గారు చిత్రం టాలీవుడ్‌లో సంక్రాంతి బరిలో భారీ సంచలనాన్ని సృష్టించబోతుందనే నమ్మకం పెరుగుతోంది.
Bollywood : దీపావళి రేస్ లో రష్మిక సినిమాకు పోటీగా వస్తున్న హర్షవర్థన్ రాణే
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!