Today Stock Market Roundup 24-03-23: ఈ వారాంతం రోజున.. అంటే.. ఇవాళ.. శుక్రవారం.. ఇండియన్ స్టాక్ మార్కెట్ పేలవమైన ప్రదర్శన చేసింది. రెండు కీలక సూచీలు ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. సాయంత్రం కూడా భారీ నష్టాలతోనే ఎండ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వెలువడటం మైనస్‌గా మారింది.
కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ బిల్లు-2023లో చేసిన సవరణలు ఈక్విటీ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. అమెరికా ఇండెక్స్ ఫ్యూచర్స్‌లో అమ్మకాలు మరియు బ్రిటన్ కేంద్ర బ్యాంక్ వడ్డీ రేట్లను పావు శాతం పెంచటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ని దెబ్బతీసింది. సెన్సెక్స్ 398 పాయింట్లు కోల్పోయి 57 వేల 527 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 131 పాయింట్లు తగ్గి 16 వేల 945 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
read more: Satya Nadella, GMR: సత్య నాదెళ్ల కొత్త ఇన్నింగ్స్. జీఎంఆర్‌తోపాటు మరింత మంది
బీఎస్‌ఈలోని మొత్తం 30 కంపెనీల్లో 5 కంపెనీలు మాత్రమే మంచి పనితీరు కనబరిచాయి. మిగతా 25 సంస్థలు వెనకబడ్డాయి. సెన్సెక్స్‌లో కొటక్ బ్యాంక్, ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా, పవర్‌గ్రిడ్ లాభాలు ఆర్జించగా.. విప్రో, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నష్టాల బాట పట్టాయి. నిఫ్టీలో సిప్లా, కొటక్ బ్యాంక్, అపోలో షేర్ల విలువ పెరగ్గా.. బజాజ్ ట్విన్స్, మెట్ షేర్ల వ్యాల్యూ తగ్గింది.
రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ బాగానే రాణించింది. ఒక శాతానికి పైగా పెరిగింది. కానీ.. నిఫ్టీ మీడియా, నిఫ్టీ మెటల్ సూచీలు ఒక శాతానికి పైగా తగ్గిపోయాయి. వ్యక్తిగత షేర్లను పరిశీలిస్తే.. క్యాంపస్ యాక్టివ్‌వేర్ కంపెనీ స్టాక్స్ వ్యాల్యూ 7 శాతం పతనమైంది. అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. 10 గ్రాముల బంగారం రేటు అతిస్వల్పంగా 30 రూపాయలు పెరిగింది.
అత్యధికంగా 59 వేల 595 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 291 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 70 వేల 503 రూపాయలు పలికింది. క్రూడాయిల్ రేటు 150 రూపాయలు తగ్గింది. ఒక బ్యారెల్ ముడిచమురు 5 వేల 640 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 2 పైసలు కోల్పోయింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 24 పైసల వద్ద స్థిరపడింది.