Today Stock Market Roundup 11-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా రెండో రోజు లాభాలతో ప్రారంభమై లాభాలతో ముగిసింది. మొత్తమ్మీద వరుసగా ఏడో రోజు లాభాలను సొంతం చేసుకుంది. ఇవాళ మంగళవారం ఉదయం నుంచే ఈక్విటీ మార్కెట్‌లో జోష్ కనిపించింది.
read more: World Worst Currency no-3: ప్రపంచంలోనే 3వ అతి చెత్త కరెన్సీగా రూబుల్
అంతర్జాతీయ మార్కెట్ నుంచి అనుకూల సంకేతాలు వెలువడటంతో ఎర్లీ ట్రేడింగ్‌లోనే సెన్సెక్స్ 60 వేల బెంచ్‌మార్క్‌ని దాటింది. ఇంట్రాడేలో కూడా ఇలాంటి సానుకూల వాతావరణమే కనిపించటంతో సాయంత్రం వరకు ఇన్వెస్టర్లలో ఉత్సాహం కొనసాగింది. సంస్థల క్యూ4 ఫలితాలు వెలువడే తరుణంలో షేర్ బిజినెస్ జోరుగా సాగుతోంది.
సెన్సెక్స్ 311 పాయింట్లు లాభపడి 60 వేల 157 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 17 వేల 722 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. సెన్సెక్స్‌లోని మొత్తం 30 కంపెనీల్లో 20 కంపెనీలు మంచి పనితీరు కనబరచగా మిగతా పది కంపెనీలు నేలచూపులు చూశాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఐటీసీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ బాగా రాణించాయి. బీఎస్ఈలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహింద్రా వెనకబడ్డాయి.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో కొటక్ బ్యాంక్ నాలుగున్నర శాతానికి పైగా.. జేఎస్‌డబ్ల్యూ నాలుగు శాతం.. లాభపడగా.. టీసీఎస్ మరియు ఇన్ఫోసిస్ 2 శాతం దాక పడిపోయాయి. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్.. వీఎస్ఎస్ఎల్ షేర్ వ్యాల్యూ మూడేళ్లలో ఏకంగా 900 శాతం పెరిగింది.
10 గ్రాముల బంగారం ధర 456 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 60 వేల 519 రూపాయలుగా ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 649 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 74 వేల 972 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర నామమాత్రంగా 16 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 584 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 13 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 14 పైసల వద్ద స్థిరపడింది.