Tollywood Diwali Clash: దీపావళి ధమాకా.. మూడు రోజుల్లో నలుగురు యంగ్ హీరోల భవితవ్యం.. టాలీవుడ్‌లో గట్టి పోటీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood Diwali Clash: టాలీవుడ్ లో పెద్ద సినిమాలు ప్రస్తుతం ఏవీ లేకపోవడంతో.. ఈసారి దీపావళి సందడిని యంగ్ హీరోలు ముందే తీసుకొస్తున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఏకంగా నలుగురు యువ కథానాయకులు తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద బరిలో దిగుతుండటంతో ఈ పండుగ పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. దీపావళి సెలబ్రేషన్స్‌ను టాలీవుడ్ గురువారం నుంచే మొదలుపెట్టింది. ఈ సీజన్‌లో అందరికంటే ముందుగా బరిలో దిగుతున్నది ‘మిత్ర మండలి’ టీమ్. ప్రియదర్శి హీరోగా, కొత్త దర్శకుడు విజయేందర్ రూపొందించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే సినిమాకు రూ.4 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ తోడవుతే భారీ లాభాలు రావడం ఖాయం.
Sai Dharam Tej: ‘సంబరాల ఏటిగట్టు’తో మెగా హీరో లైన్ లో పడినట్లేనా.?
Also Read
- Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
- Tirumala Tirupati: తిరుమలలో ఎల్‌నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
- Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
- Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
ఇకపోతే నేడు (శుక్రవారం) ఇద్దరు యంగ్ హీరోలు ఒకే రోజు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ సినిమాతో, ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాతో ఒకేసారి బరిలో దిగుతున్నారు. ఈ రెండు సినిమాల్లోనూ టాలీవుడ్ ప్రేక్షకులు ‘తెలుసు కదా’ మీద కాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు కనపడుతోంది. దీపావళి బరిలో రిలీజ్ అవుతున్న సినిమాల్లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమా కూడా ‘తెలుసు కదా’ నే. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రూ.17 కోట్ల మార్కును దాటింది. మరోవైపు, ‘లవ్ టుడే’, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఇక ఈ పోటీలో టాలీవుడ్ మరో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా శనివారం ‘K – ర్యాంప్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దీనితో మొత్తం మీద, మూడు రోజుల్లో నాలుగు సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది. మరి ఈ సినిమాల్లో ఏది హిట్ సౌండ్ చేస్తుందో, ఏ హీరో ఈ దీపావళి విజేతగా నిలుస్తారో చూడాలి మరి.
Kiran Abbavaram: నన్ను నమ్మండి.. ‘కె-ర్యాంప్’పై కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
-
PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
-
Tirumala Tirupati: తిరుమలలో ఎల్‌నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
-
Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
-
Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!