TS Assembly: తెలంగాణ అసెంబ్లీకి నేడు చివరి రోజు.. కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఇవాళ్టితో ( ఆదివారం ) ముగియనున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలు కేసీఆర్ సర్కార్ కు చివరివి. మరో మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇక, చివరి రోజైన ఈ రోజు సీఎం కేసీఆర్ ప్రసంగం చేయనున్నారు. ఎన్నికలు రానున్నందున కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారనే దానిపై ఉత్కంఠ నెలకొనింది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల చూపు ఈ ప్రసంగంపైనే ఉంది. ఐఆర్, పీఆర్సీ లాంటి వాటిపై కేసీఆర్ కీలక ప్రకటన చేస్తారని వారు ఎదురు చూస్తున్నారు. అంతేకాక, ఎన్నికలు ఉన్నందున సంక్షేమ పథకాల విషయంలోనూ కేసీఆర్ మరిన్ని ప్రకటనలు చేస్తారనే సమాచారం.
Read Also: What Today: ఈరోజు ఏమున్నాయంటే..?
Also Read
- Strait of Hormuz: అమెరికా మ్యాప్‌లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
- Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్‌లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
- Meta: మెటాకు భారీ షాక్.. ఫేస్బుక్, ఇన్‌స్టా వ్యసనంపై రూ.133 లక్షల కోట్ల కేసు!
- No Number Plate, No Fuel: నంబర్ ప్లేట్ లేకపోతే నో ఫ్యూయల్.. సంచలన నిర్ణయం.. వెంటనే అమల్లోకి..!
ఇవాళ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. శాసన సభలో మొదట జీరో అవర్ జరుగనుంది. తర్వాత మంత్రి హరీశ్ రావు కాగ్ రిపోర్టును సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈరోజే మరో 5 ప్రభుత్వ బిల్లులు కూడా అసెంబ్లీలో సర్కార్ ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం 9 ఏళ్ల తెలంగాణలో అభివృద్ధి పై స్వల్పకాలిక చర్చ జరుగనుంది. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీకి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. తెలంగాణలో అభివృద్ధిపై జరిగిన స్వల్ప కాలిక చర్చలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. దాదాపు 2 గంటల పాటు సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారని తెలుస్తోంది. అయితే, ఈ రోజు సభలో ప్రభుత్వం ఐదు ప్రభుత్వ బిల్లులు ( కౌన్సిల్ లో) ప్రవేశపెట్టనుంది. ఇక ఇవాళ్టి సభలో ఆర్టీసీ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టడం లేదు.
Read Also: Railway Track: రైల్వే ట్రాక్‌పై రాళ్లను ఎందుకు ఉంచుతారు.. దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో తెలుసా?
తాజావార్తలు
-
Strait of Hormuz: అమెరికా మ్యాప్‌లో ‘‘హార్ముజ్ జలసంధి’’.. ట్రంప్ సంచలన ప్రకటన..
-
Jr NTR: ‘NTRTAIN’తో కొత్త ఇన్నింగ్స్.. సొంత ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించిన జూనియర్ ఎన్టీఆర్?
-
Jharkhand: ‘భార్యతో చెప్పా.. కావాలంటే విడాకులు తీసుకో’.. జార్ఖండ్‌లో సెలెక్టెడ్ అభ్యర్థి ఆక్రందన
-
Party Movie: అస్తిత్వాల అంతర్మథనం “పార్టీ”
-
CM Revanth Reddy: గౌడన్నలకు సీఎం రేవంత్ బిగ్ హామీ.. గీత కార్మికుల కోసం కీలక ప్రకటనలు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!