ఇటీవలి రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధరలు వరుసగా రెండు రోజులు తగ్గాయి. పెరుగుదలలో చిన్న బ్రేక్ ఇచ్చిన పసిడి ధరలు.. మరలా పెరుగుదల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.150, 24 క్యారెట్లపై రూ.160 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో శుక్రవారం (సెప్టెంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,02,050గా.. 24 క్యారెట్ల ధర రూ.1,11,330గా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,02,050గా.. 24 క్యారెట్ల ధర రూ.1,11,330గా కొనసాగుతోంది. దేశరాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల ధర రూ.1,02,200గా.. 22 క్యారెట్ల ధర రూ.1,11,480గా నమోదైంది. పండగ సీజన్లో బంగారం కొనాలనుకునే వారికి ధరల పెంపు నిరాశ కలిగిస్తోంది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించడంతో.. బంగారం ధరలు పెరిగాయని నిపుణులు అంటున్నారు.
Also Read: Asia Cup 2025: శ్రీలంక స్పిన్నర్‌కు పితృ వియోగం.. షాకైన అఫ్గాన్ బ్యాటర్!
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగానే పెరిగాయి. వరుసగా రెండు రోజులు తగ్గిన వెండి.. ఈరోజు రూ.2000 పెరిగింది. దాంతో ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,33,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 43 వేలుగా ఉంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైల్లో లక్ష 31 వేలుగా ఉంది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్లో నమోదైన గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఇవి.